Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
అర్థరాత్రి ఆకలేస్తుందా? ఇవి తింటే గుర్రంలా చలాకీగా ఉంటారు
రాత్రిపూట చాలామందికి ఆలస్యంగా పడుకునే అలవాటు ఉంటుంది. కొంతమంది ఉద్యోగులు అయితే నైట్ షిఫ్ట్ లలో వర్క్ చేస్తుంటారు. మరికొందరు అయితే అర్థరాత్రి దాకా ఫోన్లు పట్టుకొని సోషల్ మీడియాలోనే గడుపుతుంటారు. తగినంత నిద్ర లేకుంటే ఆరోగ్య పరంగా ఇబ్బందులు తలెత్తుతాయి అని తెలిసి కూడా కొందరు రాత్రిళ్లు లేట్ గా పడుకుంటారు. అదే సమయంలో తీసుకునే ఫుడ్ కూడా సరిగ్గా ఉండక అనారోగ్యాలను ఏరికోరి తెచ్చుకుంటారు.
అయితే కొంతమందికి రాత్రి 9 లేదా 10 గంటల సమయంలో తిన్నా కూడా అర్థరాత్రి పూట మళ్లీ ఆకలేస్తుంటది. దీంతో ఇంట్లో తినడానికి ఏముందా అని వెతుకులాడుకుంటారు..బ్యాచిలర్స్ అయితే నైట్ టైమ్ రోడ్లమీదకి ఏం దొరుకుతుందా తినడానికి అని పరుగులు పెడతారు. అయితే ఆ సమయంలో అడ్డమైన ఫుడ్స్ అని తిని అనారోగ్యం బారినపడుతుంటారు. కాబట్టి అర్థరాత్రి ఆకలేస్తే ఏ ఆహారాలు తినడం ఆరోగ్యానికి మంచిదో ఇప్పుడు చూద్దాం.

అర్థరాత్రి టైంలో తినాలనుకుంటే ఇవి బెటర్
వేయించిన మూంగ్ దాల్
మూంగ్ దాల్ చాలా కాలం పాటు కడుపుని నిండుగా ఉంచుతుంది. కాబట్టి పొడి పాన్‌లో కొంత మూంగ్ దాల్ వేయించి అల్మారాలో డబ్బాలో పోసి ఉంచండి.డ్రై పాన్ ఫ్రైడ్ మూంగ్ దాల్ చాలా ఆరోగ్యకరమైన ఆహారం. అర్ధరాత్రి అల్పాహారం కోసం ఇది ఆరోగ్యకరమైన స్నాక్స్‌లో ఒకటి.
మఖానా
తక్కువ కేలరీల ఫుడ్ అయిన మఖానాను ఆరోగ్యకరమైన చిరుతిండిగా తినవచ్చు. మఖానాను అర్ధరాత్రి మాత్రమే కాకుండా రోజులో ఎప్పుడైనా తినవచ్చు. మఖానా తినడం వల్ల మీ పొట్ట ఎక్కువ సమయం పాటు నిండుగా ఉంటుంది. తక్కువ కేలరీల ఆహారాలలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. మఖానా ఎక్కువగా తినడం కూడా చాలా రుచిగా ఉంటుంది. అందుచేత రాత్రిపూట నిద్ర లేచి తినే అలవాటు ఉన్నవాళ్లు మఖానాను తమ దగ్గరే ఉంచుకోండి.
పాప్ కార్న్
అర్ధరాత్రి ఆకలి అనిపిస్తే పాప్ కార్న్ తినొచ్చు. ఇది చాలా సమయం కడుపుని నిండుగా ఉంచుతుంది. పాప్‌కార్న్‌లో కేలరీలు, కొవ్వు చాలా తక్కువ. కాబట్టి బరువు పెరిగే అవకాశం ఉండదు. అందువల్ల, పాప్‌కార్న్‌ను రోజులోని ఇతర సమయాల్లో తినవచ్చు. ఈ పాప్‌కార్న్ తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లోనే తయారు చేయడానికి ప్రయత్నించండి.
ఓట్స్
రాత్రిపూట కొంచెం ఎక్కువ ఆకలిగా అనిపిస్తే మసాలా ఓట్స్ తినవచ్చు. దీనిని తయారు చేయడం కూడా సులభం. ఓట్స్‌లో కేలరీలు తక్కువగానూ, పీచుపదార్థాలు ఎక్కువగానూ ఉంటాయి. కాబట్టి ఈ ఆహారం మీ పొట్టను ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. మీరు మసాలా ఓట్స్‌లో వివిధ రకాల కూరగాయలను కలపవచ్చు. ఫలితంగా ఈ ఆహారం మరింత పోషకమైనదిగా ఉంటుంది
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
