Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
బుల్లెట్ కాఫీతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?.. ఎలా తయారు చేసుకోవాలంటే?
నెయ్యి కాఫీ.. దీనిని బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అని కూడా పిలుస్తారు. ఇది నెయ్యి లేదా శుద్ధం చేయబడిన వెన్నతో తయారు చేస్తారు. దీనికి మన దేశంలో చాలా డిమాండ్ ఉంది. ఈ రిచ్ కాఫీ స్థిరమైన శక్తిని తక్షణమే అందిస్తుంది. మన కాన్సంట్రేషన్‌ను మెరుగుపరుస్తుంది. అలాగే బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడుతుంది.
ఇంతటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ కాఫీని ఇంట్లోనే చేసుకోవచ్చు. దీనిని ఇంట్లోనే ఎలా చేసుకోవాలి? ఈ టీ తాగితే ఎలాంటి లాభాలు వస్తాయి అనేది ఈ స్టోరీలో పూర్తిగా వివరించాము. ఒక్కసారిగా ఈ స్టోరీని చూద్దాం రండి..

నెయ్యి కాఫీ లేదా బుల్లెట్ ప్రూఫ్ కాఫీ ప్రయోజనాలు
నెయ్యిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు కెఫీన్ విడుదలను నెమ్మదిస్తాయి. దీని కారణంగా ఈ కాఫీ తాగిన వారికి రోజంతా శక్తి లభిస్తుంది. సాధారణ కాఫీలు కలిపించే అడ్డంకులు ఈ కాఫీ కలిపించదు.
ఈ నెయ్యి కాఫీలో కీటో కార్బ్ డైట్‌లు తక్కువగా ఉంటాయి. దీంతో ఈ టీని తాగడం వల్ల.. శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది. ఆ కొవ్వును కరిగించేందుకు ఈ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే నెయ్యిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు మీ శరీరానికి స్థిరమైన శక్తి అందిస్తాయి మరియు కీటోసిస్‌ను ప్రోత్సహిస్తాయి.
నెయ్యి కాఫీ వారి ఏకాగ్రతను మరియు మానసిక స్పష్టతను మెరుగుపరచడంలో సహాయపడుతుందని, మరియు ప్రొడక్టివిటీని పెంపొందించడంలో ఇది అమోఘంగా పని చేస్తుందని పలు నివేదికల్లో వెల్లడైంది కూడా.
నెయ్యిలో బ్యూటిరేట్ అనే కొవ్వు ఆమ్లం ఉంటుంది, ఇది గట్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది, ఈ కాఫీని గట్-ఫ్రెండ్లీగా కూడా పిలుస్తుంటారు
నెయ్యిలో ఆరోగ్యానికి అవసరమైన ఎ, డి, ఇ, కె వంటి విటమిన్స్ ఉంటాయి. ఇవి సులువుగా కొవ్వులొ కరిగిపోతాయి.
ఇంట్లోనే నెయ్యి కాఫీ ఎలా తయారు చేసుకోవాలి?
ఇంట్లో నెయ్యి కాఫీ తయారు చేయడం చాలా సులభం. ఈ కాఫీని ఇంట్లోనే ఎలా చేసుకోవాలి దానికి పదార్థాలు ఏంటి అనేది కింద వివరించాము పూర్తిగా చదవండి..
మీకు నచ్చిన పద్ధతిని ఉపయోగించి ఒక కప్పు బ్లాక్ కాఫీని తయారు చేసుకోవాలి. అనంతరం ఆ వేడి వేడి బ్లాక్ కాఫీని ఒక బ్లెండర్‌లో పోయాలి. ఆ బ్లెండర్‌లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కలపాలి. కావాలనుకునేవారు అదనంగా పాల క్రీమ్ కూడా వేసుకోవచ్చు. కొన్ని అదనపు ఆరోగ్య ప్రయోజనాల కోసం అందులో ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె పోసుకుంటే ఇంకా మంచిది.
పైన పేర్కొనబడినవన్నీ బ్లెండర్‌లో వేసుకున్న తరువాత కాఫీ స్మూత్‌గా, నురువు వచ్చేంత వరకు సుమారు 20 నుంచి 30 సెకన్ల పాటు బ్లెండ్ చేసుకోవాలి. అనంతరం ఆ కాఫీని ఒక గ్లాస్‌లో తీసుకొని దానికి రుచికి తగ్గట్టు స్టెవియా లేదా మాంక్ ఫ్రూట్ జ్యూస్‌ను కలిపుకుంటూ మంచిగా ఆ కాఫీని ఆనందించొచ్చు. ఈ కాఫీతో అనేక సమస్యలు తీరిపోవడంతో పాటు సమస్యలన్నీ దూరం అవుతాయి.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటిని పాటించే ముందు తప్పనిసరిగా నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది. వీటిని విశ్వసించడం అనేది పూర్తిగా మీ బాధ్యత.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications