For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుండె ఆరోగ్యానికి మేలు చేసే చేప ఆహారం!

By Pratap
|

How To Eat Fish In Heart Healthy Ways?
చేప ఆహారం గుండె ఆరోగ్యానికి మంచిదని పోషకాహార నిపుణులు చెపుతున్నారు. నేటి రోజుల్లో తరచూ తినే వివిధ రకాల మాంసం కంటే కూడా చేప ఆహారం మంచిదని ఆధునిక పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. చేప ఆహారం గుండెకు ఎలా మంచిదో చూద్దాం.....

చేప ఆహారంలో ఫ్యాటీ యాసిడ్స్ వుంటాయి. ప్రత్యేకించి సముద్రపు చేపలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వుంటాయి. వీటిలో వుండే కొవ్వు శరీరంలో మంచి కొల్లస్టరాల్ స్ధాయిని పెంచుతుంది. ఫలితంగా రక్తనాళాలలో ఏర్పడే బ్లాకులను తొలగించేందుకు సహకరిస్తుంది.

గుండెకు ఏ రకమైన చేపలు ఆరోగ్యం అంటే....మీ గుండెకు సరైన చేప ఆహారాన్ని మీరు ఎంచుకోవాలి. లేదంటే గుండెకు సమస్య వచ్చిందన్నమాటే. శరీరానికి మంచి కొల్లెస్టరాల్ అందించి...సాల్మన్, సార్డైన్, హెర్రింగ్, టూనా, ట్రౌట్, కాడ్ మొదలైన రకాల చేపల ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. గుండె ఆరోగ్యంగా వుండాలంటే వారానికి కనీసం 8 నుండి 10 ఔన్సుల చేప ఆహారాన్ని తినాలి. అంటే రోజుకు కనీసం 25 గ్రాముల చేప ఆహారం వుంటే చాలు. చేపలు తినేటపుడు మాంసాన్ని మాని వేస్తే మంచిది. రెండూ తింటే కేలరీలు అధికమైపోతాయి.

చేపలను వండటం ఎలా? మాంసం వలే కాకుండా చేపలను వండటం చాలా కష్టం. చాలామంది వీటిని అధికంగా వేడిచేసి పోషకాలు పోగొడతారు. అతిగా వేడి చేస్తే వాటిలో వుండే పోషకాహారాలు పోయి ఫలితాన్నివ్వవు. వాటిని కొద్దిపాటి గ్రిల్లింగ్ చేస్తే చాలు. వాసన మరీ ఘాటుగా వుంటే మైక్రోవేవ్ ఒవెన్ ఉపయోగించి వండండి. తేలిక, త్వరగా అయిపోతుంది. చేపను వండటానికి ఎల్లపుడూ ఆలివ్ ఆయిల్ వాడండి. చేపలోనే నూనె బాగా వుంటుంది. మీరు చేసే చేపకూరకు అధికంగా నూనె వాడాల్సిన పనిలేదు. ఈ చిట్కాలు ఉపయోగించి చేప ఆహారం తిని ఆరోగ్యం పొందండి.

English summary

How To Eat Fish In Heart Healthy Ways? | గుండె ఆరోగ్యానికి మేలు చేసే చేప ఆహారం!

You need about 8-10 ounces of fish every week for a heart healthy meal. That could be spread out to about 25 gram portions of fish per day. However, fish will constitute the protein portion of your diet so you can exclude the meat when you eat fish.
Story first published:Friday, October 7, 2011, 14:05 [IST]
Desktop Bottom Promotion