Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
భారీ శుభవార్త చెప్పిన సైంటిస్టులు..నెలలో 21సార్లు శృంగారంలో పాల్గొంటే ఆ రిస్క్ ఉండదట
శృంగారం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ భాగం. శృంగారం రెండు శరీరాల కలయిక మాత్రమే కాదు,ఇది ఇరువురికి శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎంతో మేలు చేస్తుంది. భార్యాభర్తల మధ్య బంధాన్ని బలోపేతం చేయడంలో శృంగారం కీలక పాత్ర పోషిస్తుంది.ఈ శారీరక కలయిక ఇద్దరి మధ్య విడదీయరాని మానసిక బంధాన్ని ఏర్పరుస్తుంది. అయితే భాగస్వామితో శృంగార సంబంధం పురుషులకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది పురుషులకు ఆనందాన్ని ఇవ్వడమే కాకుండా అనేక వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
ప్రస్తుతం ప్రోస్టేట్ క్యాన్సర్(prostate cancer in men) పురుషులకు పెద్ద సమస్యగా మారింది. ప్రతి సంవత్సరం వేలాది మంది పురుషులు ప్రోస్టేట్ క్యాన్సర్ తో చనిపోతున్నారు. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ యొక్క డేటా ప్రకారం ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 15లక్షల మంది పురుషులు ప్రోస్టేట్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఈ సంఖ్య నిరంతరం పెరగడం ఆందోళన కలిగిస్తుంది. అయితే శృంగారంలో పాల్గొనడం ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని హార్వర్డ్ శాస్త్రవేత్తలు తెలిపారు. క్రమం తప్పకుండా స్కలనం(ejaculating) చేసే పురుషులకు ఇతర పురుషుల కంటే ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం మూడింట ఒక వంతు తక్కువగా ఉంటుందని సైంటిస్టులు ఓ పరిశోధన ఆధారంగా తెలిపారు.

21సార్లు స్కలనం జరిగేతే ప్రోస్టేట్ క్యాన్సర్ టెన్షన్ ఉండదు
పురుషులు తమ భాగస్వామితో నెలలో 21 లేదా అంతకంటే ఎక్కువ సార్లు శృంగారంలో పాల్గొంటే చేస్తే..వారి ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని దాదాపు 31 శాతం తగ్గించవచ్చని హార్వర్డ్ మెడికల్ స్కూల్ అధ్యయనం తెలిపింది. ఈ డేటా పురుషుల జీవనశైలి, ఆరోగ్యం, ఆహారం ఆధారంగా రూపొందించబడింది. ఆసక్తికరమైన విషయమేమిటంటే భాగస్వామితో శారీరక సంబంధంతో పాటు తమ లైంగిక సంతృప్తి కోసం ఇతర పద్ధతులను కూడా అవలంబిస్తే కూడా ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు. తమ నుండి లైంగిక సంతృప్తిని పొందే పురుషుల ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. వాస్తవానికి ప్రోస్టేట్ అనేది పునరుత్పత్తి అవయవం..ఇది లైంగిక సంతృప్తి కోసం ద్రవాన్ని ఉత్పత్తి చేస్తుంది. .
రీసెర్చ్ సాగిందిలా
ఈ రీసెర్చ్ కోసం హార్వర్డ్ సైంటిస్టులు 1986 నుండి పెద్ద సంఖ్యలో ఆరోగ్య కార్యకర్తల నుండి డేటాను సేకరించారు. 46-81 సంవత్సరాల వయస్సు గల 29342 మంది పురుషులు తమ లైంగిక కార్యకలాపాల గురించి సమాచారాన్ని నివేదించారు. తమ భాగస్వామితో లేదా తాను తరచుగా పొందుతున్న లైంగిక సంతృప్తి, తన పునరుత్పత్తి అవయవాల నుండి ద్రవం బయటకు వచ్చే విషయాలను రీసెర్చర్లకు వివరించారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications