Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Chaddannam Health Benefits: వేసవిలో చద్దన్నం.. ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీకావు
చద్దన్నం.. దీనిని ఘనమైన చరిత్ర ఉంది. పూర్వకాలంలో ప్రతి ఒక్కరూ ఉదయం తినేది చద్దన్నాన్నే. ఉదయం పూట పొలం పనులకు వెళ్లే వారు పని చేస్తున్నంతసేపు హుషారుగా ఉండేందుకు, ఎనర్జీతో పని చేసేందుకు ఉదయం పూట చద్దన్నం తినేసి పనులు వెళ్లే వారు.
రోజులు మారుతున్న కొద్దీ చద్దన్నం స్థానంలో బ్రేక్‌ఫాస్ట్‌లు వచ్చి చేరాయి. కానీ చద్దన్నం తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఉదయం పూట చద్దన్నం తింటే రోజంతా చలాకీగా ఉండటంతో పాటు పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు.

వేసవి కాలంలో చద్దన్నం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పోషకాలు పుష్కలం:
అన్నాన్ని పులియబెట్టి తయారు చేసే చద్దన్నంలో బి కాంప్లెక్స్, విటమిన్ కె, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, సెలీనియం వంటి సూక్ష్మ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. చద్దన్నంలో విటమిన్ బి6, బి12లు పుష్కలంగా ఉంటాయి.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది:
చద్దన్నంలో ప్రోబయోటిక్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. డ్యూడెనర్ అల్సర్లు, అల్సరేటివ్ కొలిటిస్, క్రోన్స్ వ్యాధి, ఇరిటెబుల్ బోవెల్ సిండ్రోమ్, ఉదరకుహ వ్యాధి, ఇన్ఫెక్షన్లు మొదలైన జీర్ణశయాంతర సమస్యలను నయం చేస్తుంది. చద్దన్నం తినడం వల్ల మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు దరిచేరవు.
ఎలక్ట్రోలైట్లు సమృద్ధిగా ఉంటాయి:
చద్దన్నం తినడం ద్వారా తక్షణ శక్తి వస్తుంది. డీహైడ్రేషన్, అలసట, బలహీనతను నివారించడానికి శరీరంలోని ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేస్తుంది. పాలిచే తల్లులకు ఇది దివ్యౌషధం అనే చెప్పాలి.
చద్దన్నంలో పొటాషియం, సోడియం, క్లోరైడ్, సెలీనియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అధిక రక్తపోటును తగ్గించడానికి, జీవక్రియ రుగ్మతలను నివారించడానికి సహాయపడుతుంది. అదే విధంగా, ఎముకల ఆరోగ్యానికి సహాయపడే మెగ్నీషియం, సెలీనియం స్థాయిలు కూడా పెరుగుతాయి. అలాగే, ఇది ప్రోబయోటిక్ కూడా కాబట్టి, ఇది నిరోనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి, ఇన్ఫెక్షన్లను, క్యాన్సర్లను నివారించడానికి తెల్ల రక్తకణాల సంశ్లేషణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
చద్దన్నం తయారు చేయడం ఎలా:
రాత్రి వండుకున్న అన్నాన్ని ఒక లోతైన గిన్నెలో తీసుకోవాలి. అందులో మజ్జిగా పోసుకోవాలి. అలాగే రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయానికి అన్నం పులియబెట్టినట్లుగా మారి చద్దన్నంలా తయారవుతుంది.
ఇందులో పెరుగు వేసుకుని తినొచ్చు. చాలా మంది చద్దన్నాన్ని మిరపకాయ, ఉల్లిపాయ నంజుకుంటూ తింటుంటారు. కొంత మంది ఆవకాయ, ఊరగాయ లాంటివి వేసుకుంటారు.
ఎండాకాలంలో వండి అన్నం త్వరగా పులిసిపోతుంది. రాత్రి వండిన అన్నాన్ని మజ్జిగలో వేసి మరుసటి రోజు తింటే రోజంతా ఎనర్జీటిక్ గా ఉంటారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications