Latest Updates
-
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి! -
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా? -
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే..
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.!
జంక్ ఫుడ్ అంటే చాలు చాలా మంది పిల్లలు ఎగబడుతుంటారు. కానీ ఇంటి భోజనం విషయానికొస్తే మాత్రం ఎక్కువగా ముఖం చాటేస్తుంటారు. కారణం ఇంటి భోజనంలో ఎన్ని పోషకాలు ఉన్నా.. జంక్ ఫుడ్‌లోని రుచి, ప్రిజర్వేటివ్స్ కారణంగా వాటినే తినడానికి ఇష్టపడతారు. అయితే ఇలాంటి ఫుడ్ పిల్లల ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇంట్లో చేసిన ఆహారాన్ని ఎంతో ఇష్టంగా తినేలా స్నాక్స్ చేయండి. లొట్టలేసుకుంటూ తినేస్తారు.

పిజ్జా, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్, శాండ్‌విచ్, నూడుల్స్, ఫ్రైడ్ రైస్ ఇలా బయట దొరికే జంక్ ఫుడ్‌ని పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు. రుచిగా ఉండటంతో తరచుగా తినడానికి మొండికేస్తారు. కానీ ఇలాగే జంక్‌ఫుడ్ ఎక్కువగా తింటే శరీరానికి తగిన పోషకాలు అందవు. ఈ క్రమంలో పిల్లల ఆహారంలో ఆరోగ్యకరమైన ఇంటి భోజనాన్ని చేర్చడం మేలు. వీటిని అలవాటు చేయడం ద్వారా దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
ప్రొటీన్, విటమిన్లు కాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలను పిల్లకు ఇవ్వడం ద్వారా వారి శారీరక, మానసిక ఆరోగ్యానికి దోహదపడుతుంది. ఈ క్రమంలో ఇవన్నీ పుష్కలంగా అందేలా ఇంట్లోనే ఆరోగ్యకరమైన స్నాక్స్ ఎలా చేయాలో చూద్దాం..

ఓట్స్ వెజ్ కట్లెట్
కట్‌లెట్ చేసేటప్పుడు కొన్ని ఓట్స్ యాడ్ చేసుకోవడం వల్ల రుచిగా ఉండటంతో పాటు పిల్లల ఆరోగ్యానికి బెస్ట్. ఉడికించిన బంగాళాదుంపలు, ఓట్స్, క్యారెట్, బఠానీ, క్యాప్సికమ్‌లను కలిపి కట్‌లెట్స్‌లా తయారుచేసుకోవాలి. పాన్‌లో కొద్దిగా నూనె వేసి ఈ కట్‌లెట్‌లను కాల్చుకోవాలి. వీటి ద్వారా ఫైబర్, విటమిన్లు, మినరల్స్ అంది పిల్లలకు పోషణ ఇస్తుంది. త్వరగా కడుపు నిండిన భావన కలిగిస్తుంది.
పనీర్ కార్న్ శాండ్‌విచ్
పనీర్ చీజ్, ఉడికించిన మొక్కజొన్న, ఉడికించి క్యాప్సికమ్, తేలికపాటి మసాలాలను కొద్దిగా నూనె వేసి వేయించాలి. ఈ స్టఫ్‌ను బ్రౌన్ బ్రెడ్ తీసుకుని వాటిపై నింపి మరోసారి కాల్చుకోవాలి. బర్గర్‌లకు ప్రత్యామ్నాయంగా వీటిని చేసుకుని తినడం ద్వారా ప్రొటీన్, కాల్షియం సమృద్ధిగా అందుతుంది.
బేసన్ వెజ్ చీలా రోల్
క్యారెట్, పాలకూర, ఉల్లిపాయలను సన్నగా తరిగి శనగపిండిలో కలుపుకోవాలి. ఈ మిశ్రమంతో చిన్న ముద్దలు చేసుకుని వాటి లోపల పనీర్‌తో చేసిన స్టఫ్‌ను రోల్ చేసుకోవాలి. ఇదిపిల్లలకు మంచి స్నాక్‌లా ఆరోగ్యకరంగా ఉంటుంది.

ఆపిల్ పాన్‌కేక్
ఆపిల్‌ను తురిమి.. ఓట్స్ పిండి లేదా గోధుమ పిండితో కలుపుకోవాలి. చిన్న చిన్న పాన్ కేక్‌ల్లాగా చేసుకుని పెనం మీద కాల్చుకోవాలి. ఆపిల్‌లోని స్వీట్‌నెస్ కారణంగా పిల్లలకు రుచికరంగా ఉంటుంది. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్‌లో వీటిని పెట్టవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications