రోజూ ఉల్లిపాయ తింటే క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది..! ఇంకా ఎన్నో అద్భుతాలు..!

ఈ వేసవికాలంలో ఉల్లిపాయలు దగ్గర పెట్టుకుంటే మనకు తాకే ఎండను మొత్తం ఉల్లిపాయలు లాగివేస్తాయని ఒక నమ్మకం ఎన్నో ఏళ్ల నుంచి. దాన్ని ఇప్పటికీ చాలా మంది పాటిస్తారు. బయటకు వెళ్లేటప్పుడు తమ వెంట ఉల్లిపాయలను తీసుకొని పోతారు. ఉల్లిపాయలు తినడం వల్ల కూడా చాలా లాభాలున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. మూడ్ ను పెంచడానికి, పురుషుల్లో అంగం గట్టిపడటానికి కూడా ఉల్లిపాయలు దోహదపడతాయని వైద్యులు అంటున్నారు. ఉల్లిపాయలతో ఉండే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

ఉల్లిపాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు సంమృద్ధిగా వుంటాయ్. వాటిలో వుండే ఫ్లెవనాయిడ్ల వల్ల భవిష్యత్తులో వచ్చే ప్రాణాంతకమైన క్యాన్సర్, డయాబెటీస్ నుంచి రక్షిస్తుంది. ఉల్లిపాయలు రోగనిరోధక శక్తిలో కీలకపాత్ర పోషిస్తాయన్న విషయాన్ని మరువవద్దు.

ఉల్లిపాయల్లో వుండే సల్ఫర్ పదార్ధం కొన్ని రకాలు క్యాన్సర్లు రాకుండా కాపాడుతుంది. ఉల్లిపాయలు ఎక్కువగా తినేవారిలో క్యాన్సర్ రిస్క్ కూడా చాలా తక్కువగా వున్నట్లు గమనించారు. దీనికి సంబంధించి ఇప్పటికీ అనేక పరిశోధనలు జరుగుతున్నాయ్.

ఉల్లిపాయల్లో వుండే యాంటీ బ్యాక్టీరియా కాంపౌండ్లు దగ్గు, జలుబు రాకుండా అడ్డుకుంటాయ్. అందుకని వైద్యవిభాగం ఉల్లిపాయలను మందుల తయారీలో ఉపయోగస్తున్నారు. ఎక్కవ రోజులు నిల్వ వుంచిన ఉల్లిపాయల్లో క్వెర్‌సెటిన్ అనే ఫ్లెవనాయిడ్లు ఎక్కువగా వుంటాయ్.

health-benefits-of-eating-raw-onion-daily-eating-onion-reduced-risk-of-cancer-and-heart-diseases

ఎర్ర ఉల్లిపాయల్లో క్వెర్‌సెటిన్ అనే ఫ్లెవనాయిడ్లు ఎక్కువగా వుండడం వల్ల ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి దోహదపడుతుందని అంటున్నారు. ప్రతి రోజు ఉల్లిపాయలు తినే వారికి గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం కూడా చాలా తక్కువగా వుంటుందని అంటున్నారు.

ఉల్లిపాయల్లో వుండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల యముకలు కూడా బలంగా మారుతాయని అంటున్నారు. ఉల్లిపాయలు ఎక్కువగా తినేవారికి నడుము నొప్పి సమస్యలు తగ్గుతాయంటున్నారు.

ఉల్లిపాయలు చెక్కర స్థాయిని అదుపులో వుంచుతుంది. 100 గ్రాముల పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల కేవలం 4 గంటల్లోనే అధిక రక్తపోటు అదుపులోకి వచ్చిందని పరిశోధకులు చెబుతున్నారు.

ఆస్తమాతో బాధపడేవారు, శ్వాసకు సంబంధించిన సమస్యతో బాధపడేవారు ఉల్లిపాయలను తినడం వల్ల ఇలాంటి సమస్యలు రాకుండా వుంటాయి. ఊపిరితిత్తుల్లో ఏదైనా మంట వుంటే కూడా తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు.

ఉల్లిపాయలు జీర్ణక్రియను కూడా అదుపులో వుంచుతుుంది. కడుపులో ఏవైనా గ్యాస్ట్రిక్ అల్సర్లు వుంటే వాటిని నయం చేసుందుకు కూడా ఉల్లిపాయలు దోహదపడతాయని అంటున్నారు.

బరువు తగ్గడంలో కూడా ఉల్లిపాయలు కీలకపాత్ర పోషిస్తున్నట్లు పరిశోధనలు బయటపడ్డాయి. రోజుకు 9 గ్రాముల ఉల్లిపాయను మూడు నెలలపాటు తీసుకుంటే బరువు కొంత తగ్గడమే కాకుండా కాలేయం కూడా మెరుగుపడుతుంది.

ఉల్లిపాయలంటే కొందరికి ఎలర్జీ. ఉల్లిపాయలంటేనే ఆమడదూరం పారిపోయేవారు చాలా మందే వున్నారు. ఉల్లిపాయల వాసనంటే వారికి చికాకు తెప్పిస్తుంది.

100 గ్రాముల ఉల్లిపాయల్లో సుమారు 44 క్యాలరీలు వుంటాయ్. 1 గ్రాము ప్రొటీన్లు ఫైబర్ ఒక గ్రాము, వైటమిన్ సి, పొటాషియం కూడా వుంటాయ్. ఇక కేవలం ఈ వంద గ్రాముల ఉల్లిపాయల్లోనే 10 గ్రాముల కార్బొహైడ్రేట్లు వుంటాయ్.

ఉల్లిపాయ లేనిదే వంట పూర్తికాదు. ఏ స్పైసీ డిష్ చేసినా, బిర్యానీ చేసినా, లేదా ఏ నాన్‌వెజ్ స్పెషల్ చేసినా సరే ఉల్లిపాయలు వుండాల్సిందే. క్యాన్సర్ రిస్క్ తగ్గించుకోవాలన్నా, గుండె ఆరోగ్యం మెరుగుపడాలన్నా ఉల్లిపాయ తినాల్సిందే.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Wednesday, May 29, 2024, 15:32 [IST]
Desktop Bottom Promotion