Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
ఈ పప్పు తింటే మాంసంతో సమానం.. ఎక్కడ దొరుకుతుందో తెలుసా?
ప్రస్తుతం మనం జీవిస్తున్న ఈ కాలుష్యపు కాలంలో సమతుల్యమైన ఆహరం తినకపోతే ఆరోగ్యంగా ఉండడం చాలా కష్టం. మనం రోజూ తినే ఆహారంలో పోషక విలువలు ఉండాల్సిన అవసరం ఉంది. వాటిలో అతి ముఖ్యమైనది ప్రోటీన్, ఈ ప్రోటీన్ కోసం చాలా మంది మాంసం తినడంతో పాటు వివిధ రకాల సప్లమెంట్స్ వినియోగిస్తూ ఉంటారు. అయితే పప్పుల్లో కూడా చాలా ఎక్కువ మొత్తం ప్రోటీన్ ఉంటుంది.
కందిపప్పు, పెసర పప్పు, చెనా పప్పు వంటి పప్పుల్లో పుష్కలంగా ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. అయితే వీటన్నిటినీ మించి మినపప్పులో అధిక మొత్తంలో ప్రోటీన్ ఉంటుందట. ఈ పప్పును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మాంసం కంటే అధికమొత్తంలో ప్రయోజనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనిని రోజూ తినడం వల్ల శక్తి, బలం, కండరాల పుష్టి సమృద్ధిగా ఉంటుందట. ఇంకా ఈ మినపప్పులో ఏఏ పోషకాలు ఉన్నాయి, ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు లభించనున్నాయో తెలుసుకుందాం.

మినపప్పుతో ఆరోగ్య ప్రయోజనాలు
ఈ మినపప్పులో పుష్కలంగా ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, సోడియం, ఐరన్‌తో పాటు ఎన్నో రకాల విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. దీనిని తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషక విలువలు సమృద్ధిగా దొరుకుతాయి. దీంతో పాటు ఈ మినపప్పును తినడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. తిన్న ఆహరం మంచిగా జీర్ణం అవడంతో పాటు ఇందులోని పోషక విలువలు శరీరానికి సమృద్ధిగా పట్టుకునేందుకు సహాయపడతాయి.
ఈ పప్పులో ఫైబర్ శాతం కొంచెం ఎక్కువగానే ఉటుంది. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం, అజీర్ణం వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. అలాగే కడుపు ఉండాల్సిన మంచి బ్యాక్టీరియాను అలానే ఉంచుతుంది. త్వద్వారా జీర్ణ వ్యవస్థకు కావాల్సిన బ్యాక్టీరియా శరీరంలో ఉండి, శరీరానికి కావాల్సిన పోషకాలు అందిస్తుంది.
మిగతా పప్పులు తినడం వల్ల గ్యాస్ సమస్య ఏర్పడే అవకాశం ఉంటుంది. కానీ మినపప్పు తినడం వల్ల ఆ సమస్యలు దూరం అవుతాయి. అలాగే పైల్స్, నిద్రలేమి, శ్వాస సమస్యలు వంటివి దూరం అవుతాయి. అధికంగా మధుమేహంతో బాధపడే వారికి ఈ పప్పు ఎంతగానో ఉపయోపడుతుంది. ఇందులో షుగర్ శాతం తక్కువగా ఉండడం వల్ల.. మధుమేహంతో బాధపడే వారు దీనిని తీసుకుంటే ఉత్తమ ఫలితాలు పొందొచ్చు.
పప్పులో అధికమొత్తంలో ప్రోటీన్ ఉండడం వల్ల బరువు అధికంగా పెరుగుతారని భావన ఉంటుంది. కానీ ఈ మినపప్పు తినడం వల్ల అధిక బరువు సమస్య నుంచి తప్పించుకోవచ్చు. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల.. ఆకలి నియంత్రలో ఉండి ఏది పడితే అది తినడాన్ని నివారిస్తుంది. శరీరంలో క్యాలరీల ఇంటెక్‌ను తగ్గించి బరువు తగ్గడంతో సహాయపడుతుంది.
పప్పును ఎలా తినాలి?
మినపప్పుతో సాధారణంగా చాలా మంది దోషాలు వేసుకుంటారు. అలాగే ఇడ్లీలో కూడా కలుపుతారు. ఈ మినపప్పును ఈ విధంగా తింటే సమృద్ధిగా పోషకాలు అందుతాయి. అలాగే ఈ పప్పుతో పప్పుచారు, వడ వంటివి కూడా చేసుకొని తినొచ్చు. లేదా దీనిని బాగా వేయించుకొని, పొడిగా చేసుకొని అందులో కొంచెం చెక్కర కూడా కలుపుకొని తినొచ్చు. షుగర్ ఉన్నవారు చెక్కరను మినహాయిస్తే సరిపోతుంది.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన విషయాలు ఆరోగ్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటిని అనుసరించే ముందు తప్పనిసరిగా నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications