Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
కాకరకాయ టీ ఎప్పుడైనా తాగారా? ప్రయోజనాలు తెలిస్తే రోజూ తాగుతారు
కాకరకాయ పేరు వింటేనే చాలామంది ఆమడ దూరం పరుగెత్తుతారు. మార్కెట్ లో కాకరకాయ వైపు కన్నెత్తి చూడని వాళ్లు చాలామంది ఉంటారు. ఉడికించినా, వేయించినా, ఎండబెట్టినా లేదా ఊరగాయ పెట్టినా.. దాని చేదు రుచి కారణంగా ఇది చాలా మందికి నచ్చని కూరగాయగానే మిగిలిపోయింది.
అయితే చేదుగా ఉండేవి ఆరోగ్యానికి మంచివని పెద్దలు ఊరకనే అనలేదు. ఈ శీతాకాలంలో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కాకరకాయ ఒక సంజీవనిలా పనిచేస్తుంది. కూరగా తినడం ఇష్టం లేకపోతే, కనీసం టీ రూపంలోనైనా దీనిని తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

సెలబ్రిటీల సీక్రెట్ ఇదే
మనం ముఖం చాటేసే కాకరకాయ అంటే సినిమా తారలకు మాత్రం మహా ఇష్టం. బాలీవుడ్ ఫిట్‌నెస్ ఐకాన్ రకుల్ ప్రీత్ సింగ్ స్వయంగా తన తోటలో కాకరకాయలను పెంచుకుని మరీ తినడానికి ఇష్టపడతారు. ఇక కరీనా కపూర్ ఖాన్ గర్భవతిగా ఉన్నప్పుడు కాకరకాయ తినడానికే ఎక్కువ ఆసక్తి చూపించేవారట.
దివంగత నటుడు ధర్మేంద్ర అయితే కాకరకాయను బెల్లంతో కలిపి ఆరగిండానికి ఇష్టపడేవారు. అంతటి స్టార్లే కాకరకాయను తమ డైట్ లో భాగం చేసుకున్నప్పుడు మనం ఎందుకు దూరం పెట్టాలి?
ఆరోగ్య సృహ ఉన్న చాలామంది కాకరకాయతో ఇతర పండ్లు, కూరగాయలు కలిపి స్మూతీలు లేదా టీ చేసుకొని తాగుతున్నారు. మరి ఆ కాకరకాయ టీని సులభంగా ఎలా తయారు చేసుకోవాలో,దాని ప్రయోజనాలు ఏంటో ఇక్కడ చూడండి.
కాకరకాయ టీ తయారీ విధానం
-ముందుగా కాకరకాయను శుభ్రంగా కడిగి, గుండ్రటి ముక్కలుగా కోసుకోవాలి.
-ఒక గిన్నెలో నీటిని తీసుకుని, అందులో ఈ ముక్కలను వేసి మీడియం మంటపై సుమారు 10 నిమిషాల పాటు మరిగించాలి.
-నీరు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆపేసి గిన్నెపై మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలాగే వదిలేయాలి. దీనివల్ల కాకరకాయలోని సారం నీటిలోకి దిగుతుంది.
-తర్వాత ఆ నీటిని ఒక కప్పులోకి వడకట్టుకోవాలి.
-రుచి కోసం లేదా చేదును తగ్గించడానికి ఇందులో తగినంత తేనె లేదా బెల్లం కలుపుకోవచ్చు. దీనిని వేడి టీ లాగా సిప్ చేస్తూ తాగాలి.
ఈ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు
-కాకరకాయ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి ఇది ఒక దివ్యౌషధం.
-చలికాలంలో గొంతు నొప్పి లేదా గరగర ఉంటే, వేడివేడి కాకరకాయ టీ తాగడం వల్ల గొంతుకు మంచి ఉపశమనం లభిస్తుంది.
-ఇది రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
-కాలేయాన్ని శుభ్రపరచడంలో కాకరకాయ టీ కీలక పాత్ర పోషిస్తుంది.
-ఇందులోని పోషకాలు కంటి చూపును మెరుగుపరచడంతో పాటు, సీజనల్ వ్యాధుల నుండి పోరాడే రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications