Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
జిమ్ లో కష్టపడుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే ఈ 3 డ్రై ఫ్రూట్స్ మీ కోసమే
చాలా మంది బరువు తగ్గాలనే దృఢ సంకల్పంతో జిమ్ లో చేరతారు. గంటల తరబడి ట్రెడ్‌మిల్ పై పరుగెడుతుంటారు, బరువులు ఎత్తుతుంటారు. కానీ ఆశించిన స్థాయిలో ఫలితాలు కనిపించక నిరాశకు గురవుతుంటారు. బరువు తగ్గడం అనేది కేవలం వ్యాయామంపై మాత్రమే ఆధారపడి ఉండదు. ఇది 30శాతం వ్యాయామం..70శాతం మనం తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది.
మీరు మీ బరువు తగ్గించే ప్రయాణాన్ని వేగవంతం చేయాలనుకుంటే, ఆరోగ్యకరమైన,సమతుల్య ఆహార ప్రణాళికను అనుసరించడం తప్పనిసరి. ఇందులో భాగంగా కొన్ని డ్రై ఫ్రూట్స్ బరువు తగ్గడంలో కీలకు పాత్ర పోషిస్తాయి. డ్రై ఫ్రూట్స్ అనగానే కొవ్వు ఎక్కువగా ఉంటుందని చాలామంది అపోహ పడుతుంటారు. కానీ సరైన పరిమాణంలో సరైన పద్ధతిలో తీసుకుంటే ఇవి మీ శరీరంలోని అదనపు కొవ్వును కరిగించడానికి సహాయపడతాయి. ఆ మూడు అద్భుతమైన డ్రై ఫ్రూట్స్ ఏవో ఇక్కడ చూడండి.

బాదం
బరువు తగ్గాలనుకునే వారికి బాదం ఒక వరం లాంటిది. బాదంలో ప్రోటీన్,ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల, కొన్ని బాదం పప్పులు తినగానే మీ కడుపు నిండిన భావన కలుగుతుంది. దీనివల్ల మీరు అనవసరమైన స్నాక్స్ లేదా జంక్ ఫుడ్ తినకుండా ఉంటారు. ఆకలి నియంత్రణలో ఉండటం వల్ల క్యాలరీల వినియోగం తగ్గుతుంది.
ఎలా తినాలి?: బాదం పప్పులను నేరుగా తినడం కంటే నానబెట్టి తినడం చాలా శ్రేయస్కరం. ప్రతి రాత్రి పడుకునే ముందు 5-6 బాదం పప్పులను నీటిలో నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం వాటి తొక్క తీసి పరగడుపున తినండి. తొక్క తీయడం వల్ల పోషకాలు శరీరానికి సులభంగా అందుతాయి.
అంజీర్
మీ బరువు తగ్గించే ప్రయాణాన్ని సులభతరం చేయాలనుకుంటే మీ రోజువారీ ఆహారంలో అంజీర్ పండ్లను తప్పక చేర్చుకోవాలి. అంజీర్ లో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి, కానీ ఫైబర్ మాత్రం అత్యధికంగా ఉంటుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో అంజీర్ అద్భుతంగా పనిచేస్తుంది. మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేసి, పొట్ట చుట్టూ ఉన్న ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.
ఎలా తినాలి?: బరువు తగ్గడానికి ప్రతిరోజూ ఒకటి నుండి రెండు అంజీర్ పండ్లను తినవచ్చు. వీటిని కూడా రాత్రిపూట నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటితో సహా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
వాల్ నట్స్
ట వాల్ నట్స్ లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇది జీవక్రియను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది, తద్వారా శరీరం కొవ్వును వేగంగా కరిగిస్తుంది.
ఎలా తినాలి: వాల్‌నట్స్ ను కూడా నీటిలో నానబెట్టిన తర్వాతే తినాలి. రోజుకు 2-4 వాల్ నట్స్ తినవచ్చు. నానబెట్టడం వల్ల వీటిలోని ఉష్ణ తత్వం తగ్గి, సులభంగా జీర్ణం అవుతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications