Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Skinny Jeans: వేసవిలో స్కిన్నీ జీన్స్.. ఈ సమస్యలు తప్పవు, జాగ్రత్త!
స్కిన్నీ జీన్స్.. ఆడవారి ఫ్యాషన్ ట్రెండ్ ఇది. స్లీక్ అండ్ స్టైలిష్ లుక్ వీటి సొంతం. బిగుతుగా ఉండే ఈ జీన్స్ వేసుకుంటే చాలా మోడ్రన్ గా కనిపిస్తారు. శరీర సౌష్టవం కూడా చక్కగా కనిపిస్తుందని యువతులు స్కిన్నీ జీన్స్ ఎంచుకుంటారు. అయితే వేసవి కాలంలో ఈ టైట్ ఫిట్ జీన్స్ వేసుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్టైలిష్ గా కనిపించే ఈ జీన్స్ వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
వేడి, చెమట:
స్నిన్నీ జీన్స్ చాలా బిగుతుగా ఉండే డెనిమ్ తో తయారు చేస్తారు. ఇవి వేడిని పుట్టిస్తాయి. చర్మం నుండి వచ్చే చెమటను బయటకు వెళ్లకుండా అడ్డుకుంటాయి. వేడి వల్ల చెమట మరింత పెరుగుతుంది. కొంత సమయానికి అసౌకర్యంగా, చికాకుగా అనిపిస్తుంది. ఇది చెమట పొక్కులకు దారి తీస్తుంది.

బ్లడ్ సర్క్యులేషన్ సమస్య:
స్కిన్నీ జీన్స్ చాలా బిగుతుగా ఉండి బ్లడ్ సర్క్యులేషన్ కు ఇబ్బంది కలిగిస్తాయి. వీటిని ఎక్కువ సేపు వేసుకోవడంవల్ల కాళ్లు, పాదాల్లో తిమ్మిరి, జలదరింపు, నొప్పి వంటివి వస్తాయి. నరాలు దెబ్బతినడానికి కారణం అవుతాయి. ఇది ఇతర శారీరక సమస్యలను తెచ్చిపెడతాయి.
ఈస్ట్ ఇన్ఫెక్షన్లు:
స్కిన్నీ జీన్స్ వల్ల వచ్చే వేడి, తేమ ఇన్ఫెక్షన్లకు దారి తీస్తాయి. ఈస్ట్ ఇన్ఫెక్షన్ కూడా రావొచ్చు. దీని వల్ల సంతానోత్పత్తి సమస్యలు తలెత్తుతాయి. ప్రైవేట్ పార్ట్స్ భాగంలో దురద, మంట, వైట్ డిశ్చార్జ్ వంటి వస్తాయి.
బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు:
స్కిన్నీ జీన్స్ వల్ల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు రావొచ్చు. టైట్ ఫిట్ వల్ల చెమట వస్తుంది. ఇది పొడిగా మారేందుకు అవకాశం ఉండదు. అలా బ్యాక్టీరియా చేరి ఇన్ఫెక్షన్లు వస్తాయి. చర్మం ఎరుపుగా మారడం, వాపు, నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.
స్కిన్నీ జిన్స్ స్లీక్ అండ్ స్టైలిష్ గా ఉన్నప్పటికీ, వాటి వల్ల ఆరోగ్య సమస్యలు తప్పవు. వేసవి కాలంలో స్కిన్నీ జీన్స్ ను వీలైనంత వరకు వేసుకోకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
స్కిన్నీ జీన్స్ వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలకు చిట్కాలు:
* బిగుతుగా ఉండే జీన్స్ ను కాకుండా వదులుగా ఉండే దుస్తులు ధరించాలి.
* గాలి ప్రవేశించడానికి వీలుగా ఉండే దుస్తులు వేసుకోవాలి. డెనిమ్ బ్రీతెబుల్ ఫ్యాబ్రిక్ కాదు. కాబట్టి కాటన్, లినెన్ ఫ్యాబ్రిక్ దుస్తులు ధరించాలి.
* తేలికైన బట్టలు వేసవి కాలానికి అనువైనవి. కాటన్ దుస్తులు ధరించడం వల్ల చెమటను పీల్చుకుని శరీరాన్ని పొడిగా ఉంచుతాయి. ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.
* జీన్స్ ధరించాల్సిన పరిస్థితి వస్తే చర్మానికి మాయిశ్చరైజర్ రాసుకోవడం మంచిది. దీని వల్ల చర్మ చికాకు నుండి తప్పించుకోవచ్చు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications