For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాలీ పిల్ తో గుండె జబ్బులు మటుమాయం!

By B N Sharma
|

A Polypill Can Reduce Heart Disease?
ప్రస్తుతం చాలామంది వివిధరకాల మందులు కల ఒకే ఒక పాలీపిల్ అనే కేప్సుల్ ను గుండె జబ్బులకు వాడుతున్నారు. ఈ వైద్యం చవక, సైడ్ ఎఫెక్ట్స్ అంటే పొట్టలో మంట లేదా దగ్గు మొదలైనవి రావటం లేదని తెలుస్తోంది. ఈ మందును వాడిన వారు తమ గుండె జబ్బులను, గుండె పోటును 80 శాతం తగ్గించుకున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ మెడిసిన్ రక్తపోటు, కొలెస్టరాల్ ప్రధానంగా తగ్గించటానికి గాను కేడిలా కంపెనీ మన దేశంలో ప్రవేశ పెట్టింది. గుండె జబ్బులకు, పోటును అరికట్టటానికిగాను కొద్దిపాటి ఆస్పిరిన్ కూడా దీనిలో వుంది. అత్యధిక గుండెజబ్బుల రోగులుకల భారతదేశానికి ఈ మెడిసిన్ ఒక పెద్ద వరంగా వచ్చింది. ఈ డ్రగ్ లో 75 ఎంజి ఆస్పిరిన్, రక్తపోటుకు సంబంధించి రెండు మందులు లిసినోప్రిల్ (10 ఎంజి),హైడ్రోక్లోరోధియజైడ్ (12.5 ఎంజి), కొలెస్టరాల్ తగ్గించటానికి ఉపయోగపడే మందు సింవాస్టాటిన్ వున్నట్లు తెలుస్తోంది.

గుండె జబ్బులేని వారు కూడా 55 సంవత్సరాలు పైబడితే ఈ మందును వాడి తగిన ఫలితాలను పొందవచ్చునని వైద్యులు చెపుతున్నారు. ధర అందరికి అందుబాటులో వున్నది. సురక్షితంగా పనిచేస్తుంది. దీర్ఘకాలం వాడినా నష్టం లేదని చెపుతున్నారు. ఈ పాలీ పిల్ ప్రపంచంలోని రక్తపోటు, కొల్లస్టరాల్, గుండె సంబంధిత వ్యాధులగలవారందరకు ఒక దివ్యమైన ఔషధమని పరిశోధకులు వెల్లడించారు.

English summary

A Polypill Can Reduce Heart Disease? | పాలీ పిల్ తో గుండె జబ్బులు మటుమాయం!

This polypill consumption everyday by people suffering from such problems would reduce and these are the main reasons for heart problems like Abnormal Ekg which is a result of too much fat in arteries, valvular heart disease is due to blood pressure problems and has become very common among the people.
Story first published:Wednesday, September 7, 2011, 11:17 [IST]
Desktop Bottom Promotion