Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
మెదుడుని కత్తిలా షార్ప్ గా మార్చే సూపర్ ఫుడ్..వంటగదిలో ఉంటది,99శాతం మంందికి తెలియని రహస్యం
ఆరోగ్యమే మహాభాగ్యమని మన పెద్దలు ఊరికే చెప్పలేదు. కరోనా తర్వాత ప్రపంచం మొత్తానికి కళ్ల ముందు కనిపించిన సత్యం ఇది. జీవితంలో ఏదీ లేకున్నా ఆరోగ్యం ఉంటే చాలు అదే కోటి రూపాయలు అనే స్థాయికి అందరూ వచ్చేశారు. అందుకే ప్రజల లైఫ్ స్టైయిల్ క్రమంగా మారుతోంది. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఫుడ్ తినడం తప్పనిసరి. మెదడు ఆరోగ్యాన్ని పెంచడంతో పాటు చిత్తవైకల్యం ప్రమాదాన్ని కూడా తగ్గించే ఒక సూపర్‌ఫుడ్ మన వంటగదిలో ఉండేదే అని హార్వర్డ్ లేటెస్ట్ స్టడీ చెబుతోంది. అయితే మన వంటగదిలో ఉన్న సూపర్ ఫుడ్ ఏంటీ? మెదుడు ఆరోగ్యానికి అది ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం.
ఈ సూపర్ ఫుడ్ ఇదే
హార్వర్డ్ అధ్యయనంలో ఆలివ్ ఆయిల్ సూపర్ ఫుడ్ అని తేలింది. 2024 హార్వర్డ్ అధ్యయనం ప్రకారం రోజుకు కనీసం 7 గ్రాముల ఆలివ్ నూనెను తినేవారికి..అరుదుగా ఆలివ్ ఆయిల్ తీసుకోని వారి కంటే చిత్తవైకల్యం సంబంధిత మరణానికి 28 శాతం తక్కువ ప్రమాదం ఉంటుందట.

ఎందుకు అంత ముఖ్యమైనది?
ఆలివ్ ఆయిల్ అభిజ్ఞా పనితీరుకు మద్దతు ఇస్తుంది, వయస్సు సంబంధిత క్షీణతను నివారించడంలో సహాయపడుతుంది. ఆలివ్ ఆయిలో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి మెదడు కణాల సమగ్రత,పనితీరుకు మద్దతు ఇస్తాయి. ఆలివ్ ఆయిల్ అల్జీమర్స్, పార్కిన్సన్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది మెదడు వాపు, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించే పాలీఫెనాల్స్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. మెదడుకు రక్త ప్రసరణను పెంచుతుంది, వాస్కులర్ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.
న్యూరోడీజెనరేటివ్ వ్యాధుల నుండి రక్షించడానికి కూడా ఆలివ్ ఆయిల్ సహాయపడుతుంది. ఆలివ్ ఆయిల్ అల్జీమర్స్, పార్కిన్సన్స్ ప్రమాదంతోపాటు అనేక ఇతర ప్రయోజనాలు కూడా అందిస్తుందని నిపుణులు తెలిపారు.
ఇడ్లీ,దోశ, పూరీ వద్దు..ఓ కప్పు పొద్దున్నే ఇది తింటే ఏ రోగాలు రావు,ఎలా చేయాలంటే
ప్రతిరోజూ ఆహారంలో ఎలా తీసుకోవచ్చు?
ఉదయం పూట లేదా మధ్యాహ్నం బూస్ట్‌గా ఒకటి నుండి రెండు టేబుల్ స్పూన్ల అధిక నాణ్యత గల, కోల్డ్ ప్రెస్డ్ ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ తీసుకోండి. కొద్దిగా నిమ్మరసం, చిటికెడు పసుపును అందులో జోడించవచ్చు. మెడిటరేనియన్ డైట్‌లో లాగా దోసకాయ ముక్కలు కోసి, కొద్దిగా ఆలివ్ ఆయిల్, నిమ్మరసం,చిటికెడు ఉప్పుతో కలిపి తీసుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications