Latest Updates
-
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్!
కేవలం 2 రూపాయలతో దగ్గు, జలుబును క్షణాల్లో తగ్గించుకోవచ్చు.. ఏం చేయాలంటే?
చలికాలంలో చాలా మంది దగ్గు, జలుబు, గొంతు నొప్పి, వైరల్ ఫీవర్‌తో బాధ పడుతుంటారు. అలాగే రోగ నిరోధక శక్తి కూడా చాలా వరకు తగ్గిపోతుంటుంది. వాటిని తగ్గించుకునేందుకు, వాటి నుంచి ఉపశమనం పొందేందుకు రకరకాలా ట్యాబెట్ల్స్ వినియోగిస్తుంటారు. అయితే శీతాకాలంలో వచ్చే ఈ సమస్యలను తగ్గించేందుకు, వాటి నుంచి ఉపశమనం పొందేందుకు వాము ఎంతగానో ఉపయోగపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది మార్కెట్‌లో కేవలం 2 రూపాయలకు కూడా దొరికేస్తూ ఉంటుంది.
కాగా, వామును సాధారణంగా ఆహారాన్ని సిద్ధం చేసే క్రమంలో వినియోగిస్తుంటాము. ఇవి జీర్ణ సంబంధిత సమస్యలను పరిష్కరిస్తుంది. కానీ జలుబు, దగ్గు, గొంతు నొప్పి సమస్యలను కూడా పరిష్కరిస్తుందని చాలా మందికి తెలియదు. వామును తీసుకుంటే ఏ విధమైన ప్రయోజనాలు ఉంటాయి?, ఏ విధంగా వాము తీసుకోవాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

వాము జలుబు, దగ్గును ఏ విధంగా తొలగిస్తుందంటే?
వాములో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి గొంతులో వాపును తగ్గిస్తుంది. అలాగే గొంతులో గరగరకు కారణమయ్యే వాటిని కూడా పరిష్కరిస్తుంది. తద్వారా దగ్గు అనేది తగ్గిపోతుంది. వాము అనేది ఒక ఎక్స్‌పెక్టోరెంట్. ఇది చాతిలోనే కఫాన్ని తొలగించడానికి చాలా సహాయపడుతుంది. వాములు తీసుకోవడం వల్ల దగ్గుతో పాటు కఫము కూడా తగ్గిపోతుంది.
బ్యాక్టీరియాల నాశనం కోసం..
వాములో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలో జలుబుకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపుతుంది. దీని ద్వారా జలుబు తగ్గిస్తుంది. అలాగే వాములో రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు కూడా ఉన్నాయి. వాము తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి జలుబుకు కారణమయ్యే బ్యాక్టీరియాపై పోరాడేందుకు కావాల్సిన శక్తి లభిస్తుంది.
వామును ఎలా ఉపయోగించాలంటే?
వామును వివిధ పద్ధతుల్లో వినియోగించుకోవచ్చు. వాము నీరు తాగడం, వంటల్లో వేసుకోవడం, పొడిగా చేసి తినడం, నెయ్యితో కలిపి కూడా తీసుకోవచ్చు. వివిధ మార్గాల్లో వామును తీసుకోవడం వల్ల ప్రయోజనాలు సమానంగా ఉంటాయి.
ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ వాము వేసుకొని, ఆ నీటిని మరిగించి తాగడం వల్ల జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం, తేన్పులు వంటి సమస్యలు దూరమవుతాయి. అలాగే వామును వంటల్లో జత చేసుకోవడం వల్ల ఆ వంటలకు ప్రత్యేకమైన రుచి వస్తుంది. దీంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతగానో మేలు జరుగుతుంది. వామును పొడిగా చేసి, నల్ల ఉప్పుతో కలిపి తీసుకోవడం వల్ల కడుపునొప్పి తగ్గిపోతుంది.
వాముపొడిని నెయ్యితో కలిపి తీసుకోవడం నెలసరి సమయంలో వచ్చే సమస్యలన్నీ దూరమవుతాయి. అలాగే వాములో నుంచి తీసిన నూనెను చెవిలో చుక్కలుగా కూడా ఉపయోగించుకొవచ్చు.
ఎంత తీసుకోవాలి?
వాముతో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ పరిమితంగా ఆ వామును తీసుకోవాల్సి ఉంటుంది. వామును అధికంగా తీసుకోవడం వల్ల కడుపునొప్పి వచ్చే ప్రమాదం ఉంది. కొంతమంది వాము అలర్జీ ఉంటుంది. అందుకే దీనిని తీసుకునే ముందు సంబంధిత వైద్యులను లేదా నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది. ఆరోగ్య సమస్య మరీ ఎక్కువగా ఉంటే కచ్చితంగా వైద్యులను సంప్రదించాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications