Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
గుండెలో మంటా? ఇంట్లోనే చికిత్స చేసుకోండి!

ఎసిడిటీ, గ్యాస్ ల కారణంగా ఈసోఫేగస్ దెబ్బతినకుండా ఒక వాల్వ్ వుంటుంది. ఈసోఫేగస్ పొట్టను ఫేరీక్స్ ను కలుపుతుంది. ఈ వాల్వ్ దెబ్బతిన్నా లేక సరిగా పనిచేయకపోయినా ఎసిడిటీ మరియు గ్యాస్ గుండె వెనుకగల రిబ్స్ వద్ద బ్లాక్ అయి గుండె మంట వస్తుంది. ఈ ప్రక్రియను రిఫ్లక్స్ అంటారు. గుండె మంట సూచనలు సాధారణంగా వికారం, త్రేన్పులు, కొద్దిపాటి గుండె నొప్పి, మొదలైన వాటితో వస్తాయి. ఈ గుండె మంటకు కొన్ని పరిష్కారాలు చూడండి.....
1. పెప్పర్ మింట్ టీ - అధిక యాసిడ్ ను ఉత్పత్తి చేసే పొట్ట కండరాలకు హాయి కలిగించే శక్తి పెప్పర్ మెంట్ లోని మెంధాల్ కు వుంది. పొట్ట కండరాలు సంకోచించటం అరికట్టగలిగితే, అది పొట్టనుండి అధిక యాసిడ్ రావటాన్ని ఆపుతుంది. పెప్పర్ మెంట్ వాడకం ఇంట్లో చేసుకునేటందుకు మంచి చికిత్స.
2. బేకింగ్ సోడా మరియు నీరు - నీళ్ళల్లో ఒక చెంచాడు బేకింగ్ సోడా వేసుకొని బాగా కలిపి తాగండి. గుండె మంటనుండి తక్షణ రిలీఫ్ వస్తుంది. రుచి బాగా లేకపోయనప్పటికి బాగా పని చేస్తుంది. బేకింగ్ పౌడర్ లో వుండే సోడియం బాగా పనిచేస్తుంది.
3. బొప్పాయి పండు- బొప్పాయి పండులో పాపెయిన్ అనే పదార్ధం వుంది. ఇది ఆహారాన్ని త్వరగా జీర్ణం చేసి పొట్టలోని అసౌకర్యాన్ని, గుండెలో వచ్చిన మంటను కూడా తగ్గిస్తుంది.
4. అల్లం- అల్లం కు మంట తగ్గించే శక్తి వుంది. సుమారు 500 మి.గ్రా. అల్లం పచ్చిది లేదా ఇతర ఆమారంతో కలిపి తీసుకోండి. లేదా అల్లం టీ తాగి రిలీఫ్ పొందండి.
5. బాదం పప్పు - గుండె మంట వచ్చినపుడు రెండు బాదం పప్పులు తినండి. వీటిలో వుండే అధికమైన నూనె పొట్టలో ఏర్పడిన ఎసిడిటీని దూరం చేస్తుంది. వెంటనే గుండెమంట తగ్గుతుంది.
గుండెమంట త్వరగా పోవాలంటే, గ్యాస్ అంటూ మందులు వాడే కన్నా ఇంట్లోనే ఈ చికిత్సలు జరుపుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications