For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుండె పోటుకు కారణాలేమిటి?

By B N Sharma
|

Triglyceride v/s Cholesterol
తాజా పరిశోధనల మేరకు 2015 నాటికి భారత దేశంలో సంవత్సరానికి 1.6 మిలియన్ల గుండె పోటు కేసులు వుంటాయని అంచనాగా తేలింది. కారణం కొల్లెస్టరాల్ స్ధాయి పెరగటం. డెన్మార్క్ లో చేసిన తాజా పరిశోధనలో భారతదేశంలో వచ్చే గుండెపోట్లు చెడు కొల్లెస్టరాల్ కంటే కూడా ట్రిగ్లీసెరైడ్స్ స్ధాయి అధికంగా వుండటం వలనే వస్తున్నట్లు తేలింది.

ఆహారం అధికంగా తినటం వలన మహిళలలోను, పురుషులలోను ట్రిగ్లీసెరైడ్స్ స్ధాయి పెరుగుతోందని, ఈ అదనపు కేలరీలు లివర్ లో ఫ్యాట్ సెల్స్గా చేరి క్రమేణా చెడు కొల్లెస్కటరాల్ కు జత అవుతున్నాయని ఫలితంగా రక్త నాళాలలో మందకొడితనం ఏర్పడుతోందని తేలింది. ట్రిగ్లీసెరైడ్ ల స్ధాయి 350 కి మించితే, గుండెపోటు అవకాశం వున్నట్టే. 2004 సంవత్సరంలో భారతదేశంలో ట్రిగ్లీసెరైడ్ స్ధాయి పెరిగిన కారణంగా 9.3 లక్షల గుండెపోటు కేసులు రాగా వారిలో 6.4 లక్షలమంది మరణానికి గురయ్యారు.

ఈ పరిశోధనా ఫలితం ప్రధానమైందని, భారతీయులలో అధిక ఆహారం తీసుకోవటంవలన ఏర్పడే ట్రిగ్లీసెరైడ్స్ స్ధాయి పెరగటం గుండెపోటుకు దారితీస్తోందని, దానికి తగిన పరిష్కారాలు పరిశోధనలు చూపగలవని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు చెందిన న్యూరాలజీ ప్రొఫెసర్ డా. కామేశ్వర్ ప్రసాద్ తెలిపారు.

English summary

Triglyceride v/s Cholesterol – What's Causing Stroke? | గుండె పోటుకు కారణాలేమిటి?

According to the study made in “Annals of Neurology" In India stroke levels are directly related to high levels of triglyceride. In 2004, India reported 9.3 lakh cases and 6.4 lakh deaths by stroke due to triglyceride. Thus, proving that high triglyceride causes stroke.
Story first published:Tuesday, October 11, 2011, 10:47 [IST]
Desktop Bottom Promotion