Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
ఛాయ్ తాగుతూ సిగరెట్ కాలుస్తున్నారా? వీసా లేకుండానే ఈజీగా అక్కడికి వెళ్లిపోవచ్చు!
ఈ రోజుల్లో టీ,కాఫీలు తాగనోళ్లు చాలా తక్కువమందే ఉంటారు. కొంతమంది అయితే రోజులో నాలుగైదు కప్పుల టీ కూడా తాగుతుంటారు. అయితే ఇందులో కొందరు టీ తాగుతున్న సమయంలో సిగరెట్ కూడా కాల్చుతున్నారు. టీ తాగుతూనే ధూమపానం చేసేటోళ్లను నిత్యం మన రోడ్లమీద టీ షాపుల దగ్గర చూస్తూనే ఉంటాం. అయితే టీ తాగుతూ సిగరెట్ కాల్చితే ఏమవుతుందో తెలుసా? టీ ఆరోగ్యానికి మంచిదని,ధూమపానం ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతుంటారు..ఈ క్రమంలో టీ తాగుతూ ధూమపానం చేస్తే మన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినే అనేక జబ్బులు గ్యారెంటీ అని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
టీ తాగుతూ ధూమపానం చేస్తే జరిగేది ఇదే
క్యాన్సర్
టీ తాగుతూ ధూమపానం చేయడం వల్ల అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందట. అన్న వాహిక అనేది గొంతు నుంచి కడుపుకు ఆహారాన్ని తీసుకెళ్లే ఒక పొడవైన సన్నని గొట్టం. అన్నవాహిక క్యాన్సర్ అంటే అన్నవాహికలో కణాలు అసాధారణంగా పెరిగి లేదా నియంత్రణ లేకుండా పెరగడం ద్వారా ఏర్పడే ఒక రకమైన క్యాన్సర్. వేడి టీ..అన్నవాహిక కణాలను దెబ్బతీస్తుందని,సిగరెట్ లోని రసాయనాలు ఆ కణాలను మరింతగా నష్టపరుస్తాయిని..ఫలితంగా ఇది క్యాన్సర్ కు దారితీస్తుందని నిపుణులు తెలిపారు. అంతేకాకుండా గొంతు క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు.

గుండె సంబంధిత సమస్యలు
సిరెట్ తాగడం వల్ల రక్తనాళాలు కుంచించుకుపోతాయి,రక్తపోటు పెరుగుతుంది. టీలో ఉండే కెఫిన్ కూడా రక్తపోటుని పెంచుతుంది. ఈ రెండూ కలిస్తే గుండెపోటు,స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇది నాడీ వ్యవస్థను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
జీర్ణ కోశ సమ్యస్యలు
టీలో ఉండే టానిన్లు,సిగరెట్ లోని రసాయనాలు జీర్ణక్రియను నెమ్మదింపజేస్తాయి. ఇది మలబద్ధకం, అసిడిటీ, గ్యాస్ట్రిక్,అల్సర్ వంటి సమస్యలకు దారితీస్తుందని నిపుణులు తెలిపారు.
వంధ్యత్వం
టీ,సిగరెట్ రెండూ కలిసినప్పుడు మగవాళ్లలో శుక్ర కణాల నాణ్యత, స్త్రీలతో అండాశయాల పనితీరు ప్రభావితమవుతాయి.
ఇవి కూడా
టీ తాగుతూ ధూమపానం చేయడం వల్ల దంత, చిగుళ్ల సమస్యలు, శ్వాసకోశ సమస్యలను కూడా ఎదుర్కోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. టీ తాగుతూ సిగరెట్ కాల్చితే ఆనారోగ్య సమస్యలతో తొందర్లోనే వీసా లేకుండానే పైకి పోవడం గ్యారెంటీ అని చెబుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications