Latest Updates
-
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే.. -
హోటల్ స్టైల్ ఇడ్లీ కారం పొడి..బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీ కూడా వద్దంటారు..ఇంట్లోనే ఇలా చేసుకోండి.. -
కిడ్నీలు పాడవడానికి ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే
వైద్య చరిత్రలో అద్భుతం..గుండె ఆగిపోయినా 100 రోజులుగా బతికే ఉన్నాడు!
మనశరీరంలో అత్యంత ముఖ్యమైన అవయువం గుండె. గుండె పనిచేయడం ఆగిపోతే మరణమే. అయితే ఓ వ్యక్తి గుండె పనిచేయడం ఆగిపోయినా కూడా ఒక వ్యక్తి బతికే ఉన్నాడు. వైద్య చరిత్రలోనే ఇదొక చరిత్రగా అభివర్ణిస్తున్నారు. అయితే ఈ అద్భుతం జరిగింది ఆస్ట్రేలియాలో. గుండె సంబంధిత సమస్య ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలోని సెయింట్ విన్సెంట్ హాస్పిటల్ లో గతేడాది నవంబర్ లో 40ఏళ్ల వయస్సు ఉన్న ఓ వ్యక్తి గుండె సంబంధిత సమస్యతో జాయిన్ అయ్యాడు. గుండె ప్రాబ్లమ్ ఉండటంతో అతడికి గుండెను తొలగించి ఆర్టిఫిషియల్ గుండె అనే ఓ డివైజ్ ని అమర్చి ఈ ఏడాది ఫిబ్రవరిలో హాస్పిటల్ నుంచి రిలీజ్ డిశ్చార్జ్ చేశారు.
ఓ డివైస్ ని అమర్చి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయబడిన మొదటి వ్యక్తి ఇతనేనంట. ఆ డివైజ్ అతడికి అమర్చి 100 రోజులైనా అతడు హ్యాపీగా ఉన్నాడంట. కార్డియాక్ మెడిసిన్ ఫీల్డ్ లో ఇదొక ముఖ్యమైన మైలురాయిగా అభివర్ణిస్తున్నారు. దీనిని గుండె మార్పిడికి గేమ్ ఛేంజర్ గా అభివర్ణిస్తున్నారు. రాబోయే దశాబ్దంలో డోనర్ హార్ట్ కోసం వేచి ఉండలేని లేదా దాత అందుబాటులో లేని పేషెంట్స్ కు కృత్రిమ గుండె ఒక సాధారణ ప్రత్యామ్నాయంగా మారవచ్చని చెబుతున్నారు.

హార్ట్ ఫెయిల్యూర్ కి అద్భుత పరిష్కారం
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా హృదయ సంబంధ వ్యాధులు.. మరణానికి ప్రధాన కారణం. ప్రతి సంవత్సరం 1 కోటీ 79 లక్షల మంది గుండె సంబంధిత సమస్యల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. లాస్ట్ స్టేజ్ గుండె వైఫల్యంతో బాధపడుతున్న చాలా మంది రోగులకు..దాత గుండె కోసం వేచి ఉండటం పెద్ద ప్రాబ్లమ్ గా ఉంటుంది. ఇలాంటివారికి ఆర్టిఫిషియల్ గుండె డెవలప్ మెంట్ కొత్త ఆశను అందిస్తుంది. గుండె మార్పిడికి దీర్ఘకాలిక ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది, క్లిష్టమైన స్థితిలో ఉన్నవారికి జీవించే అవకాశాలను పెంచుతుంది.
కృత్రిమ గుండె ఎలా పనిచేస్తుంది
BiVACOR వ్యవస్థాపకుడు, ఆస్ట్రేలియన్ బయో ఇంజనీర్ డాక్టర్ డేనియల్ టిమ్స్ తన తండ్రి గుండె జబ్బుతో మరణించినందుకు ప్రతిస్పందనగా కృత్రిమ హృదయాన్ని అభివృద్ధి చేశారు. BiVACOR డెవలప్ చేసిన కృత్రిమ గుండె వైద్య సాంకేతిక పరిజ్ఞానంలో ఒక పురోగతిని సూచిస్తుంది. ఇది ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్‌లో ఉంది, విస్తృత ఉపయోగం కోసం ఇంకా ఆమోదించబడలేదు.
సాంప్రదాయ యాంత్రిక గుండె పంపుల మాదిరిగా కాకుండా BiVACOR టోటల్ ఆర్టిఫిషియల్ హార్ట్ (TAH) ఒకే కదిలే భాగాన్ని కలిగి ఉంటుంది..అది అయస్కాంతంగా లెవిటేటెడ్ రోటర్. టైటానియంతో తయారు చేయబడిన ఈ రోటర్ అయస్కాంతాల ద్వారా సస్పెండ్ చేయబడింది, కవాటాలు లేదా యాంత్రిక బేరింగ్ ల అవసరాన్ని తొలగిస్తుంది. ఈ డివైజ్ శరీరానికి, ఊపిరితిత్తులకు సమర్ధవంతంగా రక్తాన్ని పంపుతుంది. విఫలమైన గుండె రెండు జఠరికలను ఈ కృత్రిమ గుండె సమర్థవంతంగా భర్తీ చేస్తుంది.
గుండె మార్పిడికి కొత్త యుగం
ఈ సంచలనాత్మక ప్రయోగం మెడికల్ ఫీల్డ్ లో ఆశను రేకెత్తించింది. BiVACOR వ్యవస్థాపకుడు ఈ డివైజ్ విజయం గురించి మాట్లాడుతూ.. దీనిని ఒక ఉత్తేజకరమైన మైలురాయిగా అభివర్ణించాడు. సాంకేతికతపై నమ్మకం ఉంచినందుకు రోగి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ కృతజ్ఞతలు తెలిపాడు. ఆ పేషెంట్ ధైర్యం భవిష్యత్తులో అనేక మంది రోగుల ప్రాణాలను రక్షించే ఆవిష్కరణ నుండి ప్రయోజనం పొందేందుకు మార్గం సుగమం చేస్తుందని ఆయన చెప్పారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
