Just In
- 11 min ago చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- 21 min ago తీర్చుకోలేని రుణం అమ్మ ప్రేమ..! అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు..
- 1 hr ago ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- 2 hrs ago మీనరాశిలో కుజుడు-రాహువు కలయిక వల్ల అంగారక యోగం ఏర్పడుతుంది..జూన్ 1 వరకు ఈ రాశులకు కష్టాలు తప్పవు..జాగ్రత్త
గుండెపోటు ఉదయం వస్తే...మరణమే!
ఉదయం
వేళ
గుండెపోటు
మరణాలకు
కారణాలు
పరిశీలిస్తే...!
శరీరానికి
ఉదయం
వేళ
అవసరమైన
ఆక్సిజన్
డిమాండు
,
సరఫరాలలో
సమతుల్యత
లోపిస్తుందంటారు
డా.
రాబర్ట్
మాన్
ఫ్రెడ్డిని.
ఉదయంవేళలో
శరీరానికి
అవసరమైన
పనులు
అంటే
మేల్కొనటం,
పక్క
ఎత్తటం,
వంటచేయటం
లాంటి
చర్యలకు
అధిక
ఆక్సిజన్
కావాలి.
అడ్రినల్
హార్మోన్
కార్టిసోల్
అనే
హార్మోను
ఈ
సమయంలో
అధిక
రక్తపోటును
కలిగిస్తుంది.
దానితో శరీరం అధిక ఆక్సిజన్ కోరటం అదే సమయంలో రక్తనాళాలు గుండెకు సరఫరా అయ్యే ఆక్సిజన్ ను ఆపేయటం కాదుగాని తగ్గించటం వంటివి జరుగుతుంది. ఆక్సిజన్ సరఫరాలోని ఈ అసమతుల్యత ఉదయంవేళ గుండెపోట్లకు కారణమవుతోంది. శరీరం అలవాటు పడటానికి గాను ఉదయం వేళ ప్రతిపనికి కొంత సమయం తీసుకోవాలని పరిశోధకులు చెపుతున్నారు.
అంతేకాక ఉదయంవేళ శరీరంలోని ఫిబ్రినాలిసిస్ తక్కువ స్ధాయిలో పని చేస్తుంది. అప్పటిదాకా శరీరం విశ్రాంతిలో వుండటంతో రక్తం గడ్డలు రక్తనాళాలను అడ్డగిస్తాయి. వీటిని కరిగించేందుకు ఫిబ్రినాలిసిస్ పనిచేయాలి. ఉదయంవేళ ఇది తక్కువస్ధాయిలో పనిచేస్తుంది. కనుక రక్తం గడ్డలు అన్నీ కరగవు. ఇది గుండెకు రక్తసరఫరాను అడ్డగిస్తుంది. మరోవైపు ఉదయం వేళ పనులంటూ శరీరం అధిక ఆక్సిజన్ కోరుతుంది. ఈరకంగా రక్త ప్రసరణ తగ్గటం శరీరం రక్తప్రసరణ అధికంగా కోరటంతో తప్పని సరిగా గుండెపోటు వచ్చి మరణాలకు దారితీస్తోందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.