కళ్లను చూస్తే రోగం చెప్పవచ్చు.. కళ్లు ఎందుకు అదురుతాయో తెలుసా..?

మీకెప్పుడైనా కనురెప్పలు అదిరాయా ? ఖచ్చితంగా అదిరే ఉంటాయి. ఎందుకంటే అది సహజం. కానీ అలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా ? దానికి అసలు కారణం ఏంటో మీకు చెబుతాం. అదొకటే కాదు. కళ్లను చూసి ఆరోగ్యం ఎలా ఉందో కూడా ఇట్టే పసిగట్టవచ్చని బ్రిటన్‌లోని ఆంగ్లియా రస్కిన్ యూనివర్సిటీ రీసెర్చ్ ఇన్నోవేషన్ విభాగం ప్రొఫెసర్ బర్బరా చెబుతున్నారు. ఏ టెస్టులు చేయకుండానే కళ్లను చూసి అనేక రకాల ఆరోగ్య సమస్యలను గుర్తించవచ్చని అన్నారు. రోగి కళ్ళలోకి లైట్ వేసి డాక్టర్ చెక్ చెయ్యటం మీరు చూసే ఉంటారు. అలా ఎందుకు చేస్తారో తెలుసా.. కనుపాప వెలుతురుకు తక్షణమే స్పందిస్తుంది. ప్రకాశవంతమైన వాతావరణంలో కనుపాప చిన్నదవుతుంది. వెలుతురు తగ్గే కొద్దీ కనుపాప పెద్దది అవుతుంది.

Health Status and diseases can be known just be seeing the eyes

కనుపాప పరిణామం హెచ్చుతగ్గుల ప్రతిస్పందన నెమ్మదిగానో, ఆలస్యంగానో జరిగితే అది అనారోగ్యానికి సూచన, కనుపాప స్పందనల్లో తేడా ఉంటే అల్జీమర్స్ వంటి వ్యాధులు మందుల ప్రభావానికి అది సంకేతం కావచ్చు. కంటిలోని తెల్లగుడ్డు రంగు మారటం కూడా మన శరీరంలో ఏదో తేడా ఉందని ఇందుకు సంకేతం కావచ్చు. కళ్లు ఎరుపు రంగులోకి రక్తంతో ఎరుపెక్కిన రంగులో కనిపిస్తే అది అధిక మోతాదులో మద్యం లేదా మాదకద్రవ్యాలను తీసుకున్న దానికి సంకేతం కావచ్చు. కళ్లలోన ఇన్ఫెక్షన్ కారణంగా కూడా కళ్లు ఎర్రగా మారవచ్చు.

కంటిలోని తెల్లగుడ్డు పసుపు రంగులోకి మారితే అది జాండీస్, కామెర్ల జబ్బు. కాలేయం వాపు జన్యుపరమైన లేదా ఆటో ఇమ్యూన్ జబ్బులు, కొన్ని రకాల మందులు, వైరస్ లు, ట్యూమర్లు వంటి వాటి వల్ల కూడా ఈ జబ్బు రావచ్చు. కంటి తెల్లగుడ్డు మీద ఒక ఎర్రని రక్తపు చార వంటి గుర్తు కనిపించింది అంటే అక్కడ రక్తనాళాలు చిట్లిందనేందుకు సంకేతం. ఈ పరిస్థితికి చాలా సందర్భాల్లో కారణాలు తెలియవు. కొన్ని రోజుల్లోనే ఆ చార కనిపించకుండా పోతుంది. అధిక రక్తపోటుతో గానీ మధుమేహానికి గానీ లేదా రక్త సరఫరాలో గడ్డలు కట్టి అడ్డంకులు ఏర్పడి అధిక రక్తస్రావానికి దారితీయడానికి గానీ తెల్లగుడ్డు మీద ఎర్రని చార సూచిక కావచ్చు.
కంటిలోని నల్లగుడ్డు చుట్టూ తెల్లని లేదా బూడిద రంగు వలయం కనిపిస్తే అది తరచుగా అధిక కొవ్వుకు చిహ్నంగా గుండె జబ్బు ప్రమాదం ఎక్కువగా ఉందని చెప్పే సంకేతంగా భావిస్తారు. ఈ వలయం మద్యపాన వ్యసనాన్ని కూడా వెల్లడించవచ్చు. అలాగే వయోవృద్ధుల కలలో కూడా ఈ వలయాలు కనిపిస్తుంటాయి. కొందరికి సహజంగానే కళ్లు బయటకు పొడుచుకు వచ్చినట్లు ఉండొచ్చు. కానీ ఉబ్బెత్తు కళ్లు లేనివారికి కళ్ళు బయటకు పొంగుతున్నట్లుగా రావడం మొదలైతే అందుకు థైరాయిడ్ గ్రంధి సమస్య కారణం కావచ్చు. దీనికి చికిత్స తీసుకోవాలి. ఒకటి కన్నా బయటకు పొడుచుకు వచ్చినట్లయితే ఏదైనా గాయం లేదా ఇన్ఫెక్షన్ దానికి కారణం కావచ్చు. కంటి వెనుక ట్యూమర్ ఏర్పడడం కూడా కారణం కావచ్చు.

కనురెప్పలు అదరటం కూడా చాలా తరచుగా జరుగుతుంటుంది. దీనికి ఇరిటేషన్, శరీరంలో వేడి సెగలు కారణం కావచ్చు. ఒక్కోసారి అవి కనిపించే దానికన్నా చాలా తీవ్రంగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటాయి. ఈకలు లేదా కనురెప్పలు ఆడటం అనే ఈ పరిస్థితి చాలా వరకు ఒత్తిడి వల్ల కానీ పోషకాహార సంతులనం లోపించడం వల్ల కానీ అధిక మోతాదులో కెఫిన్ సేవించడం వల్ల కానీ జరుగుతుంది. అయితే దీని వల్ల ఎలాంటి ప్రమాదం లేదు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Tuesday, July 30, 2024, 17:10 [IST]
Desktop Bottom Promotion