Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఖాళీ కడుపుతో పసుపు నీళ్లు తాగితే ఇన్ని ప్రయోజనాలా? తెలిస్తే అసలు ఆగరుగా!
వంటగదుల్లో ఓ మూలన డబ్బాలో ఉండే పసుపు చేసే మంచి గురించి చాలామందికి తెలియదు. శతాబ్దాలుగా పసుపు ఓ సంప్రదాయ మెడిసిన్ గా మన దేశంలో ఉపయోగించబడుతుంది. పసుపులో ఉండే అనేక రకాల పదార్థాలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు చేకూరుస్తాయి. పసుపుని సాధారణంగా వాపును తగ్గించడానికి,ఇతర అనారోగ్య పరిస్థితులకు ప్రత్నామ్నాయ ట్రీట్మెంట్ గా కూడా ఉపయోగిస్తారు.
పసుపు వాటర్ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఓ గ్లాస్ తాగితే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే పొద్దున్నే పసుపు నీళ్లు తాగితే వచ్చే ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

పసుపు నీళ్లు తాగితే ప్రయోజనాలు
ఇమ్యూనిటీ పెరుగుదల
పసుపును చాలా కాలంగా రోగనిరోధక శక్తిని పెంచే సాధనంగా ఉపయోగిస్తున్నారు. పసుపులో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ నుంచి కాపాడుతాయి. ప్రతిరోజూ పసుపు నీటిని తీసుకుంటే మీ రోగనిరోధక శక్తి తగ్గకపోవచ్చు. తద్వారా ఇది మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతూ అనేక ఇన్ఫెక్షన్లతో పోరాడటంలో సహాయపడుతుంది.
జీర్ణక్రియ మెరుగుదల
పసుపు వాటర్ ని క్రమం తప్పకుండా తాగడం వల్ల జీర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొన్ని సందర్భాల్లో గ్యాస్ సమస్య తగ్గుతుంది. పసుపు జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే యాంటీ ఇన్ఫమ్లేటరీ లక్షణాలను కలిగి ఉన్నట్లు నిరూపించబడింది.
బ్లడ్ లో షుగర్ లెవల్ ని తగ్గిస్తుంది
ప్రతిరోజూ ఖాళీ కడుపుతో పసుపు నీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇది డయాబెటిక్ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
మంటను తగ్గిస్తుంది
పసుపులో కర్కుమిన్ అనే శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలతో కూడిన పదార్థం ఉంటుంది. పసుపు నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల మీ శరీరంలో మంట తగ్గుతుంది. దీర్ఘకాలిక వ్యాధులను నివారించడంలో ఇది మీకు సాయపడుతుంది. కర్క్యుమిన్‌కు క్యాన్సర్‌ను నిరోధించే సామర్ధ్యం ఉందని ప్రయోగశాలల్లో నిర్వహించిన అనేక అధ్యయనాల్లో తేలింది. అయితే ప్రయోగశాల వాతావరణం,మానవ శరీరం మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది.
గుండె జబ్బుల ప్రమాదం తగ్గిస్తుంది
పసుపు నీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంటే పసుపు నీరు తాగడం వల్ల ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చు.
Note: ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ కథనం ఇవ్వబడింది. బోల్డ్ స్కై తెలుగు దీనిని ధృవీకరించలేదు. దీనిని పాటించే ముందు నిపుణుల సూచనలు తీసుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications