Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఈ పండ్లు తింటే శృంగారంలో ఆగకుండా రెచ్చిపోవచ్చు!..సంతానలేమితో బాధపడేవాళ్లకు సంజీవని!
ఈ డిజిటల్ యుగంలో లక్షల మంది పురుషులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య అంగస్తంభన. అంగస్తంభన సమస్య (ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదా ED) అంటే లైంగిక సంపర్కానికి తగినంత కాలం పాటు పురుషాంగాన్ని దృఢంగా ఉంచడంలో లేదా అంగస్తంభన పొందడంలో ఇబ్బంది పడటం. ఇది చాలా మంది పురుషులను ప్రభావితం చేసే ఒక సాధారణ సమస్య. ఇది ఎప్పుడైనా జరగడం పెద్ద ఆందోళన కలిగించదు కానీ తరచుగా జరిగితే ఒత్తిడి, ఆందోళన, సంబంధ సమస్యలకు దారితీస్తుంది.
భారతదేశంలో ప్రతి 10 మంది పురుషులలో ఒకరు ఈ అంగస్తంభన సమస్యతో బాధపడుతున్నారని అంచనా. ఇది పురుషుల్లో సాధారణ సమస్యే అయినప్పటికీ చాలామంది దీనిని చాలా సీరియస్ గా తీసుకొని ఈ సమస్య నుంచి బయటపడటానికి వేలు,లక్షల రూపాయలు కూడా ఖర్చుపెడుతుంటారు. ఈ సమస్య ఉన్న మగాళ్లు తన భాగస్వామిని లైంగికంగా సంతృప్తిపర్చలేరు. అంతేకాదండోయే..తన భాగస్వామిని తల్లిని కూడా చేయలేరు. ఈ రోజుల్లో లక్షల మంది పిల్లలు పుట్టక మానసిక వేధనకు గురవుతూ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు.

ఈ సమస్య గురించి బయటకు చెప్పుకోవడానికి చాలామంది సిగ్గుపడతారు, లోలోపల మదనపడతారు. దీనివల్ల దాంపత్య జీవితంలో అసంతృప్తి, ఆత్మన్యూనత వంటివి తలెత్తుతాయి. అయితే, ఈ సున్నితమైన సమస్యకు పరిష్కారం మనకు అందుబాటులో ఉన్న కొన్ని పండ్లలోనే దాగి ఉందని ప్రముఖ డాక్టర్ ఐజాక్ అబ్బాస్ అంటున్నారు. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ ప్రకారం.. 25000 మందికి పైగా పురుషులు పాల్గొన్న ఒక పెద్దస్థాయి అధ్యయనంలో ఫ్లేవనాయిడ్లు అధికంగా ఉండే పండ్లను తీసుకోవడం వల్ల ED ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని తేలింది. కొన్ని ప్రత్యేకమైన పండ్లు శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ అనే సమ్మేళనాన్ని ఉత్పత్తి చేస్తాయని, ఇది పురుషాంగంలోని రక్త నాళాలను వికసింపజేసి, రక్త ప్రసరణను పెంచుతుందని ఆయన తెలిపారు. ఫలితంగా అంగస్తంభన ఎక్కువసేపు నిలిచి ఉంటుంది.
అద్భుతమైన పండ్లు ఏంటో చూడండి
సిట్రస్ జాతికి చెందిన నారింజ పండు అంగస్తంభన సమస్యను దాదాపు 12శాతం వరకు తగ్గించగలదు. బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ పండ్లు ఈ సమస్యను ఏకంగా 22శాతం వరకు దూరం చేయగలవు. దీనికి కారణం వీటిలో ఆంథోసైనిన్స్ అనే శక్తివంతమైన ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉండటమే. ఈ పండ్లను మీ ఆహారంలో భాగం చేసుకుంటూ, రోజూ కాస్త వ్యాయామం కూడా చేస్తే, అంగస్తంభన సమస్య ఏకంగా 38శాతం వరకు తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications