Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
రాత్రి పడుకునే ముందు ఈ పదార్థం తింటే చాలు,ఇక రేస్ గుర్రమే!
ప్రతి ఒక్కరి వంటగదిలో ఉండే వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అనేక వ్యాధులను నయం చేసుకోవచ్చు. అలాంటి ఒక సుగంధ ద్రవ్యమే లవంగం. దీనిని ఆయుర్వేదంలో ఒక అద్భుతమైన మూలకంగా పరిగణిస్తారు. ఈ లవంగం వలన అనేక ప్రయోజనాలు దొరుకుతాయి. శరీరానికి వీటి వల్ల అనేక మేలు జరుగుతుంది. చాలా మంది కూరల్లో ఇవి వస్తే తీసి పడేస్తారు. కానీ వీటిని తినడం వల్ల అనేక వైరల్ వ్యాధుల బారి నుంచి తప్పించుకోవచ్చు. అయితే ఈ స్టోరీలో లవంగాల వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు దొరుకుతాయి? వీటిని ఏ విధంగా వినియోగించాలి అనేది తెలుసుకుందాం.
జీర్ణ సమస్యల నుంచి ఉపశమనానికి
ఎన్నో సంవత్సరాలుగా లవంగాలను ఆయుర్వేదంలో గొప్ప ఔషధంగా వినియోగిస్తున్నారు. లవంగాలను రాత్రి పడుకునే ముందు రెండు లవంగాలు తీసుకుంటే జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చట. లవంగాలు తీసుకోవడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యల బారి నుంచి బయటపడొచ్చు.

జలుబు, దగ్గు నుంచి ఉపశమనం
లవంగాలలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చాలా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. అలాగే జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. దగ్గు, జలుబు కారణంగా ఎవరైనా బాధపడితే లవంగాలు తీసుకోవడం వలన భారీగా ఉపయోగం పొందొచ్చని ఆరోగ్య నిపుణులతో పాటు, ఆయుర్వేద నిపుణులు కూడా సూచిస్తున్నారు.
చిగుళ్ల సమస్య పరిష్కారానికి
లవంగంలో యూజినాల్ అనే పదార్ధం ఉంటుంది. ఇది పంటి నొప్పి, చిగుళ్ల వాపు వంటి సమస్యలను దూరం చేస్తుంది. అందుకే చాలా మంది టూత్ పేస్ట్‌లో లవంగాలు ఉన్న పేస్ట్‌ను తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. వీటిని తీసుకోవడం వలన దంతాలకు మంచి ఉపయోగాలు కలుగుతాయి.
నిద్ర మెరుగుపడుతుంది
లవంగాలను తీసుకోవడం వలన నాడీ వ్యవస్థ ప్రశాంతంగా ఉంటుంది. దీని కారణంగా రక్త ప్రసరణ సరిగ్గా జరగడంతో పాటు నిద్ర కూడా మంచిగా పడుతుంది. దీంతో ఆరోగ్యం కూడా బాగుంటుంది. అందుకే రాత్రుళ్ళు రెండు లవంగాలు వేసుకొని పడుకోవడం వలన నిద్ర మంచిగా పడుతుందని వైద్యులు చెబుతుంటారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications