Latest Updates
-
బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే మీ బ్రేక్ ఫాస్ట్ లో ఈ క్రిస్పీ సొరకాయ దోశ ఉండాల్సిందే! -
ఎండల వేడికి తట్టుకోలేకపోతున్నారా? ఈ పానీయాలతో శరీరాన్ని చల్లబరచుకోండి! -
వైశాఖ అమావాస్య రోజున ఈ పనులు చేస్తే పితృదేవతల ఆశీస్సులు! -
కమ్మని పెరుగు సేమియా..ఆహా ఏమి రుచి, తినరా మైమరచి.. -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. లక్ష్మీ కటాక్షం మీకేనా? - శుక్రవారం, 17 ఏప్రిల్ 2026 -
బ్రోకోలీ నిజంగా క్యాన్సర్ ను తగ్గిస్తుందా? డాక్టర్ చెప్పిన ఈ సీక్రెట్ తెలుసుకోండి! -
డీప్‌ఫేక్ ఫోటోలతో వేధిస్తున్నారా? 2 గంటల్లోనే డిలీట్ చేయించే మార్గమిదే! -
కర్ణాటక స్పెషల్ కుకుంబర్ అవలక్కి..బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్! -
ఎండల వేడిని తట్టుకోలేకపోతున్నారా? ఈ పానీయాలతో చల్లగా ఉండండి -
పారేసే తొక్కలతో అదిరిపోయే రుచి.. బీహారీ స్టైల్ పచ్చి అరటికాయ తొక్కల పచ్చడి!
బొప్పాయి తింటే ఏమౌతుందో తెలుసా..?
బొప్పాయ్‌లో అనేక అనారోగ్యాలను నిర్మూలించే శక్తి వుంది. బొప్పాయ్‌లో వైటమిన్ సి చాలా ఎక్కువ మోతాదులో లభించడం వల్ల ఇది మనలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్లు వైటమిన్ ఏ బొప్పాయ్‌లో ఎక్కువగా వుంటుంది. బొప్పాయ్ రుచికరమైన పండు మాత్రమే కాదు పోషకాలు ఘని కూడా. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా వుండడం వల్ల గుండెకు చాలా మేలు చేస్తుంది.

బొప్పాయ్‌లో పీచు పదార్ధం కూడా ఎక్కువగా వుంటుంది. పీచు వున్న పదార్ధాలు గుండె జబ్బులను రాకుండా చేస్తుంది. రక్తంలో వుండే గ్లూకోజ్ స్థాయిని కూడా కంట్రోల్‌లో వుంచుతుంది. బొప్పాయ్‌లో ఫోలిక్ యాసిడ్ కూడా చాలా ఎక్కువ మోతాదులో వుంటుంది. బొప్పాయ్‌లో బీటా కెరోటిన్ కూడా సమృద్ధిగా వుంటుంది. ఇందులో వుండే పొటాషియం బ్లడ్ ప్రెజర్‌ను బాగా కంట్రోల్‌లో వుంచుతుంది. ఫైబర్ ఎక్కువగా వుండడం వల్ల మలబద్దకాన్ని తగ్గిస్తుంది. స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్లు రాకుండా నివారిస్తుంది.
ఇందులో వుండే బీటీ కెరోటిన్ కంటి చూపుకు ఎంతో మేలు చేస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. 14 పళ్లపై పరిశోధనలు జరిపినప్పుడు రొమ్ము క్యాన్సర్‌కు విరుగుడును బొప్పాయ్‌లో వున్నట్లు పరిశోధనలో కనుగ్గొన్నారు. ఇందులో చాలా తక్కువ మోతాదులో సోడియం వుంటుంది. కాబట్టి దీన్ని హార్ట్ ఫెయిల్యూర్ పేషంట్లకు, కిడ్నీ ఫెయిల్యూర్ పేషంట్లకు కూడా ఇవ్వవచ్చు.

మన శరీరంలో ప్రతీ ఒక్క అవయవానికి బొప్పాయ్ చాలా మేలు చేస్తుంది. డయాబెటీస్‌తో బాధపడేవారు రోజుకు 100 గ్రాముల బొప్పాయిని తీసుకోవచ్చు. వీలయితే బొప్పాయిని కూరలో వాడుకోవచ్చు. పపాయాను జ్యూస్ చేసి చిన్నపిల్లలకు ఇవ్వచ్చు.
పపాయతో మనకు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్. వైటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ ఇలా ఎన్నో వున్నాయ్. బ్లడ్ గ్లూకోజ్‌ను మెయింటేయిన్ చేస్తుంది, బ్లడ్ ప్రెజర్‌ను కంట్రోల్ చేస్తుంది, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది, బరువు తగ్గించడంలో సహాయపడుతుంది, మోషన్‌ను ఫ్రీగా వుంచుతుంది, క్యాన్సర్‌ను నివారిస్తుంది, రోగనిరోధక శక్తిని అమాంతం పెంచుతుంది.
బొప్పాయి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టులు వుండవు. కానీ కొంత మందికి బొప్పాయ్ తినడం వల్ల దద్దుర్లు, ఎలర్జీలు వస్తాయ్. బొప్పాయ్‌లో సహజమైన చెక్కరలు వుంటాయ్. ఎవరికి వారు తమ ఆరోగ్య అవసరాన్ని బట్టి బొప్పాయ్ తినవచ్చు. ఒక మీడియం సైజు బొప్పాయ్‌లో 120 వరకు క్యాలరీలు వుంటాయ్. ఇందులో యాంటీ క్యాన్సర్ లక్షణాలు వున్నాయ్ కాబట్టి బొప్పాయ్‌ను తప్పకుండా తినాల్సిందే.
కొందరికి బొప్పాయ్ పడకపోతే వెంటనే వైైద్యులను సంప్రదించడం చాలా మంచిది. అలాంటి వారు వైద్యుడి సూచనమేరకు మాత్రమే బొప్పాయిని తీసుకోవాలి. ఏ సమస్యా లేకపోతే ప్రతీ రోజు గుప్పెడు బొప్పాయ్ ముక్కలను తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలను అందించవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











