Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
బూడిద గుమ్మడికాయతో బోలెడు ప్రయోజనాలు..ఆరోగ్యానికి ఇదే రహస్యం
మనందరికీ సుపరిచితమైన తెల్ల గుమ్మడికాయ లేదా బూడిద గుమ్మడికాయ మన ఆరోగ్యానికి ప్రకృతి ప్రసాదించిన ఒక అద్భుతమైన వరం. కేవలం రుచికరమైన కూరగానే కాకుండా, ఎన్నో అనారోగ్య సమస్యలకు సంజీవనిలా పనిచేసే ఔషధ గని తెల్ల గుమ్మడికాయ. ఇందులో మన శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.
విటమిన్ బి, విటమిన్ సి, కాల్షియం, పొటాషియం, ఐరన్, ఫైబర్, భాస్వరం వంటి పోషకాలతో నిండిన తెల్ల గుమ్మడికాయ ముఖ్యంగా చలికాలంలో వాత, పిత్త, కఫ దోషాల వల్ల కలిగే వ్యాధులను నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. ఈ కాయను స్వీట్లు, కూరలు, జ్యూస్ ల తయారీలో కూడా విరివిగా వాడతారు.

జీర్ణవ్యవస్థకు రక్షణ కవచం
మన జీర్ణవ్యవస్థకు తెల్ల గుమ్మడికాయ ఒక రియల్ ఫ్రెండ్ అని నిపుణులు చెబుతున్నారు. కారంగా ఉండే ఆహారం తినడం వల్ల లేదా ఎక్కువసేపు ఉపవాసం ఉండటం వల్ల వచ్చే ఎసిడిటీ, కడుపులో మంట వంటి సమస్యలను ఇది సమర్థవంతంగా తగ్గిస్తుంది.
కడుపు,పేగులలో ఏర్పడే పుండ్లను (అల్సర్లను) నివారించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఇది ఒక సహజ యాంటీమైక్రోబయల్ ఏజెంట్ గా పనిచేసి, కడుపులోని హానికరమైన బ్యాక్టీరియాను శుభ్రపరిచి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఆరోగ్యకరమైన బరువుకు మార్గం
మీరు బరువును అదుపులో ఉంచుకోవాలనుకుంటున్నారా? అయితే తెల్ల గుమ్మడికాయ రసం లేదా కూర మీ ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో దాదాపు 96శాతం నీరు ఉండటం వల్ల కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి.
ఇది కేవలం బరువు తగ్గడానికే కాకుండా ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది. అధిక బరువు ఉన్నవారికి బరువు తగ్గడానికి, అదే సమయంలో తక్కువ బరువు ఉన్నవారికి జీవక్రియను వేగవంతం చేసి సాధారణ బరువును పొందడానికి ఇది దోహదపడుతుంది.
సౌందర్యానికి సహజమైన మెరుపు
తెల్ల గుమ్మడికాయ కేవలం ఆరోగ్యానికే కాదు, అందానికి కూడా మేలు చేస్తుంది. దీని రసాన్ని కొద్దిగా నిమ్మరసంతో కలిపి ముఖానికి ప్యాక్ లా వేసుకుంటే చర్మంపై ఉన్న మచ్చలు తొలగిపోయి సహజమైన నిగారింపు వస్తుంది.
అలాగే చుండ్రు సమస్యతో బాధపడేవారు దీని రసాన్ని కొబ్బరి నూనెతో కలిపి తలకు పట్టించి, కాసేపటి తర్వాత స్నానం చేస్తే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి.
రక్తస్రావాన్ని అరికట్టే అద్భుత శక్తి
తెల్ల గుమ్మడికాయ ఆకులు కూడా ఎంతో ప్రయోజనకరమైనవి. గాయమైనప్పుడు ఈ ఆకులను నూరి పైన పూస్తే రక్తం కారడం ఆగిపోతుంది. వేసవిలో వచ్చే ముక్కు నుండి రక్తస్రావం, మూలవ్యాధి వంటి అంతర్గత రక్తస్రావ సమస్యలను తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications