Latest Updates
-
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి! -
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా? -
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే.. -
ఫోన్ పక్కనపెట్టి ఇది ట్రై చేయండి.. హృతిక్ చెబుతున్న హెల్త్ టిప్స్! -
నార్త్ స్టైల్ చోలే మసాలా.. పూరీ, చపాతీలోకి వేళ్లు చప్పరిస్తూ లాగించేస్తారు.!
ఈ గింజలు తింటే జుట్టు రాలడం తగ్గిపోతుంది, ఎంత గుంజినా ఒక్క వెంట్రుక కూడా ఊడదు!
కాలుష్యం, మారుతున్న జీవన విధానం కారణంగా ప్రతి ఒక్కరూ ముఖ్యంగా ఎదుర్కొంటున్న సమస్య జుట్టు రాలడం. ఈ సమస్య కారణంగా చాలా మంది తీవ్రంగా బాధపడుతుంటారు. వాటిని నివారించుకోవడానికి రకరకాల ప్రొడక్ట్స్ వినియోగిస్తుంటారు. అయినా వారు ఫలితాలు పొందలేకపోతారు. అలాంటి వారు అవిసె గింజలను వినియోగించడం వలన అనేక మంచి ఫలితాలను పొందవచ్చు. వీటి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అవిసె గింజల వలన ఉపయోగాలు
అవిసె గింజలు చిన్నవిగా ఉండి, ఆరోగ్యానికి అవసరమైన అనేక పోషకాలతో నిండి ఉంటాయి. ఇవి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, లిగ్నన్స్, ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ వంటి మూలకాలు పుష్కలంగా ఉన్నాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ రక్తపోటును తగ్గించడంలో, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో, గుండె జబ్బుల రిస్క్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.

జీర్ణక్రియ కోసం
అవిసె గింజల్లోని అధిక ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. ప్రేగు కదలికలను సులభతరం చేస్తుంది. అలాగే, అవిసె గింజలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి, దీనివల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకీ ఇవి లాభదాయకంగా ఉంటాయి.
క్యాన్సర్ కోసం
లిగ్నన్స్ అవిసె గింజల్లో ఉన్న మరో ముఖ్యమైన పోషకం, ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను అరికట్టే లక్షణాలను కలిగి ఉంటుంది. అవిసె గింజలు రొమ్ము, ప్రోస్టేట్ మరియు పెద్దప్రేగు క్యాన్సర్‌ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అదేవిధంగా, ఫైబర్ కడుపుని నింపుతూ, అధిక ఆహారాన్ని తీసుకోవడం నివారించి బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
జుట్టు ఆరోగ్యం కోసం
అవిసె గింజల్లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ చర్మాన్ని తేమగా ఉంచి చర్మ సమస్యలను నివారించడంలో సహాయపడతాయి. అవిసె గింజల్ని రెగ్యులర్‌గా తీసుకోవడం మహిళల్లో హార్మోన్ల సమతుల్యతను కాపాడడంలో సహాయపడుతుంది. రుతుక్రమ సమస్యలు, మెనోపాజ్ లక్షణాలను తగ్గించడంలో కూడా ఇవి ప్రయోజనకరమైనవి. అవిసె గింజల్లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలోని ఇంఫ్లమేషన్‌ను తగ్గించడంలో సహాయపడతాయి, అలాగే జుట్టు ఆరోగ్యంగా, బలంగా మారడంలో కూడా ఇవి కృషి చేస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications