Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
ఉదయాన్నే శృంగారంలో పాల్గొంటే ఇన్ని లాభాలా? ఇది చేస్తే అది డబల్!
వైవాహిక బంధంలో శృంగారం అనేది అత్యంత ముఖ్యమైనది. ఈ శృంగారం ఇద్దరు వ్యక్తుల మధ్య బంధాన్ని బలోపేతం చేస్తుంది. అలాగే వారి మధ్య ఏర్పడే అసమానతలను తొలిగిస్తుంది. దీంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. శృంగారం పాల్గొనే సమయాన్ని బట్టి ఆరోగ్య ప్రయోజనాలు దొరుకుతాయని నిపుణులు చెబుతుంటారు. అయితే ఉదయాన్నే శృంగారంలో పాల్గొనడవం వలన మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దొరుకుతాయి. ఆ ప్రయోజనాలు ఏంటి? శృంగారంలో పాల్గొనడం వలన ఎలాంటి లాభాలు వస్తాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఉదయాన్నే శృంగారంలో పాల్గొనడం వలన కలిగే లాభాలు..
మానసిక స్థితి మెరుగుపడుతుంది
ఉదయాన్నే శృంగారంలో పాల్గొనడం శరీరంలో ఆండోఫిన్లు విడుదల చేస్తుంది. ఇవి మానసిక పరిస్థితిని మెరుగుపర్చడానికి సహాయపడతాయి. దీని వల్ల ఉదయం ఉత్సాహంతో, శక్తితో పూర్తి రోజును ప్రారంభించవచ్చు. రోజంతా ఆరోగ్యంగా, చురుగ్గా ఉండొచ్చు.

శరీరంపై ఒత్తిడి తగ్గుతుంది
ఉదయాన్నే శృంగారంలో పాల్గొంటే శరీరంలో స్ట్రెస్ హార్మోన్ (కోర్టిసోల్) స్థాయి తగ్గిపోతుంది. ఇది శరీరంపై ఒత్తిడి తగ్గించి, రిలాక్స్ అవడం సహాయపడుతుంది. దీంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే శరీరానికి కావాల్సిన విశ్రాంతి లభిస్తుంది.
హార్మోన్ సమతుల్యత:
ఉదయాన్నే శృంగారంతో హార్మోన్ లెవల్స్ సమతుల్యంగా మారుతాయి. దీని ద్వారా ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయి. ఇది మెరుగైన నిద్రకు కూడా దోహదం చేస్తుంది. అలాగే ఫెర్టిలిటీ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.
శరీర స్థాయిలో బలవృద్ధి
ఉదయం శృంగారంలో పాల్గొనడం శరీరంలో శక్తిని పెంచేలా ఉంటుంది. అలాగే, శరీరంలోని రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, ఇది శక్తి స్థాయి పెరిగేలా చేస్తుంది. దీని కారణంగా గుండెపోటు వంటి సమస్యల బారినుంచి బయటపడొచ్చు.
హృదయ ఆరోగ్యానికి మంచి
శృంగారంలో పాల్గొనడం శరీరంలో రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది, ఇది హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీని కారణంగా గుండె సంబంధిత సమస్యలు మన దరిన చేరవు. అలాగే ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది.
బరువు నియంత్రణలో సహాయం
ఉదయాన్నే శృంగారంలో పాల్గొనడాన్ని ఒక వ్యాయామంగా పాల్గొనవచ్చు. శృంగారంలో పాల్గొనడం వలన ఇది శరీర బరువును నియంత్రిస్తుంది. అలాగే బరువు తగ్గేందుకు ఇది ఎంతగానో సహాయపడుతుంది. దీంతో అనవసరమైన బరువు పెరగకుండా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications