Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
వామ్మో.. గరం మసాలా వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా, తెలిస్తే పచ్చిగా కూడా తేనేస్తారు!
ప్రతి ఒక్కరి ఇంట్లో గరం మసాలా కచ్చితంగా ఉంటుంది. ఏ చిన్న కూర చేసినా కొంతమంది మసాలాను వినియోగిస్తారు. గరం మసాలా లేకపోతే ఆ కూర సరైన రుచి కూడా రాదు. అందుకే ప్రతి ఒక్కరూ కచ్చితంగా గరం మసాలాను కూరల్లో వినియోగిస్తారు. అయితే ఇప్పటి వరకు చాలా మందికి గరం మసాలా కూరలకు మాత్రమే వినియోగిస్తారని తెలుసు. కానీ ఈ మసాలా వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇందులో చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే గరం మసాలా వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
గరం మసాలా వలన కలిగే ప్రయోజనాలు
గరం మసాలా అనేది వంటగదిలో అత్యంత ముఖ్యమైన పదార్థం. గరం మసాలాలో వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు ఉండటం వల్ల అందులోని ఔషధ గుణాలు ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. గరం మసాలా.. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో గరం మసాలాలో ఉండే నల్ల మిరియాలు, లవంగాలు, కఫాన్ని తొలగించడంలో, గొంతు నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.

వర్షా కాలం లేదా శీతాకాలంలో ప్రజలు ఎక్కువగా వేయించిన ఆహారాలను తినాలని అనుకుంటూ ఉంటారు. వారిలో ఆ కోరికలు ఎక్కువగా పుడుతుంటాయి. అటువంటి సమయంలో సహజంగా జీర్ణశక్తి తగ్గిపోతుంది. అందుకే, వంటలో గరం మసాలా దట్టించి ఆహారం తీసుకోవడం చాలా మంచిది. గరం మసాలాలోని వివిధ సుగంధ ద్రవ్యాలు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి శరీరంలోని నొప్పులను, మంటలను తగ్గించడంలో సహాయపడతాయి.
ఇది కూడా తెలుసుకోండి
గరం మసాలాలో ఉండే జీలకర్ర, దాల్చిన చెక్క, జాజికాయ వంటి పదార్థాలు శరీరంలో చక్కెర స్థాయిని సమతుల్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అలాగే, ఈ సుగంధ ద్రవ్యాలు శరీరంలోని విషాలను బయటకు పంపించి, రక్తాన్ని శుభ్రపరచడంలో సహాయపడతాయి. అయితే, గరం మసాలాను ఎక్కువగా తీసుకోవడం వల్ల పైల్స్, గుండెల్లో మంట, ఆమ్లత్వం, కడుపు ఇబ్బందులు వంటి ఆరోగ్య సమస్యలు కలుగుతాయని వైద్యులు సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications