Latest Updates
-
పడుకునే ముందు నెయ్యితో పాదాలకు మసాజ్ చేస్తే ఏమవుతుందో తెలుసా? -
దాబా స్టైల్ బట్టర్ చికెన్ సీక్రెట్ రెసిపి..రుచి చూస్తే ఒక్కసారితో ఆగరు -
బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? -
గోంగూర చికెన్ పచ్చడి ఇలా చేశారంటే..దాసోహం అవ్వాల్సిందే -
నాలికకు కిక్కిచ్చే చేప వెల్లుల్లి కారం..ఇలా చేశారంటే స్వర్గానికి బెత్తెడే దూరం! -
సమంత సీక్రెట్ ఇదే..రోజూ ఉదయం అలా చేస్తే లైఫ్ జిల్ జిల్ జిగా జిగా.. -
షుగర్, బీపీకి చెక్ పెట్టే కొర్రల కిచిడీ..వారంలో 2 రోజులు తింటే బరువు తగ్గడమే కాకుండా రోజంతా సూపర్ ఎనర్జీ! -
చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే స్పైసీ టమాటా బిర్యానీ..కుక్కర్ లో ఈజీగా చేసేయండిలా.. -
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే?
ఎలాంటి విషాన్నైనా మింగేస్తుంది.. ఆరోగ్యానికి సంజీవని నేరేడు పండ్ల ప్రయోజనాలు తెలుసా.!
నేరేడు పండ్ల గురించి తెలియని వారుండరు. కానీ తినడానికే కొందరు ముఖం చాటేస్తే మరికొందరు ఎగబడి మరీ కొనుక్కుని తింటారు. కారణం ఇవి సీజనల్ పండ్లు. కేవలం మూడు, నెలలు మాత్రమే ఇవి మార్కెట్‌లో దొరుకుతాయి. మే, జూన్, జులై నెలల్లో ఇవి నేరేడు చెట్లకు గుత్తులుగా కాస్తుంటాయి. ధర చాలా తక్కువ. కానీ వీటి ప్రయోజనాలు తెలిస్తే మాత్రం ఎంతటి ఖరీదైన పండ్లయినా ఓడిపోవాల్సిందే.. శివుడు లోకం క్షేమం తన కంఠంలో విషాన్ని దాచుకున్నట్లుగా నేరేడు పండ్లు మనలోని రోగాలను హరించేస్తుంది.

ఈ పండ్లలో ఉండే 'జాంబోలిన్’ అనే పదార్థం చాలా కీలకం. అంతే కాకుండా ఇది పోషకాల గని. వీటిని తినడం ద్వారా రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. డయాబెటిస్‌తో బాధపడుతున్న వారికి నేరేడు పండ్లు ఒక వరం.
మలబద్ధకంతో బాధపడుతున్న వారు నేరేడు పండ్లు తినడం ద్వారా సమస్య తీరిపోతుంది. ఇందులోని ఫైబర్ కారణంగా అజీర్తి, గ్యాస్, మలబద్ధకం, విరేచనాలు వంటి వాటి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరిచి జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. కడుపులో పుండ్లు ఉంటే కూడా వాటిని తొలగిస్తుంది.
రక్తహీనతతో బాధపడుతున్న వారికి నేరేడు పండ్లు మంచి పరిష్కారం. ఇందులోని ఐరన్ రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. దీంతో రక్తహీనత నుంచి బయటపడటమే కాకుండా యాక్టివ్‌గా ఉంటారు. చర్మం కాంతివంతంగా మారుతుంది.
హైబీపీతో బాధపడుతున్న వారు ఈ సీజన్‌లో తప్పనిసరిగా నేరేడు పండ్లు తినాల్సిందే. ఇందులో పొటాషియం లెవెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల బీపీని నియంత్రణలో ఉంచుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
ముఖ్యంగా లివర్ సమస్యతో బాధపడుతున్న వారి, పచ్చ కామెర్ల బారిన పడిన వారు నేరేడు పండ్లను తీసుకోవడం శ్రేయస్కరం. వీటిని రెగ్యులర్‌గా తింటే లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇది లివర్‌ను డీటాక్స్ చేసి దాని పనితీరును మెరుగుపరుస్తుంది. ఇందులో విటమిన్- సి పుష్కలంగా ఉండటం వల్ల ఇమ్యూనిటీని పెంచి ఇన్ఫెక్షన్ల బారి నుంచి కాపాడుతుంది.
అయితే నేరేడు పండ్లను ఎప్పుడు తినాలో చాలా మందికి తెలియదు. ఈ పండ్లను పరగడుపున తినకూడదు. ఖాళీ కడుపుతో తినడం వల్ల ఇందులో ఉండే అసిడిక్ నేచర్ కారణంగా గ్యాస్ సమస్య ఏర్పడుతుంది. అందుకే టిఫిన్ చేశాక లేదంటే భోజనం తర్వాత తినడం మంచిది. వీటిని తినేటప్పుడు కొంచెం ఉప్పు కలుపుకొని తింటే జీర్ణక్రియ సాఫీగా ఉండేలా చేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
