Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
మహిళలకు గుండె పోట్లు మరింత తీవ్రం?

రెండు సంవత్సరాల క్రిందట ధెరిసా వోల్పే 40 సం. తీవ్రమైన గుండె పోటుతో బాధపడింది. కళ్ళు బైర్లు కమ్మటం, అలసట, ఛాతీలో నొప్పి వంటివి వున్నప్పటికి వాటితో ఆమె అజీర్ణంకు సంబంధించిన లక్షణాలుగా అందరూ భావించారట. తలతిరగటం, తేలికైపోవటం చేతులు బరువెక్కటం, బరువు తగ్గడం వంటివి లక్షణాలుగా తరచుగా కనబడేవట. వైద్యులు పరీక్షించి గుండె కొట్టుకునే రేటు అధికంకాదని అదంతా నీ అందోళన మాత్రమే అనేవారట. కాని ఒకసారి ఆమెను పరీక్షించిన కార్డియాలజిస్టు ఆమెను వెంటనే ప్రత్యేక హార్ట్ చికిత్సా కేంద్రానికి తరలించి ఆమె గుండెలోని ప్రధాన రక్తనాళాలు 90 శాతం వరకు గడ్డలతో బ్లాక్ అయినట్లు గుర్తించాడట.
అంతే వెంటనే చికిత్స చేసి ఆమె గుండె పోటు బారిన పడకుండా కాపాడాడు. కనుక మహిళలలో లక్షణాలు పైకి తేలికగా కనపడినప్పటికి వారికి లోలోపల వ్యాధి ముదిరి ఒకే పెట్టున తీవ్రంగా వచ్చి మరణాన్నిస్తుంది. 1993 నుండి 2006 ల మధ్య షుమారు 130,000 మంది ఆడ, మగ గుండె రోగులను స్టడీలో పరిశీలించారు. వారు చేసిన స్టడీలన్నిటిలోను గుండెపోటు వచ్చిన మొదటినెలలోనే మహిళలు 9.6 శాతంమంది చనిపోగా, పురుషులు మాత్రం 5.3 శాతంగా మాత్రమే మరణించారని వెల్లడైంది.
మహిళలకు పురుషులకంటే కూడా అధిక వయసులోనే గుండెపోట్లు వస్తాయట. మహిళలలో కూడా డయాబెటీస్, రక్తపోటు, గుండె విఫలత వంటివి అధికంగానే వున్నాయి. అయితే, మహిళలే గుండెపోట్లతో అధికంగాను, త్వరగాను చనిపోతున్నారనేది సరికాదని ఓహియో, క్లీవ్ లాండ్ లోని సెంటర్ ఫర్ ధ్రాంబోసిస్ మరియు వాస్కులర్ బయాలజీ డైరెక్టర్ డా. స్టీవెన్ నిస్సాన్ తెలిపారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications