Latest Updates
-
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
గ్యాస్, అసిడిటీకి తక్షణమే చెక్ పెట్టే అద్భుతమైన వాము పరాఠా.. ఎలా చేయాలో తెలుసా? -
తొలి ఏకాదశి తేదీ, తిథి, పూజా విధానం, ఉపవాసం ఎలా విరమించాలి.. పూర్తి వివరాలు.! -
టమాటా తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయా? యూరాలజిస్ట్ చెబుతున్న అసలు నిజం ఇదే! -
వృశ్చికంలోకి చంద్రుడు.. రానున్న మూడు రోజులు ఈ రాశుల వారి గోల్డెన్ డేస్.! -
హిమాచల్ ప్రదేశ్ ఫేమస్ కధి పకోడి..వేడి వేడి అన్నంతో తింటే అమృతమే..ఈజీగా చేసుకోండిలా.. -
నాన్‌వెజ్ రుచిని మరిపించే మష్రూమ్ కర్రీ.. గ్రేవీ ఇలా చేశారంటే అద్భుతః అనాల్సిందే.! -
మీరు ఏ వంట నూనె వాడతారు.. ఆరోగ్యానికి ఎక్కువ ఏది మేలు చేస్తుందో తెలుసా.? -
ఆన్లైన్లో విపరీతంగా ఆభరణాలు కొంటున్నారా.. 'మెరిసే' నగలతో మోయలేని ఆరోగ్య సమస్యలు.! -
మీ భాగస్వామి ఈ విషయాల్లో మీకు దూరంగా ఉంటున్నారా.. ఈ సంకేతాలతో చాలా డేంజర్.!
సీతాఫలం తింటున్నారా?.. ఈ సంచలన నిజాలు ముందుగా తెలుసుకోండి.. లేకపోతే..!
సీతాఫలం.. ఇది ఒక సీజనల్ ఫ్రూట్. ఎలాంటి రసాయనాలు లేకుండా సహజంగా లభించే ఈ పండులో అనేక రకాల పోషక విలువలు ఉన్నాయి. ఈ పండు తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఉష్ణమండల ప్రాంతాల్లో పండే ఈ పండులో విటమిన్స్ పుష్కలంగా దొరుకుతాయి. వీటిని తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి, ఎలాంటి పోషకాలు ఇందులో ఉన్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
పోషకాల నెలవు..
సీతాఫలాన్ని ఇంగ్లీష్‌లో కస్టర్డ్ ఆపిల్ అని పిలుస్తుంటారు. ఈ సీతాఫలంలో పోషకవిలువలు మెండుగా ఉన్నాయి. విటమిన్ C, విటమిన్ A, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రోగ నిరోధకశక్తి పెంచడంతో పాటు చర్మ సౌందర్యానికి ఉపయోగపడతాయి. మలబద్దకం దూరం చేస్తుంది. జీర్ణక్రియ సాఫీగా జరిగేందుకు వీలుగా ఉంటుంది.

గుండె ఆరోగ్యానికి..
ఈ సీతాఫలం రోజూ తినడం వల్ల గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ పండులో సంతృప్త కొవ్వులు ఉంటాయి. ఈ కొవ్వు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే ఇవి గుండెకు మేలు చేసే ఆహారంగా మారుతాయి. ఇందులోని పొటాషియం కంటెంట్ రక్తపోటును నివారించేందుకు సహాయపడుతుంది. గుండె జబ్బులు, గుండెపోటు వంటి సమస్యలను దూరం చేస్తాయి. అలాగే ఈ సీతాఫలంలో ఉండే ఫైబర్ కంటెంట్.. శరీరంలోని చెడు కొవ్వును కరిగిస్తుంది. తద్వారా గుండెకు మేలు జరుగుతుంది.
జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది..
సీతాఫలం గుజ్జు ఎక్కువగా ఉంటుంది. ఇది తినడం వల్ల వెంటనే అరిగిపోతుంది. అలాగే ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడంతో.. అవి పొట్టలోని ఆహారాన్ని త్వరగా జీర్ణం చేసి, ఆకలి తొందరగా అవ్వకుండా ఉపయోగపడుతుంది. అసిడిటీ, అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి. ఈ పండులో సహజసిద్ధమైన ఎంజైమ్‌లు ఉంటాయి. అవి పోషకాలను గ్రహించేందుకు సమృద్ధిగా పని చేస్తాయి.
ఇమ్యూనిటీ బూస్టర్..
సీతాఫలంలో చాలా ఎక్కువ మొత్తంలో విటమిన్ సీ లభిస్తుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడానికి దోహదపడుతుంది. అలాగే ఇన్ఫెక్షన్లు, వైరల్ వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తుంది. విటమిన్ సీలో పుష్కలంగా యాంటీ యాక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీరాడికల్స్‌ను తగ్గిస్తాయి. అలాగే వాపు వంటి సమస్యలు ఉంటే వాటిని నివారించేందుకు ఉపయోగపడతాయి.
చర్మ సౌదర్యానికి..
మనందరికీ తెలుసు విటమిన్ A చర్మ సౌందర్యానికి ఎంతో ఉపయోగపడుతుందని. అలాగే కళ్ళు బాగా కనపడేందుకు కూడా ఇవి సహాయపడతాయని. అయితే ఈ సీతాఫలంలో ఈ విటమిన్ A పుష్కలంగా ఉంటుంది. ఇవి కణాల పునరుద్ధరణకు, కణాలను మరమ్మతు చేసేందుకు, చర్మం అందంగా యవ్వనంగా, మృదువుగా ఉండేందుకు సహాయపడతాయి. అలాగే కాలుష్యం నుంచి చర్మానికి ఏర్పడే కొన్ని కొన్ని సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి.
గమనిక: ఈ కథనంలో మేము అందించిన సమాచారం మాకు ఇంటర్నెట్‌లో దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. అవి కచ్చితనమైనవని మేము నిర్ధారించడం లేదు. వీటిని పాటించే ముందు లేదా అనుసరించాలని ప్రయత్నించే ముందు తప్పనిసరిగా నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications