Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
తీపి తిన్నా నో టెన్షన్..ఈ 7 డ్రై ఫ్రూట్స్ తింటే షుగర్ పెరగదు!
ప్రస్తుతం భారతదేశంలో చాలామందిని వేధిస్తున్న అతిపెద్ద సమస్య డయాబెటిస్. దీనిని షుగర్ వ్యాధి అని, మధుమేహం అని కూడా అంటారు. ప్రస్తుతం మనదేశంలో దాదాపు 9 కోట్లమంది షుగర్ పేషెంట్లు ఉన్నారు. అందుకే మనదేశాన్ని వరల్డ్ డయాబెటిస్ క్యాపిటల్ అని కూడా పిలుస్తుంటారు. అయితే మీరు కూడా డయాబెటిస్ లేదా ప్రీ-డయాబెటిస్‌తో బాధపడుతున్నారా? రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం మీకు పెద్ద సవాలుగా ఉందా? తీపి పదార్థాలు అంటేనే భయపడుతున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.
కొన్ని డ్రై ఫ్రూట్స్ రక్తంలో షుగర్ లెవల్స్ ని స్థిరీకరించడంలో సహాయపడతాయి. చాలా డ్రై ఫ్రూట్స్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) తక్కువగా ఉంటుంది. వీటిని తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా,స్థిరంగా పెరుగుతాయి. సరైన మోతాదులో తీసుకుంటే, ఆరోగ్యకరమైన ఆహారంతో కలిపి తింటే ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడతాయి. అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ (ADA) తెలిపిన ప్రకారం.. గింజలు, విత్తనాలు వంటి ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలను మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల గ్లైసెమిక్ నియంత్రణలో గణనీయమైన మెరుగుదల ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను సహజంగా అదుపులో ఉంచడానికి సహాయపడే ఆ అద్భుతమైన డ్రై ఫ్రూట్స్ ఏవో ఇక్కడ చూడండి.

రక్తంలో షుగర్ లెవల్స్ ని తగ్గించే డ్రై ఫ్రూట్స్
పిస్తా
వాస్తవానికి పిస్తాపప్పులను రెగ్యులర్ గా తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గుతాయని అనేక పరిశోధనల్లో తేలింది. సమతుల్య ఆహారంలో పిస్తాపప్పులను చేర్చుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ తగ్గుతుందని, ఇన్సులిన్ స్థాయిలు మెరుగుపడతాయని ఓ అధ్యయనంలో తేలింది.
వాల్ నట్స్
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే వాల్ నట్స్.. ఇన్సులిన్ నిరోధకతకు ప్రధాన కారణమైన వాపును తగ్గిస్తాయి. వీటి GI కూడా తక్కువగా ఉంటుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ ఇవి ముందుంటాయి, ఇది షుగర్ వ్యాధి ఉన్నవారికి చాలా ముఖ్యం.
ఎండుద్రాక్ష
ఎండుద్రాక్షలో సహజ చక్కెరలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిలో ఫైబర్, ఫైటోకెమికల్స్ ఉంటాయి. ఇవి గ్లూకోజ్ జీవక్రియకు సపోర్ట్ చేస్తాయి. పరిశోధనల ప్రకారం ఎండుద్రాక్షలను మితంగా తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు గణనీయంగా పెరగవు.
బాదం
బాదంలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం, ఫైబర్ మాత్రం పుష్కలంగా ఉంటాయి. పలు అధ్యయనాల ప్రకారం బాదంపప్పు.. భోజనం తర్వాత రక్తంలో చక్కెర పెరగకుండా అడ్డుకుంటుంది. అంతేకాకుండా బాదంని దీర్ఘకాలికంగా తీసుకుంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా మెరుగుపడుతుందని అధ్యయనాల్లో తేలింది.
షుగర్ వ్యాధి ఉన్నవారికి చాలా ముఖ్యం.
జీడిపప్పు
ఇతర గింజలతో పోలిస్తే జీడిపప్పులో కొంచెం ఎక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్నప్పటికీ..వీటిలో ఉండే మెగ్నీషియం, మోనోశాచురేటెడ్ కొవ్వులు మితంగా తీసుకుంటే రక్తంలో చక్కెర నియంత్రణకు సహాయపడతాయి. కాబట్టి జీడిపప్పుని కొద్దిగానే తినాలి.
ఖర్జూరం
సాధారణంగా ఖర్జూరాలు తీపిగా ఉంటాయి కానీ వాటి GI మీడియంగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉంటుంది. ఒకసారికి 1-2 ఖర్జూరాలు వంటి చిన్న మొత్తంలో తింటే రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగకుండా శక్తిని, పోషకాలను అందిస్తాయి. వీటిని గింజలతో కలిపి తీసుకోవడం వల్ల మరింత ప్రయోజనం ఉంటుంది.
అంజీర్
ఎండిన అంజీర్ పండ్లు ఫైబర్ గొప్ప మూలం. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర నియంత్రణకు సహాయపడుతుంది. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచే సహజ సమ్మేళనాలు కూడా ఉంటాయి. వీటిని కూడా తక్కువగానే తినాలి. డయాబెటిస్ ఉన్నవారు రోజుకు 1-2 ముక్కలు తీసుకోవడం సురక్షితం అని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications