Latest Updates
-
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు!
Jonna Ambali: వేసవిలో జొన్న అంబలి, వేడిని తగ్గిస్తుంది, హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది, ఇంకా చాలా ప్రయోజనాలు
వేసవి ఉష్ణోగ్రతలు విపరీతంగా నమోదవుతాయి. ఎర్రటి ఎండలకు ఆరోగ్యం అతలాకుతలం అవుతుంది. కొద్ది సేపు అలా బయటకు వెళ్లొస్తే ఎక్కడలేని నీరసం ఆవహిస్తుంది. ఒంట్లోని ఎనర్జీ అంతా కోల్పోయి డీలా పడిపోతాం.
ఎర్రటి ఎండలకు ఇంటి నుండి బయటకు వెళ్లొద్దని చాలా మంది చెబుతారు. కానీ ఇంట్లో కూర్చుంటే పనులు ఎలా అయ్యేది. ఎంత ఎండలు కొట్టినా తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సిందే అనుకుంటే జాగ్రత్తలు పాటించడం తప్ప చేయాల్సిందేముంటుంది.

ఎండల నుండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నా, ఈ వేసవిలో నీరసించి పోకుండా ఉండాలన్నా జొన్న అంబలి తాగాలని పెద్దలు చెబుతుంటారు. వేసవిలో జొన్న అంబలి తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
జొన్నల్లో ఉండే పోషకాలు:
- కాల్షియం
- ఐరన్
- ఫాస్పరస్
- ఫైబర్ సహా జొన్నల్లో ఇంకా చాలా పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
జొన్న అంబలి ఆరోగ్య ప్రయోజనాలు:
- జొన్న అంబలి వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది
- జొన్న అంబలి తాగడం వల్ల నీరసం, బలహీనత పోతాయి.
- ఎముకలు దృఢంగా తయారవుతాయి.
- రక్తహీనత సమస్య తొలగిపోతుంది
- జొన్న అంబలి తాగడం వల్ల జీర్ణ శక్తి మెరుగుపడుతుంది
- మలబద్ధకం సమస్యలు ఉత్పన్నం కావు.
- బరువు తగ్గాలనుకునే వారికి మంచి మార్గం
- దీని వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది
- గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది
- షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి
- జొన్న అంబలి తాగడం వల్ల కండరాలు దృఢంగా తయారవుతాయి.

జొన్న అంబలి తయారు చేసే విధానం:
- ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు జొన్న పిండిని తీసుకోవాలి.
- అందులో మూడు గ్లాసుల నీళ్లు పోసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి.
- జొన్న పిండి పలుచగా ఉండేలా బాగా కలుపుకోవాలి
- ఈ గిన్నెను స్టవ్ పై పెట్టి బాగా మరిగించుకోవాలి.
- స్టవ్ మీద పెట్టి మరిగించుకునే సమయంలో ఉండలు కట్టకుండా, అడుగు అంటకుండా బాగా కలుపుతూ ఉండాలి.
- పలుచగా ఉన్న ఆ మిశ్రమం క్రమంగా చిక్కగా తయారవుతుంది.
- ఆ తర్వాత గ్లాసులోకి తీసుకుని తాగడమే.
- ఇందులో కొద్దిగా మిరియాల పొడి, నిమ్మరసం, కారం వంటివి వేసుకుంటే రుచిగా ఉంటుంది.
ఇలా చేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది:
జొన్న అంబలిని రోజంతా ఎప్పుడైనా తాగొచ్చు. అయితే రాత్రి చేసుకుని పక్కన పెట్టుకున్న జొన్న అంబలిని ఉదయం తీసుకుంటే బాగుంటుంది. సాయంత్రం తాగాలనుకుంటే ఉదయమే తయారు చేసి పెట్టుకోవడం వల్ల సాయంత్రం లోపు రుచి మెరుగుపడుతుంది. తయారు చేసి పెట్టుకున్న జొన్న అంబలిని మట్టి పాత్రలో పోసుకుని దాని చుట్టూ గుడ్డ చుట్టి సహజంగా చల్లబడనివ్వాలి. ఇలా కొద్దిసేపు పక్కన ఉంచిన జొన్న అంబలి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వేసవిలో ఆరోగ్యంగా ఉండేందుకు జొన్న అంబలిని ప్రయత్నించండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











