Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
లేడీస్ నెయిల్ పాలిష్ ఎంత ప్రమాదమో తెలుసా? ప్రాణాలు పోతాయట!
నెయిల్ పాలిష్ అనేది మహిళలకు చాలామందికి ఇష్టం ఉంటుంది. గోళ్లను అందంగా చూపించేందుకు వారు దీనిని తరచుగా వాడుతుంటారు. కొందరు మహిళలు నెయిల్ పాలిష్ లేకుండా గోళ్ళను అస్సలు ఉంచుకోరు. మరికొందరు ప్రత్యేక సందర్భాల్లో, ఉదాహరణకు వివాహ వేడుకలు, పండుగలకు మాత్రమే గోళ్లకు నెయిల్ పాలిష్ వేసుకుంటారు. అయితే, గోళ్ల అందాన్ని పెంచే నెయిల్ పాలిష్ వాడడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమట.
ఇటీవల ఇండియన్ హెల్త్ టిప్స్ 4U అనే యూట్యూబ్ ఛానెల్‌లో ప్రచురితమైన ఒక వీడియోలో నెయిల్ పాలిష్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాని ప్రకారం నెయిల్ పాలిష్ మానవ శరీరంపై అనేక దుష్ప్రభావాలను కలిగిస్తుందని తేలింది. ముఖ్యంగా మెదడు, జీర్ణక్రియ, నాడీ వ్యవస్థ మరియు వెన్నెముకపై ప్రతికూల ప్రభావం చూపుతుందని చెప్పారు.

నాడీ వ్యవస్థకు చెడు
నెయిల్ పాలిష్‌లో ఉండే రసాయనాలు శరీరంలోకి చేరి నాడీ వ్యవస్థ, మెదడు, జీర్ణవ్యవస్థ, హార్మోన్ల వ్యవస్థ మరియు వెన్నెముకపై ప్రభావం చూపుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే, నెయిల్ పాలిష్ వేసిన 9-10 గంటల తర్వాత గొంతులో వాపు, చర్మంపై దురద, మంట, ఇతర సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు.
వైద్యులు ఏం చెబుతున్నారంటే
దీనిపై ప్రముఖ ఆయుర్వేద, పంచకర్మ క్లినిక్ వైద్యులు మాట్లాడుతూ.. నెయిల్ పాలిష్ వాడకం శరీరంపై ప్రమాదకరమైన ప్రభావాలను కలిగిస్తుందన్నారు. నెయిల్ పాలిష్‌లో ముఖ్యంగా ఫార్మాల్డిహైడ్ అనే రసాయనం ఉంటుంది. ఇది గోళ్ల చర్మం ద్వారా నేరుగా రక్తప్రవాహంలోకి చేరుతుంది. దీన్ని ఎక్కువగా వాడటం వల్ల హార్మోన్లలో మార్పులు వస్తాయని, దీని వాడకం కొన్ని రకాల క్యాన్సర్‌లకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
శ్వాసకోశ సమస్యలు
తడి నెయిల్ పాలిష్ శరీరంలోకి ప్రవేశనించడానికి మరింత శక్తితో పని చేస్తుంది. ఇది శరీరంలోకి ప్రవేశించి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగిస్తుంది. కొన్ని సందర్భాల్లో, నెయిల్ పాలిష్ నోటి ద్వారా కూడా శరీరంలోకి చేరి వికారం, వాంతులు, విరేచనాలు కలిగించే ప్రమాదం ఉంటుంది. నెయిల్ పాలిష్ వాడేటప్పుడు, దానిలో ఏ పదార్థాలు ఉన్నాయో పరిశీలించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతం, కొన్ని కంపెనీలు తక్కువ-రిస్క్ పదార్థాలతో నెయిల్ పాలిష్ తయారు చేస్తున్నారు. అయినప్పటికీ, నెయిల్ పాలిష్ వినియోగాన్ని పరిమితం చేయడం ఉత్తమం. దీన్ని వాడిన తర్వాత త్వరగా తొలగించడం, ముఖ్యంగా పిల్లల గోళ్ళకు వాడకూడదు అని చెబుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications