Latest Updates
-
ఢిల్లీలో మండుతున్న ఎండలు! వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి -
రాత్రి పప్పు మిగిలిపోయిందా? అయితే ఉదయం ఇలా కమ్మని పరాఠా చేసుకోండి! -
ఏప్రిల్ 22 పంచాంగం: ఈ పనులు ఈ సమయంలో మొదలుపెడితే తిరుగుండదా? నేటి శుభ ముహూర్తాలివే! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన ధన యోగం..! - బుధవారం, 22 ఏప్రిల్ 2026 -
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా?
చలికాలంలో ప్రతిరోజూ ఒక చెంచా ఈ రసం తాగితే రోగాలన్నీ దూరమవుతాయి.. ఎక్కడ దొరుకుతుందంటే?
తేనె ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. ప్రతిరోజూ ఉదయాన్నే ఒక స్పూన్ తేనె తింటే మన శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. అదే ప్రత్యేకంగా చలి కాలంలో ఉదయాన్నే తేనె తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయట. మరీ ముఖ్యంగా సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టేందుకు ఇది అద్భుతమైన ఔషధంగా పని కొస్తుందని పేర్కొంటున్నారు. ఇంతటి అద్భుతమైన తేనె తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి? తేనెను ఎలా తినాలి అనేది ఈరోజు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
జలుబు, దగ్గు నుంచి ఉపశమనం..
చలి కాలంలో సాధారణంగా అందరినీ ఇబ్బంది పెట్టే సమస్య జలుబు, దగ్గు. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు తేనె తింటే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు తేనె తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే బరువు తగ్గేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. తేనెను క్రమం తప్పకుండా తీసుకుంటే అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలు దూరం అవుతాయి. అలాగే ఈ తేనె తినడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ పెరగడంతో పాటు.. గుండె సమస్యలు దూరం అవుతాయి. చర్మం, దంత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

అంటు వ్యాధులకు చెక్..
తేనెలో రోగ నిరోధక శక్తిని పెంపొందించే గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీంతో పాటు మెగ్నీషియం, క్యాల్షియం, ఐరన్ వంటి ఖనిజాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. తేనెలోని ఈ గుణాలు అంటు వ్యాధులకు చెక్ పెట్టగలవు. దగ్గు, జలుబు, గొంతునొప్పి వంటి సమస్యలను కూడా దరిచేరనివ్వకుండా మనల్ని సురక్షితంగా ఉంచగలవు.
శ్వాసకోశ వ్యాధుల నుంచి ఉపశమనం..
గోరు వెచ్చని నీటిలో ప్రతిరోజూ ఉదయం ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ నిమ్మరసం కలుపుకొని తాగితే శ్వాసకోశ సమస్యలు దూరం అవుతాయి. ప్రతిరోజూ ఉదయం ఒక చెంచా తేనె, ఒక చెంచా లవంగం పొడిని కలుపుకొని తాగినా మంచి ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ యాక్సిడెంట్ గుణాలు శరీరంలోని వ్యాధులతో పోరాడుతాయి. అలాగే జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలన్నీ దూరం అవుతాయి.
మానసిక సమస్యలు దూరం..
ప్రతిరోజూ హెర్బల్ టీలో ఒక చెంచా తేనె కలుపుకొని తాగితే.. మానసిక సమస్యలు తొలగిపోతాయి. అలాగే ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే పొట్టకు సంబంధించిన వ్యాధులు తగ్గిపోవడంతో పాటు గుండె సంబంధిత వ్యాధులు కూడా దూరమవుతాయి. మలబద్దకం, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు కూడా దూరంగా ఉంటాయి.
సైనస్ సమస్యలు కూడా..
చలికాలంలో ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టె సమస్య సైనస్ సమస్య. అయితే ఈ సమస్యను దూరం చేసేందుకు రెండు చెంచాల యాపిల్ సైడర్ వెనిగర్‌తో పాటు ఒక చెంచా తేనె కలుపుకొని తాగితే సైనస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే చలికాలంలో శరీరంలో వేడి పెరగడానికి, శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ పోగొట్టడానికి.. ఒక చెంచా తేనె, అర చెంచా అల్లం రసం, అర చెంచా దాల్చిన చెక్కపొడి వేసుకొని తాగితే.. చెడు కొవ్వు తొలిగిపోవడంతో పాటు శరీరానికి కావాల్సిన వేడి లభిస్తుంది.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు పలు అధ్యయాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటి శాస్త్రీయతను మేము నిర్ధారించడం లేదు. వీటిని పాటించే ముందు తప్పనిసరిగా నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











