Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అతిగా నిద్రపోతే ఇన్ని ప్రమాదాలు వుంటాయ్..! గుండె జబ్బు, డిప్రెషన్, ఇంకా ఎన్నో..!
ప్రస్తుతం కనీసం 6 గంటలు కూడా సరిగ్గా నిద్రపోని వారి సంఖ్య పెరుగుతుందని సర్వేలు చెబుతున్నాయ్. షాపింగ్, సినిమాలు, షికార్లు అంటూ వెళ్లేవారు ప్రతీ రోజూ చాలా ఆలస్యంగా నిద్రపోతారు. ఇలాంటి వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా వున్నాయ్. నిద్రపోవడం అవసరమా. నిద్రపోవడం వల్ల టైమ్ వేస్ట్ కదా అని కూడా చాలా మంది అనుకుంటారు. గాలి, ఆహారం ఎంత ముఖ్యమో, నిద్ర కూడా అంతే ముఖ్యమని వైద్యులు మనకు చెబుతున్నారు.
నిద్ర తగ్గితే ఆరోగ్యం చెడిపోతుంది. రోజూ ఏడు గంటల కంటే తక్కువ నిద్రపోయేవారికి బిపి, షుగర్ పెరుగుతుంది, మానసిక సమస్యలు వస్తాయ్, లావు అవుతారు. నిద్రను ఎట్టి పరిస్తితిలో నిర్లక్ష్యం చేయవద్దు. టీనేజర్లు తొమ్మిది గంటలు నిద్రపోవాలి, యుక్త వయసులో వున్నవారు 8 గంటలు నిద్రపోవాలి. స్కూలుకు వెళ్లే పిల్లలకు 9 గంటలు, పసిపిల్లలకు 16 గంటలు నిద్ర చాలా అవసరం.

పుట్టినప్పటి నుంచి 3 నెలల వరకు వయసున్న పిల్లలు రోజుకు 17 గంటలు నిద్రపోవాలి. 4 నుంచి 11 నెలల చిన్నారులు 12 నుంచి 16 గంటలు నిద్రపోవాలి. 1 నుంచి 2 సంవత్సరాల పిల్లలైతే 11 నుంచి 14 గంటల వరకు నిద్రపోవాలి. 3 నుంచి 5 సంవత్సరాల వారు 10 నుంచి 13 గంటల వరకు నిద్ర పోవాలి. 6 నుంచి 12 సంవత్సరాల వయసు వున్న వారు 9 నుంచి 12 గంటలు నిద్రపోవాలి. 13 నుంచి 18 సంవత్సరాల వారైతే 8 నుంచి 10 గంటలు నిద్రలోనే గడపాలి. 18 నుంచి 64 సంవత్సరాల వారికి 7 నుంచి 9 గంటల నిద్ర అవసరం. 65 ఏళ్ల పైబడిన వారు 9 గంటలు నిద్రపోవాల్సిన అవసరం వుంది. గర్భినీ స్త్రీలు మొదటి మూడు నెలలు సాధారణం కంటే ఎక్కువ గంటలు నిద్రించాల్సి వుంటుంది.
అత్యధిక సమయం నిద్రపోవడం ఆరోగ్యానికి హానికరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల గుండెపోటు, మధుమేహం, తదితర వ్యాధుల ముప్పు అధికమవుతుందని తేలింది. అస్తవ్యస్తంగా పడుకుంటే చర్మం మీద ముడతలు కూడా వస్తాయని, దీంతో వయసు ఎక్కువగా వున్నట్లు కనబడతారని పరిశోధకులు చెబుతున్నారు. వెల్లకిలా పడుకొని చేతులు తిన్నగా వుంచి పడుకోవడం ఉత్తమమని అంటున్నారు. పడుకునే ముందు ముఖాన్ని తాజా నీటితో శుభ్రపరుచుకోవాలి. దీని వల్ల చర్మం ఆరోగ్యంగా వుంటుంది. ముఖం కడుక్కున్న తరువాత మాయిశ్చరైజర్ క్రీం రాయడం మంచిది కాదని అంటున్నారు.

అతిగా నిద్రపోయే వారికి గుండెపోటు వచ్చే అవకాశాలు 150 శాతం అధికంగా వున్నట్లు న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చెప్పారు. డిప్రెషన్ వల్ల అతినిద్ర పోతున్నారని మానసిక విశ్లేషకులు చెబుతున్నారు. బరువు పెరగడానికి కూడా అతినిద్ర కారణమవుతుంది. మనసులో అలజడి, శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. రాత్రుళ్లు సెల్ ఫోన్ అధికంగా ఉపయోగించడం, టీవీ ఎక్కువగా చూడ్డం వల్ల అతి నిద్ర ఎక్కువగా వస్తుందని అంటున్నారు.
అతి నిద్ర నుంచి తప్పించుకోవాలంటే ఒక ఒకే సమయంలో నిద్రపోవడం లేవడం చేయాలి. మద్యం తాగడాన్ని తగ్గించాలి. రోజూ కొంత వ్యాయామం చేయాలి, జంక్ ఫుడ్ తగ్గించాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications