Latest Updates
-
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే.. -
హోటల్ స్టైల్ ఇడ్లీ కారం పొడి..బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీ కూడా వద్దంటారు..ఇంట్లోనే ఇలా చేసుకోండి.. -
కిడ్నీలు పాడవడానికి ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే -
ఇడ్లీ,దోశ,చపాతీల్లోకి కేక పుట్టించే చికెన్ నిర్వాణ..బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు -
పెద్ద ఎర్రిపప్ప అయ్యావ్ మావా: ప్రియురాలి కోసం మొత్తం అమ్మేసి 1900 కి.మీ ప్రయాణించి వెళ్తే..అసలు అమ్మాయే కాదట! -
దసరా స్పెషల్ నైవేద్యం చక్కెర పొంగలి..సంప్రదాయ పద్ధతిలో ఇలా చేస్తే ఇళ్లంతా డివోషనల్ వైబ్ -
దసరా స్పెషల్ కట్టె పొంగలి..ఇలా చేస్తే చల్లారినా కూడా గట్టిగా మద్ద అవ్వదు! -
దసరా నాడు అపరాజితా దేవి పూజ ఎలా చేయాలి? శుభ ముహూర్తం, మంత్రాలు, శమీ పూజ డీటెయిల్స్.. -
దసరా స్పెషల్ రెడ్ చికెన్.. చికెన్ కర్రీ వండేటప్పుడు ఈ సీక్రెట్ మసాలా వేస్తే టేస్ట్ నెక్ట్స్ లెవల్ అంతే! -
హ్యాపీ విజయదశమి 2026..మీ బంధుమిత్రులకు దసరా విషెస్ చెప్పండిలా..
Black Coffee: ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ మరియు బ్లాక్ టీ తాగకండి!ఇది చాలా ప్రమాదకరం..
Black Coffee Or Black Tea Sideeffects: ప్రస్తుత ఫాస్టెస్ట్ లైఫ్ స్టైల్లో మనందరం మన ఆరోగ్యం(health) పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ఎందుకంటే మన శరీరంలోని అన్ని భాగాలు ఒకదానికొకటి లింక్ లాగా అనుసంధానించబడి ఉంటాయి. అందువలన, మనం ఏ ఒక్క భాగాన్నైనా నిర్లక్ష్యం చేస్తే అది ఇతర భాగాన్ని ప్రభావితం చేస్తుంది.
ఉదయం పూట ఖాళీ కడుపుతో కాఫీ(coffee), టీ(Tea)లు తీసుకోకపోతే బ్లాక్ కాఫీ(black coffee) లేదా బ్లాక్ టీ(black tea) తాగడం అలవాటు చేసుకుంటాం. అంటే మనం మన జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం.. దీని వల్ల మన శరీరంలోని వివిధ భాగాలలో రకరకాల దుష్ప్రభావాలు(side effects) ఎదురవుతున్నాయి.. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందాం.

ఉదయం పరగడుపున బ్లాక్ కాఫీ OR బ్లాక్ కాఫీ తాగడం వల్ల ఆరోగ్యానికి కలిగే దుష్ప్రభావాలు:
ఇది అసిడిటీని కలిగిస్తుంది!
బ్లాక్ టీ లేదా బ్లాక్ కాఫీ చాలా ఆమ్ల ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఖాళీ కడుపుతో దీన్ని తాగడం వల్ల శరీరంలో pH స్థాయి అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది శరీరంలో అసిడిటీ(Acidity)ని మరింత పెంచుతుంది మరియు తద్వారా అజీర్ణం(digestion) సమస్య సర్వసాధారణం అవుతుంది.
డీహైడ్రేషన్ సమస్య
బ్లాక్ టీలో థియోఫిలిన్(theophylline) అనే పదార్ధం ఉంటుంది, ఇది మన శరీరంలో నీటి శాతాన్ని చాలా వరకు తగ్గిస్తుంది మరియు డీహైడ్రేషన్ (dehydration)సమస్యను కలిగిస్తుంది.
మలబద్ధకం సమస్య
పైన చెప్పినట్లుగా, బ్లాక్ టీ తాగడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. ఇది సాధారణంగా మన శరీరంలోని పెద్ద పేగులో మొదట పేరుకుపోయి మలబద్ధకం(constipation) సమస్యకు దారి తీస్తుంది.

దంతాల పై పొర అదృశ్యమవుతుంది
బ్లాక్ టీ సాధారణంగా ఆమ్ల ప్రభావాన్ని కలిగి ఉంటుంది మరియు ఉదయం ఖాళీ కడుపుతో త్రాగడం వల్ల నోటితో సహా శరీరం అంతటా ఆమ్ల ప్రభావం పెరుగుతుంది. ఇది దంతాల ఎనామిల్ కుళ్ళిపోవడానికి మరియు చిగుళ్ల సమస్యలకు దారితీస్తుంది.
కడుపు సమస్య
ఉదయాన్నే బ్లాక్ కాఫీ లేదా బ్లాక్ టీ తాగడం వల్ల చాలా మందికి కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది మరియు ఉబ్బరం(stomach bloting) పెరుగుతుంది. ఎందుకంటే బ్లాక్ టీలో ఆమ్ల ప్రభావం ఉంటుంది.
బ్లాక్ టీని ఏ సమయంలో తాగడం మంచిది?
బ్లాక్ టీ తాగడం ఆరోగ్యానికి మంచిది. అయితే నిర్ణీత సమయంలో తాగాలి.భోజనం చేసిన రెండు గంటల తర్వాత తాగాలి. మీకు ఆరోగ్య స్పృహ ఉంటే పాలు, పంచదార కలపకుండా తాగవచ్చు. ఖాళీ కడుపుతో మొదటి ఆహారంగా పాలు, పంచదార కలిపి కాఫీ లేదా టీ తాగడం ఆరోగ్యానికి చాలా హానికరం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
