Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పెళ్లి చేసుకోవాలనుకునే పురుషులందరూ ప్రతిరోజూ ఈ డ్రింక్ తాగితే చాలు.. గుర్రంలా అవ్వాల్సిందే!
డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం మనందరికీ తెలిసిందే. వైద్య నిపుణులు కూడా డ్రై ఫ్రూట్స్ తినమని సూచిస్తుంటారు. డ్రై తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ డ్రై ఫ్రూట్స్‌లో భారీగా పోషకాలు ఉంటాయి. అలాగే ఖనిజాలు, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా ఖర్జురాలలో అనేక రకాల పోషకాలు దొరుకుతాయి. ఈ ఖర్జురాలను ప్రతి రోజూ పాలలో వేసుకొని తినడం వల్ల అనేక లాభాలు ఉంటాయి. ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. అసలు ఖర్జురాలను పాలలో వేసుకొని తినడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
శక్తి కోసం:
పాలలో ఉండే ప్రోటీన్లు, ఖర్జూరాలలో ఉండే సహజ చక్కెరలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. శారీరకంగా కష్టపడే వారికి ఇది మంచి డ్రింక్ అవుతుంది. అలాగే వారు శారీరకంగా కష్టపడడానికి కావాల్సిన శక్తి కూడా వారికి అందుతుంది.

బరువు పెరిగేందుకు
సన్నగా ఉండే వ్యక్తులు మంచి ఆహరం తీసుకుంటున్నా బరువు పెరగకపోతే పాలలో ఈ ఖర్జురాలు వేసుకొని తినడం వల్ల మంచి ఫలితాలను పొందొచ్చు. ఇందులో ప్రోటీన్లు, క్యాలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. అవి రెండు శరీరానికి కావాల్సిన శక్తిని అందించడంతో పాటు, బరువు పెరిగేందుకు అవసరమైన కేలరీలను అందిస్తుంది. దీని వల్ల సులభంగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది.
లైంగిక సామర్థ్యం కోసం
ప్రతిరోజూ పాలు, ఖర్జురాలు కలిపి తీసుకోవడం వల్ల పురుషుల్లో శారీరక బలహీనత వంటి సమస్యలు తొలిగిపోతాయి. అలాగే పురుషుల్లో లైంగిక సామర్త్యాన్ని పెంచి, వారిలో లైంగిక కోరికను పటిష్టం చేసే టెస్టోసిరాన్ హార్మోన్లను బాగా ఉత్పత్తి చేస్తాయి. అలాగే వీర్య కణాల వృద్ధి కూడా పెరుగుతుంది. తద్వారా అంగం గట్టిపడడం వంటి సమస్యలు దరి చేరవు. అలాగే శృంగారంలో అద్భుతంగా రాణించేందుకు అవకాశం ఉంటుంది.
ఎముకలను బలపరుస్తుంది
పాలు కాల్షియం యొక్క మంచి మూలం. ఖర్జూరాలలో కూడా కాల్షియం ఉంటుంది. కాబట్టి, ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల ఎముకలు బలపడతాయి. ముఖ్యంగా పిల్లలు మరియు వృద్ధులకు ఇది చాలా ముఖ్యం.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, అలాగే..
ఖర్జూరాలలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. పాలు, ఖర్జూరాలలో ఉండే విటమిన్లు మరియు ఖనిజాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇది జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి రక్షిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications