Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
వర్షపు నీటితో స్నానం చేస్తే కలిగే లాభాలు, తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు
వర్షాలు ఎడతెరిపిలేకుండా కురుస్తున్నాయి. వాతావరణం పూర్తిగా చల్లబడింది. వర్షాకాలం వచ్చిందంటే.. రోగాలు కూడా వస్తాయని చెబుతారు. వర్షంలో తడిస్తే జలుబు, దగ్గు ఇబ్బంది పెడతాయని, జ్వరం వస్తుందని చాలా మంది చెబుతారు. వర్షంలో బయటకు వెళ్లవద్దని, ఒకవేళ వెళ్లాల్సి వస్తే రెయిన్ కోట్, గొడుగు లాంటి వెంట తీసుకెళ్లాలలని పెద్దలు సూచిస్తుంటారు. వర్షపు నీటిలో తడిస్తే జలుబు చేస్తుందని హెచ్చరిస్తుంటారు. అలాగే వర్షపు నీరు వల్ల జుట్టు కూడా ఊడిపోతుందని చెప్పే వారు చాలా మందే ఉంటారు.
అయితే వర్షపు నీటిలో స్నానం చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, పలు లాభాలు చేకూరుతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. వర్షపు నీటిలో స్నానం చేయడం వల్ల చెమట కాయ నుంచి దద్దుర్ల వరకు చాలా రకాల చర్మ సంబంధిత రోగాలు నయం అవుతాయని అంటున్నారు.

వర్షపు నీరు స్వచ్ఛమైనవి:
వర్షపు నీరు పంపు నీటి కంటే మెరుగైనవి. అలాగే వర్షపు నీరు చాలా స్వచ్ఛమైనవి. కలుషితం కాని స్వచ్ఛమైన నీరు. ఈ నీటిని తాగడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవని చెబుతున్నారు వైద్యులు. ఇందులో క్లోరిన్, ఫ్లోరైడ్ వంటి రసాయనాలు ఉండవని అంటున్నారు.
వర్షపు నీరు చర్మానికి మంచిది:
వర్షపు నీరు చర్మానికి కూడా చాలా మేలు చేస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఇది చర్మం యొక్క సహజ pH ను పెంచుతుంది. వర్షపు నీరు వల్ల చర్మం తేమను పొందుతుంది. అలాగే చర్మ సమస్యలు తొలగిపోతాయి. చెమట కాయ, దద్దుర్లు, తామర వంటివి వర్షపు నీటి వల్ల తొలగిపోతాయని నమ్ముతారు.
జుట్టుకు కూడా మంచివి:
వర్షపు నీరు స్వచ్ఛమైనవి. ఇందులో క్లోరిన్, ఫ్లోరైడ్ లేకపోవడం వల్ల జుట్టుకు ఏ రకంగానూ హాని చేయవు. వర్షపు నీటిలో ఆల్కలీన్ పీఎఫ్ ఉంటుంది. ఇది జుట్టుకు చాలా ఆరోగ్యకరమైనదని నిపుణులు చెబుతున్నారు. హెవీ మెటల్స్ లేని వర్షపు నీటి వల్ల జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. జుట్టు స్కాల్ప్ లోని మురికితో పాటు చిట్లిపోయిన జుట్టును సరిచేస్తుంది.
వర్షపు నీరు తేలికగా ఉంటుంది. అందులో pH ఆల్కలైన్ ఉంటుంది. ఇది మన మైండ్ ని రీఫ్రెష్ చేస్తుంది. వర్షంలో ప్రత్యేకమైన సూక్ష్మక్రిములు ఉంటాయి. అవి బి12 విటమిన్ ని ఉత్పత్తి చేస్తాయి.
వర్షపు నీటిలో స్నానం ఒత్తిడిని తగ్గిస్తుంది:
వర్షపు నీటిలో హాయిగా గెంతుతూ తడవడం వల్ల శరీరంలో ఎండార్భిన్, సెరోటోనిన్ అనే హార్మోన్లు విడుదల అవుతాయి. ఈ హార్మోన్లు అన్ని రకాల ఒత్తిడిని తగ్గించేలా చేస్తాయి. మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. ఒత్తిడి, ఆందోళన తగ్గి ప్రశాంతమైన నిద్ర పడుతుంది. విశ్రాంతి మెరుగుపడుతుంది.
చెవిలో ఇన్ఫెక్షన్లు, చెవి నొప్పి ఉన్న వాళ్లు వర్షపు నీటిలో కాసేపు తడవడం వల్ల అవన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. వర్షంలో తడిస్తే జలుబు, దగ్గు, జ్వరం రావడానికి ప్రధాన కారణం తలను వెంటనే తుడుచుకోకపోవడం. అందుకే తలను వెంటనే తుడుచుకోవాలని చెబుతారు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications