Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
సన్నగా వుంటే గుండె జబ్బులు రావనుకోకండి!

ఒక తాజా అధ్యయనం మేరకు, దక్షిణ ఆసియా నివాసులు తమ అంతర్గత అవయవాలకు అంటే లివర్ మొదలగువాటికి అధిక కొవ్వును కలిగి వుంటారని, దీని కారణంగా బరువు పెరిగిపోతారని, అయితే, ఇతర ప్రాంతాలజాతుల వారు కొవ్వును తమ నడుము వద్ద మాత్రమే కలిగి వుంటారని కనిపెట్టారు. కనుక ఆరోగ్యంగానే బయటకు కనపడే భారతీయులలో గుండెజబ్బులు, మెటబాలిక్ సమస్యలు అధికంగా ఎందుకొస్తున్నాయనేది దీని్నబట్టి అర్ధం అవుతోంది.
దక్షిణ ఆసియా వాసులలో అంతర్గత అంగాలకు అంటుకుని పెరిగే కొవ్వు అధికం కావటం చేతే డయాబెటీస్, గుండె జబ్బులు వస్తున్నాయని మెక్ మాస్టర్ యూనివర్శిటీకి చెందిన డా. సోనియా ఆనంద్ పేర్కొన్నట్లు ప్లస్ వన్ మెడికల్ జర్నల్ ప్రచురించింది. ఇతర ప్రాంత తెల్లవారితో పోలిస్తే, ఆసియావాసులకు చర్మం క్రింద కొవ్వు పెట్టుకోడానికి తక్కువ జాగా వుందని రీసెర్చర్లు చెపుతున్నారు. ఈ రకంగా వున్న కొవ్వు పొట్టలో వున్న లివర్ కు ఇతర అంగాలకు చేరిపోతుంది. దానితో గ్లూకోజు, అధికమొత్తాలలో ఇతర ద్రవాలు ఊరి చివరకు గుండె సమస్యలకు దోవతీస్తుంది.
దక్షిణాసియా ప్రజలు ఆరోగ్యవంతులైనప్పటికి ఇతర దేశాల తెల్లవారితో పోల్చితే మెటబాలిజం ప్రక్రియ తక్కువలో వుంది. భారతదేశ ఉపఖండ ప్రజలలోనుండి వచ్చే రోగులను ట్రీట్ చేయటంలో వైద్యులు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నట్లు అధ్యయనానికి సహకరించిన కెనడియన్ ఒబేసిటీ నెట్ వర్క్ డైరెక్టర్ డా. ఆర్య శర్మ తెలిపారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications