Latest Updates
-
రోజువారీ ఆహారంలో వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారా.?.. మీ కిడ్నీలు రిస్క్‌లో పడినట్లే.! -
ప్రేమకు, పెళ్లికి జెన్ జీ యువత ఎందుకు దూరమవుతోంది? -
భాగస్వామి ఎంపిక విషయంలో పదే పదే తప్పు చేస్తున్నారా.. మిమ్మల్ని ఇరకాటంలో పెట్టే విషయాలివే.! -
మధ్యాహ్నం 12 లేదా 2 గంటలకే చెక్ ఇన్..హోటల్స్ ఫాలో అయ్యే రూల్ వెనుక అసలు కథ! -
బఠానీ, పెసరపప్పు కాంబినేషన్... ఈ సమోసా రుచి చూస్తే మళ్లీ మళ్లీ తింటారు! -
వ్యాయామం చేసటప్పుడు విపరీతంగా చెమట.. కొవ్వు కరిగిపోతుందని అస్సలు సంబరపడొద్దు.! -
ఉదయం లేవగానే ఒళ్లు నొప్పులు, జాయింట్స్ పట్టేస్తున్నాయా? -
పప్పులు నానబెట్టే పనిలేదు,రుబ్బే శ్రమలేదు..అటుకులు,బంగాళదుంపలతో క్షణాల్లో కరకరలాడే అప్పడాలు.. -
ప్రెగ్నెన్సీలో చర్మం ఎందుకు నల్లబడుతుందో తెలుసా.. పిగ్మెంటేషన్‌ను ఇలా పోగొట్టుకోండి.! -
ఈ 5 రాశుల వారికి నేడు అదృష్టం.. శివయోగం ప్రభావంతో కాసుల వర్షం ఖాయం!
Patika Bellam: వేసవిలో చల్లదనానికి పటిక బెల్లం తినండి, ఇంకా ఎన్నో ఆరోగ్యప్రయోజనాలూ ఉన్నాయి
పటిక బెల్లం, మిశ్రి, రాక్ షుగర్ ఎలా పిలుచుకున్నా దీంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నది మాత్రం నిజం. ఈ చక్కెరను పూర్తిగా శుద్ధి చేయరు. ఈ పటిక బెల్లాన్ని ఆయుర్వేద ఔషధాల తయారీలో ఎక్కువగా వాడతారు. చక్కెరతో పోలిస్తే పటిక బెల్లం తక్కువ తియ్యగా ఉంటుంది. కానీ బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
పటిక బెల్లంలో ఖనిజాలు, విటమిన్లు, అమైనో ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. మాంసాహారంలో దొరికే విటమిన్లు పటిక బెల్లం ద్వారా లభిస్తాయి. వేసవికాలంలో పటిక బెల్లం తినడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వేసవిలో పటిక బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు:
1. చక్కెరకు బదులు పటిక బెల్లం:
టీ, కాఫీ, పండ్ల రసాలలో సాధారణ చక్కెరక బదులు పటిక బెల్లం వాడటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పటిక బెల్లం శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇందులోని పోషకాల వల్ల వేసవికాలంలో త్వరగా నీరసించి పోకుండా ఉంటారు.
2. జీర్ణక్రియకు తోడ్పడుతుంది.
పటిక బెల్లంలోని డైజెస్టివ్ ఎంజైమ్ లు స్రావాన్ని ప్రోత్సహించడం ద్వారా జీర్ణవ్యవస్థను ప్రేరేపిస్తుంది. ఆహారాన్ని త్వరగా, ప్రభావవంతంగా జీర్ణం చేస్తుంది.
3. కాల్షియం, ఐరన్, ఫాస్పరస్:
ఆరోగ్యకరమైన ఎముకలు, దంతాలకు అవసరమయ్యే కాల్షియం, ఐరన్, ఫాస్పరస్ పటిక బెల్లంలో పుష్కలంగా ఉంటాయి.
4. దగ్గు, జలుబు నుండి ఉపశమనం:
పటిక బెల్లంలోని గొప్ప ఔషధ గుణాల వల్ల ఆయుర్వేదంలో ఎక్కువగా వాడతారు. గొంతు నొప్పి ఉన్నవారు పటిక బెల్లాన్ని చప్పరించడం ద్వారా ఉపశమనం పొందుతారు. దగ్గుతో బాధపడే వారికి పటిక బెల్లం ద్వారా ఫలితం కనిపిస్తుంది.
5. శక్తిని పెంచుతుంది:
పటిక బెల్లంలోని ఔషధ గుణాలు, పోషకాల వల్ల దీనిని తీసుకున్న వెంటనే శక్తినిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
6. ఇన్‌ఫ్లమేషన్‌తో పోరాడుతుంది:
పటిక బెల్లంలో గ్లైసిరైజిన్ అనే సహజ సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రభావాలను కలిగి ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది.
7. ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తుంది:
పటిక బెల్లంలోని పోషకాలు నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. ఒత్తిడితో ఉన్న వారు చిటికెడు పటికెడు బెల్లాన్ని చప్పరిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది.
8. తాజా శ్వాస:
భోజనం తరువాత నోరు కడుక్కోకపోయినా, నోరు పుక్కిలించకపోయినా, ఆ బాక్టీరియా చిగుళ్ళ సందుల్లో ఉండిపోయి చెడు వాసన కలిగిస్తుంది. పటిక బెల్లం లేక మిశ్రి భోజనం తరవాత తింటే చెడు వాసన పోగొట్టి, తాజా శ్వాస నింపుతుంది.ఇది నోట్లో మరియు శ్వాసలో తాజాదనాన్ని నిర్ణయిస్తుంది.
9. హిమోగ్లోబిన్ స్థాయిలు పెంచుతుంది:
తక్కువ హిమోగ్లోబిన్ స్థాయి ఉన్న వాళ్ళు రక్తహీనత, పాలిపోయిన చర్మం, మైకం, అలసట, నీరసం వంటి సమస్యలతో బాధపడతారు. పటిక బెల్లం హిమోగ్లోబిన్ స్థాయి పెంచడమే కాకుండా రక్త ప్రసరణని పునరుద్ధరిస్తుంది. జీర్ణక్రియలో సహాయం చేస్తుంది. పటిక బెల్లం నోటికి తాజాదనం ఇవ్వడమే కాకుండా, సోంపుతో వేసుకుంటే జీర్ణక్రియలో కూడా సహాయం చేస్తుంది. అందులో ఉన్న లక్షణాలు జీర్ణ ప్రక్రియని వెంటనే మొదలుబెట్టిస్తాయి. కనుక, అజీర్తిగా ఉంటే భోజనం అయిన వెంటనే మిశ్రి పలుకులు వేసుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications