Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే!
కార్డియాక్ ఎన్ లార్జ్ మెంట్ - దుష్పరిణామాలు!

వ్యాధులు రావచ్చు. గుండెలోని కండరం పరిమాణం పెరిగి అది సరిగ్గా పనిచేయకపోవడం వలన హార్ట్ ఫెయిల్యూర్ వ్యాధి రావచ్చు. అంతేకాకుండా
వీటివలన గుండె కొట్టుకోవడంలో మార్పులు వచ్చి ఒక్కోసారి మనిషి చనిపోవచ్చు. అంతేకాకుండా రక్తప్రాసారం సరిగ్గా జరగక ఎంజైనా, హార్ట్ ఎటాక్
వంటి వ్యాధులు కూడా వచ్చే అవకాశముంది.ఒక్కోసారి కొందరు వ్యక్తులలో ఈ వ్యాధి వలన లక్షణాలు కనిపించకపోయినా క్రమంగా అవి బయటపడతాయి.
అవి 1) రొమ్ములో నొప్పిగా ఉండటం, 2) ఊపిరి తీసుకోవటం ఇబ్బందిగా ఉండటం, 3) గుండె అధిక వేగంతో కొట్టుకోవటం 4)
కాళ్ళు, పాదాలు, మడమల దగ్గర వాపు ఏర్పడటం. ఈ వ్యాధిని గుర్తించడానికి ఫిజీషియన్ కొన్ని సార్లు పరీక్షలు చేస్తారు. వ్యక్తిలో
బయటపడుతున్న లక్షణాలు, అధిక రక్తపోటు, కాళ్ళు, పాదాలు మడమల దగ్గర వాపు రావడం వల్ల దీనిని గుర్తించవచ్చు. రొమ్మును ఎక్స్ రే తీయడం వల్ల గుండె పరిమాణం పెరిగిందో లేదో ఊపిరితిత్తులలో ఏదైనా రక్తం ఉందో తెలుసుకోవచ్చు. ఇసిజి పరీక్ష ద్వారా కొన్ని సార్లు ఈ వ్యాధిని గుర్తించవచ్చు. అయితే, ఈ వ్యాధిని గుర్తించడానికి ఎకో కార్డియో గ్రామ్ అంటే ఇసిజిని ఉత్తమమైనదిగా చెప్పవచ్చు. దీనివలన గుండె యొక్క పరిమాణం, గుండెలోని ప్రతి కండరం యొక్క పరిమాణం తెలుసుకోవచ్చు. మనిషి ఆయుర్దాయాన్ని గణనీయంగా తగ్గించడం ఒక్కోసారి మనిషి మరణానికి కారణమయ్యే ఈ వ్యాధికి చికిత్స అత్యవసరం. కార్డియాక్ డైలేషన్ వల్ల దెబ్బతిన్న కండరాన్ని సరిగ్గా పనిచేసి గుండె పనితీరును పెంచేందుకు చికిత్స అందిస్తారు. అధిక రక్తపోటు, ధైరాయిడ్ వ్యాధులు, రక్తనాళాలలో రక్తం గడ్డకట్టుకుపోవడం ఉన్నవారు, తదితర వ్యాధుల
వారికి చికిత్స ద్వారా గుండెకు జరిగే ప్రమాదాన్ని తగ్గిస్తారు. ఆల్కహాల్ లేదా కొకైన్ వాడకం వల్ల ఈ వ్యాధి వచ్చుంటే వాటిని తగ్గించడం పూర్తిగా
నిలిపివేయటం ద్వారా చికిత్స చేస్తారు. ఒక్కోసారి దెబ్బతిన్న వాల్వ్లను మార్చడం, బైపాస్ సర్జరీ, కరోనరీ యాంజియోగ్రామ్ ద్వారా కూడా చికిత్స
చేయాల్సివుంటుంది.
సాధారణంగా గుండె మూడు పొరలను కలిగి ఉంటుంది. అవి ఎపికార్డియం, మయోకార్డియం మరియు ఎన్డో కార్డియం అని చెప్పవచ్చు. ఈ ఎన్డో కార్డియం అనేది గుండెలోని గదులలో, వాల్వ్ లలో ఉంటుంది. ఈ వ్యాధికి సరిగ్గా చికిత్స చేయకపోతే ఇది ప్రాణం పోవడానికి కూడా దారితీయవచ్చు. అంతే కాకుండా ఒక్కోసారి గుండెలోని నాళాలు దెబ్బతిని హార్ట్ ఫెయిల్యూర్ కు కారణమయ్యే ప్రమాదం కూడా ఉంది. రుమాటిక్ జ్వరం, ఆర్టిఫిషియల్ గుండె వాల్వులు, డెంటల్ సర్జరీలు, కొన్ని చర్మ సంబంధిత వ్యాధుల వలన ఈ ఎన్డోకార్డిటీస్ అనే వ్యాధి వస్తుంది. డ్రగ్స్ ఉపయోగించడం కూడా ఈ వ్యాధికి ఒక కారణంగా చెప్పవచ్చు.
ఈ వ్యాధి వచ్చిందని గుర్తించడానికి తరచూ జ్వరం రావడం, తలనొప్పి రావడం, ఆయాసం రావడం, ఆకలిలేకపోవడం, రాత్రిపూట అధికంగా చెమటపట్టడం, రొమ్ములలో, వేళ్ళు, పాదాల దగ్గర సన్నగా రక్తం కారటం లక్షణాలుగా వుంటాయి. ఈ వ్యాధిని కొన్నిసార్లు, రక్తపరీక్షలు లేదా ముఖ్యంగా ఎకోకార్డియోగ్రామా్ ద్వారా గుర్తిస్తారు. ఈ వ్యాధి నివారణకు యాంటీబయోటిక్ చికిత్స అవసరం అవుతుంది. కనీసం ఒక నెలపాటు ఈ చికిత్స చేయాల్సి ఉంటుంది. కొన్నసార్లు అత్యవసర పరిస్ధితుల్లో దెబ్బతిన్న గుండె వాల్వ్ కొరకు శస్త్ర చికిత్స అవసరమవుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications