Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
ఈ డ్రింక్స్ తాగుతున్నారా.. అయితే శృంగారంలో పాల్గొనలేరు.. తమ్ముడు షెడ్‌కి పోవాల్సిందే!
చాలామంది అన్నం తిన్న వింటేనే, లేదా బిర్యాని తిన్న వెంటనే కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. అలాగే దాహం వేస్తే ఎనర్జీ డ్రింక్ పేరుతో కూల్ డ్రింక్స్ తాగేస్తుంటారు. అయితే కూల్ డ్రింక్స్ అతిగా తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్పిన విషయం తెలిసిందే. అయితే కూల్ డ్రింక్స్ తాగడం వల్ల కేవలం ఆరోగ్య సమస్యలు మాత్రమే కాదు లైంగిక సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు. అసలు ఏ విధంగా కూల్ డ్రింక్స్ శృంగార జీవితాన్ని ప్రభావితం చేస్తాయి? ఎలాంటి సమస్యలు వస్తాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
డీహైడ్రేషన్
కూల్ డ్రింక్స్ తాగడం వల్ల దాహం తీరడం మాత్రమే కాదు. ఇవి డీ హైడ్రేషన్‌ని పెంచుతాయి. దీని వల్ల ప్రైవేట్ పార్టులు రక్త ప్రసరణ జరగదు. దీని వల్ల లైంగిక సామర్థ్యం తగ్గిపోతుంది. అలాగే శక్తి తగ్గిపోవడంతో పాటు శృంగారంలో పాల్గొనాలనే కోరికలు కూడా తగ్గిపోతాయి. ఇది శృంగార జీవితంపై నెగిటివ్ ప్రభావాన్ని చూపుతాయి.

షుగర్ పెరుగుతుంది
కార్బోనేటేడ్ డ్రింక్స్‌లో ఎక్కువగా షుగర్ ఉంటుంది. ఇవి శరీరంలో షుగర్ స్థాయిని పెంచుతుంది. దీని వల్ల శరీరంలో శక్తి తగ్గిపోతుంది. దీంతో పాటు మూడ్ స్వింగ్స్ ఎక్కువ అవుతాయి. దీనివల్ల శృంగానికి గుండెవంటి లిబిడో తగ్గిపోతుంది. దీని స్థాయి తగ్గిపోతుందంటే మీరు శృంగారంలో వీక్ అవుతున్నారనిగ్రహించాలి . దీంతో శృంగారంలో పాల్గొనాలనే మీ కోరిక తగ్గిపోవడంతో పాటు, శృంగార సామర్ధాన్ని తగ్గించేస్తుంది. అనుకున్నంత సేపు శృంగారంలో రాణించలేకపోతారు.
హార్మోన్స్‌పై ప్రభావం
కడుపులో మంట ఉన్నా లేదా ఇతర జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నా చాలా మంది కూల్ డ్రింక్స్ తాగడానికి ఇష్టపడుతుంటారు. ఇవి సమస్యలను దూరం చేయడం పక్కనబెడితే ఉన్న సమస్యలను ఇంకాస్త ఎక్కువ చేస్తాయి. శరీరంలో ఎసిడిటీని పెంచుతాయి. అలాగే శరీరంలోని సహజసిద్ధమైన pHను ప్రభావితం చేసి.. హార్మన్లపై దాడి చేస్తుంది. దీని వల్ల హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది ఒత్తిడిని పెంచి శృంగారానికి కారణమయ్యే టెస్టొసిరాన్ వంటి హార్మోన్లను తగ్గింపజేస్తుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
కూల్ డ్రింక్స్ నుంచి వచ్చే సమస్యల నుంచి తప్పించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. హైడ్రేటెడ్‌గా ఉండేందుకు రోజుకు కనీసం 8 నుంచి 9 గ్లాసుల నీటిని తాగాలి. అలాగే షుగర్ డ్రింక్స్, కార్బోనేటేడ్ డ్రింక్స్ తాగడం పూర్తిగా మానేయాలి. అలాగే పోషకాలు ఎక్కువగా ఉదనే డైట్‌ని పాటించాలి. ఒత్తిడిని తగ్గించేందుకు యోగా, వ్యాయామం చేయాలి. అలాగే పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు వంటిని తీసుకోవాలి. వీటిని పాటిస్తే కచ్చితంగా మీ శృంగార జీవితం మెరుగుపడుతుంది. అలాగే శృంగారంలో మీరు కింగ్ అవుతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications