Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
శరీరాన్నిఫిట్ గా ఉంచి గుండెను పదిలం చేసే పిస్తా...!

పొటాసియం అత్యధికం గా లబిస్తుంది-శరీరము లో ద్రవాల నియంత్రణకు పొటాషియం పనికొస్తుంది . దీనిలో ఉండే బి ప్రోటీన్ల తయారీ , శోషణము లో ఉపయోగపాడుతుంది .మిగిలిన ఎందు పండ్ల తో పోలిస్తే పిస్తా లో కేలరీలు ఎక్కువ. యాంటి ఆక్సిడెంట్ఉన్నందున ఇవి గుండె జబ్బులను తగ్గించే గుణం కలిగి ఉన్నాయి . కాన్సర్ రాకుండా కాపాడతాయని తేలినది . పిస్తా లో మోనో శాచ్యురేతేడ్ క్రొవ్వులు అధికం గా ఉన్నందున ఎక్కువగా తినకూడదు ... వారం లో 15 - 20 గ్రాములు మించి తీసుకోకూడదు . రక్తం లో కొలెస్టిరాల్ ను తగ్గిస్తాయి , అతి తక్కువ తిన్నా కడుపు నిండినట్లు గా ఉంటుంది . అందువల్ల ఆహారము తక్కువగా తీసుకోవడం జరుగుతుంది . పొట్టను పెరగ నీయదు .
పిస్తాపప్పులను ప్రతిరోజూ తీసుకుంటే గుండెను ఒత్తిడి నుంచి కాపాడవచ్చునని సైంటిస్టులు అంటున్నారు. ప్రతిరోజూ గుప్పెడు పిస్తా పప్పులను తీసుకోవడం ద్వారా లోబీపీ, హృద్రోగ వ్యాధులకు చెక్ పెట్టవచ్చునని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ నిపుణులు చెబుతున్నారు. శరీరాన్ని ఫిట్‌గా ఉంచడంలోనూ పిస్తా పప్పులు ఎంతగానో ఉపయోగపడతాయని వారు సూచిస్తున్నారు.
ఆధునిక యుగంలో బిజీ షెడ్యూల్ కారణంగా అనేకమంది రక్తపోటుతో బాధపడుతున్నారు. ఇంకా ఒత్తిడి కూడా పెరిగిపోతోంది. ఫలితంగా హృద్రోగ వ్యాధులు కూడా ఎక్కువైపోతున్నాయని జర్నల్ హైపర్‌టెన్షన్ రచయిత డాక్టర్ షీలా వెల్లడించారు. అందుచేత ప్రతిరోజూ పిస్తా పప్పులను తీసుకోవడం ద్వారా గుండెపోటు, రక్తపోటును నియంత్రించవచ్చునని పరిశోధకులు సూచిస్తున్నారు.
ఇవి ఎక్కువగా తిన్నా కొలెస్ట్రాల్ పెరగదు. సాదారణంగా నట్స్ తినాలంటే కొలెస్ట్రాల్ పెరుగుతుందనే కదా దూరంగా ఉంటాం?! మరి ఆ సమస్య ఇందులో ఖచ్చితంగా లేదంటున్నారు నిపుణులు. కంటికి అత్యంత అవసరమైన 'ల్యూటిన్' మరియు 'జియాజాంథిన్' ఇందులో ఉందని పరిశోధకులు చెబుతున్నారు. హానికారక కొవ్వు అంటూ ఆమడదూరానికి పరుగెత్తుతామే, అది ఇందులో దాదాపు శూన్యమట! మరి ఆరోగ్యపరమైన కొవ్వు సంగతో! సందేహంలేకుండా సరిపడా కలదు. అందుకే సాయం సమయాలు పకోడీ, చిప్స్ ల వెంటపడకుండా కాసిని పిస్తా పప్పులు నోటిలో వేసుకుంటే ఇన్ని లాభాలు పొందొచ్చు! ఎవరైతే పిస్తా తింటారో వారికి నిండైన ఆరోగ్యం, పొందికైన సౌందర్యం పొందుతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications