Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
అందరి ఇంట్లో దొరికే ఈ ఆకు తింటే.. శృంగారంలో కింగ్ అవుతారు! ఎంత చేసినా అలుపు రాదు!
ప్రకృతి అద్భుతమైన ఔషధాలు నిలయం. మన చుట్టూనే ఎన్నో రకాల ఔషధ గుణాలు కలిగిన ఆహరం దొరుకుతూ ఉంటుంది. వాటిలో ఒకటి కరివేపాకు. ఈ కరివేపాకులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి. ఈ కరివేపాకును తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా దొరుకుతాయి. ఆలాగే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ కరివేపాకులో చాలా రకాల విటమిన్స్ దొరుకుతాయి. దీనిని తినడం వల్ల సప్లమెంట్స్ వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. కరివేపాకు తినడం వల్ల శృంగార బలం కూడా పెరుగుతుంది.
అయితే కరివేపాకు తినడం వల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? ఏ విధంగా కరివేపాకును తింటే ప్రయోజనాలు లభిస్తాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కరివేపాకుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
కరివేపాకును ఆయుర్వేదంలో ఔషధాలను తయారు చేసేందుకు వినియోగిస్తారు. ఇందులో ఎన్నోరకాల ఔషధ గుణాలు, విటమిన్స్ ఉన్నాయి. వీటితో పాటు యాంటీ యాక్సిడెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు శరీరానికి కావాల్సిన పోషకాలను అందజేస్తాయి.

ఈ కరివేపాకులో విటమిన్ బి, సీ, ఏలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు కంటిచూపును మెరుగుపరుస్తుంది. దీంతో పాటు రక్తస్రావాన్ని అరిగడుతుంది. ఈ కరివేపాకును తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. తద్వారా శృంగారంలో రాణించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పటికే ఇన్ఫెక్షన్లతో బాధ పడుతున్న వ్యక్తులు ఈ ఆకులను తినడం వల్ల.. ఇన్ఫెక్షన్ కంట్రోల్‌కి వస్తుంది. పోషకాల లోపాలు ఉన్న వ్యక్తులకు కూడా ఈ ఆకులు దివ్య ఔషధంగా పని చేస్తాయి.
కరివేపాకును ప్రతిరోజూ ఉదయాన్నీ ఖాళీ కడుపుతో తినడం వల్ల అనేక ప్రయోజనాలు పొందొచ్చు. ఇందులోని యాంటీ యాక్సిడెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ డయాబెటిక్ గుణాలు దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. షుగర్‌ను అదుపులో ఉంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరిచి, జీర్ణ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. కరివేపాకులో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది.
కరివేపాకును ఎలా తినాలి?
కరివేపాకును నేరుగా తినొచ్చు, లేదా ఆహారంలో వేసుకొని కూడా తినొచ్చు. ప్రతిరోజూ ఉదయాన్నే బ్రష్ చేసుకున్న తరువాత ఖాళీ కడుపుతో రెండు ఆకులను తినడం ద్వారా పొట్ట శుభ్రమవుతుంది. పొట్టలోని చెడు బ్యాక్టీరియా నాశనం అవుతుంది. అనేక రోగాలు దూరమవుతాయి. సాధారణంగా చాలా మంది కరివేపాకును తీసేసి ఆహారాన్ని తింటూ ఉంటారు. ఇలా తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోతూ ఉంటారు. అయితే కరివేపాకును కచ్చితంగా తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications