Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
చలికాలంలో ఈ పాలు తాగితే ఎలాంటి రోగాలు రావు.. ఎలా చేసుకోవాలంటే?
చలికాలం మొదలైంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం సమయంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ఇలాంటి చల్లని వాతావరణంలో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ అనారోగ్యాల బారిన పడుతూ ఉంటారు.
అలాంటి వారు పసుపు పాలను తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయట. పసుపు పాలలో ఉండే ఔషధ గుణాలు మనిషిని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపదహాయట. అయితే ఈ పసుపు పాలు తాగడం వల్ల ఎలాంటి ఉపయోగాలు పొందుతాము, ఏ విధంగా ఆ పాలను తయారు చేసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
పసుపు పాలతో ఆరోగ్య ప్రయోజనాలు
రోగ నిరోధక శక్తి బలపడుతుంది
పసుపు పాలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి మనిషి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. దీని కారణంగా ఈ శీతాకాలంలో మనిషి తరుచుగా బాధపడే దగ్గు, జలుబు, జ్వరం వంటి వ్యాధులను నయం చేస్తుంది. అలాగే ఇతర ఇన్‌ఫెక్షన్లతో పోరాడడానికి ఎంతో సహాయాన్ని అనిస్తుంది.

కీళ్ల సమస్యలు దూరం..
పసుపులో కర్కుమిన్ ఉంటుంది. అదే సమయంలో పాలలో కాల్షియం ఉంటుంది. ఇవి కీళ్ల వాపును తగ్గించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే ఇందులో ఉండే కాల్షియం ఎముకలను బలంగా ఉంచుకునేందుకు, ఎముకల ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడతాయి. ఆర్థరైటిస్ వంటి దీర్ఘ కాలిక సమస్యలతో బాధ పడే వ్యక్తులు ఈ పాలను తీసుకోవడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. తరచుగా ఈ పాలను తాగడం వల్ల మంచి ఫలితాలను పొందొచ్చు.
జీర్ణ వ్యవస్థ కోసం..
పసుపులో జీర్ణ ఎంజైమ్‌లు పుష్కలంగా ఉంటుంది. ఇవి శరీరంలోని జీర్ణ వ్యవస్థను సక్రమంగా నిర్వహించేందుకు సహాయపడతాయి. అలాగే తిన్న ఆహరం ఆగిరిపోయేందుకు పసుపు పాలు ఎంతగానో సహాయపడుతుంది. కడుపులో మంట, అజీర్ణం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలకు ఈ ఒక్క పాలతో చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు.
చర్మ ఆరోగ్యానికి..
ఈ పసుపు పాలలో మనం ముందుగా చెప్పుకున్నట్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇది చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుంది. అలాగే ముఖంపై ఇతర మొటిమలు, మచ్చలు, ఇతర ఏదైనా సమస్యలు ఉన్నా దానికి పరిష్కారం చూపుతుంది. మొత్తానికి చెప్పాలంటే చర్మం కాంతి వంతంగా, నిగనిగలాడుతోంది.
మంచి నిద్ర కోసం..
ఈ మధ్య కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య నిద్రలేమి. చేస్తున్న పనిలో కావచ్చు, వేరే ఏదైనా కార్యక్రమంలో ఈ నిద్రలేమి సమస్య కారణంగా ఇబ్బందుతులను ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి వ్యక్తులు ఈ పసుపు పాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందొచ్చు. ఈ పసుపు పాలలో మెగ్నీషియం ఒత్తిడిని తగ్గిస్తుంది. తద్వారా క్రమంగా నిద్ర నాణ్యత పెరిగి, నిద్ర సుఖంగా పడుతుంది. అందుకే రాత్రి పూట పడుకునే ముందు ఒక గ్లాస్ పాలు తాగి పడుకుంటే మంచిదని పలువురు చెప్తుంటారు.
పసుపు పాలను ఎలా తాయారు చేసుకోవాలంటే..
ముందుగా ఒక గ్లాస్ పాలను ఒక గిన్నెలో వేసుకొని బాగా మరించుకోవాలి. అనంతరం అందులో ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు కొంచెం ఘాటుగా ఉండే నల్ల మిరియాలు కలుపుకుంటే మంచిది. ఇందులో ఉండే ఘాటు గుణం ఇతర సమస్యలను పోగొట్టడంతో పాటు మంచి ఆరోగ్యాన్ని పొందేందుకు సహాయపడుతుంది.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటిని పాటించే ముందు తప్పనిసరిగా నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications