Latest Updates
-
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే.. -
హోటల్ స్టైల్ ఇడ్లీ కారం పొడి..బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీ కూడా వద్దంటారు..ఇంట్లోనే ఇలా చేసుకోండి..
రోడ్ల పక్కన కనబడే ఈ ఆకు తింటే ఒంట్లొ రక్తం పెరుగుతుంది,లివర్ క్లీన్ అవుతుంది!
మన చుట్టూ ఉండే ప్రకృతిలో ఎన్నో అద్భుతమైన ఔషధ మొక్కలున్నాయి. వాటిలో అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు దాగివుంటాయి. అలాంటి ఒక అమూల్యమైన మొక్కే నీటి గోరింట. దీనిని గోకులకంత అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా రక్తహీనతతో బాధపడేవారికి ఇది ఒక సంజీవని లాంటిది. చూడటానికి సాధారణంగా కనిపించే ఈ మొక్కలో అసాధారణమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అందులో కొన్ని ముఖ్యమైనవి ఇక్కడ చూడండి.
హిమోగ్లోబిన్ కు పర్ఫెక్ట్
శరీరంలో రక్తం తక్కువగా ఉండటం, హిమోగ్లోబిన్ లెవల్ప్ పడిపోవడం వంటి సమస్యలు నేడు చాలామందిని వేధిస్తున్నాయి. నీరసం, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలకు దారితీసే ఈ సమస్యను రక్తహీనత(Anemia) అంటారు. ఈ సమస్యకు కులేఖర ఒక తిరుగులేని సహజ ఔషధం. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో, కొత్త రక్త కణాల ఉత్పత్తిని ప్రోత్సహించడంలో కులేఖర చూపించే ప్రభావం అమోఘం. ఈ విషయంలో దీనికి సాటి రాగలది మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు.

సులభంగా లభ్యం, అపారమైన ప్రయోజనాలు
ఈ ఆకు చాలా సులభంగా, మన పెరట్లో, చెరువులు లేదా నీటి వనరుల పక్కన కనిపిస్తుంది. ఏడాది పొడవునా లభించే ఈ మొక్క, దానిలో దాచుకున్న ఆరోగ్య ప్రయోజనాల పరంగా మాత్రం అత్యంత విలువైనది. ఖరీదైన మందుల కోసం వెతకాల్సిన అవసరం లేకుండా, మనకు అందుబాటులో ఉన్న ఈ ప్రకృతి వరాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.ః
ఎలా ఉపయోగించాలి?
దీనిని మన ఆహారంలో చేర్చుకోవడం చాలా సులభం. దీనిని పలు రకాలుగా ఉపయోగించుకోవచ్చు:
రసం రూపంలో: ప్రతిరోజూ 10-15 మి.లీ. (రెండు లేదా మూడు టీస్పూన్లు) నీటి గోరింట ఆకుల రసాన్ని తీసి, కొద్దిగా గోరువెచ్చని నీటిలో కలుపుకుని ఉదయాన్నే తాగితే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి.
కూరగా: ఈ ఆకులను, లేత కాండాలను ఇతర ఆకుకూరల్లాగే వండుకుని అన్నంతో పాటు తినవచ్చు. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా, శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది.
కషాయం: ఆకులను నీటిలో వేసి బాగా మరిగించి, ఆ కషాయాన్ని వడగట్టి తాగడం వల్ల కూడా రక్తహీనత సమస్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది.
రక్తహీనతే కాదు, మరెన్నో లాభాలు
నీటి గోరింట కేవలం రక్తాన్ని పెంచడానికే పరిమితం కాదు. దీని వేర్లు నిద్రలేమి సమస్యను నివారించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ప్రశాంతమైన నిద్రకు సహాయపడతాయి. అంతేకాకుండా ఇది కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, శరీరానికి బలాన్ని చేకూర్చడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
