Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Sugarcane Juice Risks: వేసవికాలంలో చెరకు రసం తెగ తాగేస్తున్నారా, ఈ సమస్యలు రావొచ్చు జాగ్రత్త!
బయట ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఇంట్లో నుండి కాలు బయట పెట్టాలంటే జనాలు జంకుతున్నారు. ఈ వేడిని తట్టుకునేందుకు చాలా మంది రకరకాల పండ్ల రసాలు, సోడాలు, కూల్‌డ్రింక్‌లు తాగుతుంటారు.
వేసవికాలంలో చెరకు రసం స్టాల్స్ చాలా కనిపిస్తుంటాయి. ఎండాకాలంలో చల్లగా ఉండే చెరకు రసాన్ని తాగడం చాలా మందికి అలవాటు. దీని వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఎక్కువగా తాగడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బాక్టీరియల్ కంటామినేషన్:
చెరకు రసంతో ప్రధాన ఆరోగ్య ప్రమాదం బాక్టీరియా కంటామినేషన్. చాలా చోట్ల చెరకు రసం అపరిశుభ్రమైన పరిస్థితుల్లో తయారు చేస్తారు. దీని వల్ల సాల్మోనెల్లా, ఎస్చెరిచియా కోలి, విబ్రియో కలరా వంటి హానికరమైన బాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఈ బాక్టీరియా ఫుడ్ పాయిజనింగ్, ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
అధిక చక్కెర:
చెరకు రసంలో సహజంగా చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఇది మధుమేహం లేదా ఇతర పరిస్థితులతో బాధపడేవారికి వారికి ఆరోగ్యంగా మంచిది కాదు. చెరకు రసాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. ఇది హైపర్లైసీమియాకు కారణమవుతుంది. అదనంగా, అధిక చక్కెర వినియోగం వల్ల బరువు పెరగడం సహా ఇతర ఆరోగ్య సమస్యలకు దోహదం చేస్తుంది.

చెరకు రసం హైడ్రేటింగ్‌గా ఉండటంతో పాటు మూత్ర ఉత్పత్తిని ఎక్కువ చేస్తుంది. దీని వల్ల శరీరం నీటిని కోల్పోయి డీహైడ్రేషన్ కు గురవుతారు. వేడి వాతావరణం కారణంగా డీహైడ్రేషన్ కు గురయ్యే ప్రమాదం ఉన్న ఎండాకాలంలో ఇది మరింత తీవ్రంగా ఉంటుంది. డీహైడ్రేషన్ అలసట, మైకం, హీట్ స్ట్రోక్‌తో సహా అనేక రకాల ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
దంత క్షయం:
చెరకు రసం ఆమ్లంగా ఉంటుంది. తరచూ చెరకు రసం తాగడం వల్ల దంతాలపై ఉండే ఎనామిల్ పొర దెబ్బతింటుంది. ఇది దంత క్షయం, ఇతర దంత సమస్యలకు దారితీస్తుంది. సరైన నోటి పరిశుభ్రత పద్ధతులు లేకుండా క్రమం తప్పకుండా చెరకు రసం తాగడం వల్ల దంతాలకు తీవ్రమైన హాని కలుగుతుంది.
ప్రమాదాలను తగ్గించడం:
చెరకు రసంతో తలెత్తె ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి, రసాన్ని పరిశుభ్రమైన వాతావరణంలో తయారు చేయడం చాలా ముఖ్యం. చెరకు రసాన్ని తీసుకునే సమయంలో పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయో లేదో తనిఖీ చేసుకోవడం మంచిది.
మధుమేహులు, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడే వారు చెరకు రసాన్ని మితంగా తాగడం చాలా ముఖ్యం. అలాగే వేసవికాలంలో చెరకు రసాన్ని తీసుకోవాలనుకుంటే వీలైనంత ఎక్కువగా నీరు తాగడానికి సిద్ధపడాలి. దీని వల్ల డీహైడ్రేషన్ సమస్య తలెత్తకుండా ఉంటుంది. అలాగే చెరకు రసం తాగిన తర్వాత నోటిని, దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల దంత క్షయం రాకుండా కాపాడుకోవచ్చు.
వేసవికాలంలో ఎండలు మండిపోతున్నప్పుడు చల్లని తియ్యని చెరకు రసం తాగాలని నాలుక లాగేస్తుంటుంది. చెరకు రసం తాగితే రిఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. అయితే దీని వల్ల తలెత్తే సమస్యలను దృష్టిలో ఉంచుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యల నుండి దూరంగా ఉండొచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications