Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
గుండె ఆరోగ్యంగా వుండాలంటే బీర్ తాగండి?

అధ్యయనకారులు తమ స్టడీలో ప్రపంచ వ్యాప్తంగా షుమారు రెండు లక్షల మంది వ్యక్తుల తాగుడు అలవాట్లను స్టడీ చేశారు. బీరు తగుమాత్రంగా తీసుకుంటున్నవారికి 31 శాతం గుండె సంబంధిత వ్యాధులు తక్కువగా వస్తున్నాయని తెలిపారు. ఇదే రకంగా తగుమాత్రంగా వైన్ తాగినప్పటికి గుండె వ్యాధులు తక్కువగా వస్తాయని గతంలో చేసిన పరిశోధనలు కూడా తెలిపాయి. స్టడీని యూరోపియన్ జర్నల్ ఆఫ్ ఎపిడెమియాలజీలో ప్రచురించారు. బీర్ ప్రేమికుల అలవాట్లను అరికడుతున్న వారు ఈ అధ్యయనంతో మరోమారు వారి అభిప్రాయాలను మార్చుకోవాలి.
అసలు బీర్ తాగటం మీకు ఎలా మంచి చేస్తుంది. బీర్ లో కొవ్వు, పీచు వంటివి వుండవు. కొన్ని ప్రొటీన్లు ఉంటాయి. చాలా బీర్ లలో కార్బోహైడ్రేట్లు, పొటాషియం, మెగ్నీషియం, బి విటమిన్లు కూడా వుంటాయి. ఫోలిక్ యాసిడ్ కూడా వుండి రక్తంలోని హోమో సిస్టైన్ ను తగ్గిస్తుంది. హోమో సిస్టైన్ స్ధాయి గుండె జబ్బులను తెప్పిస్తుంది. బీర్ లో సహజమైన యాంటీ ఆక్సిడెంట్లు కూడా వుంటాయి. ఫెనోలిక్స్, మెలయేడిన్స్ అనే పదార్ధాలు బార్లీ లేదా మాల్ట్ లను మరిగించినపుడు ఏర్పడి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఇవి బీరుకు రంగును రుచిని కలిగిస్తాయి. బీరులో వుండే ఈ పదార్ధాలు రక్తనాళాలు గట్టిపడకుండా కూడా చేస్తాయి.
ఆల్కహాల్ రెగ్యులర్ గా తాగే వారికి హెచ్ డి ఎల్ కొలెస్టరాల్ అంటే మంచి కొలెస్టరాల్ కనీసం 12 శాతం పెరుగుతుందని కూడా చెపుతున్నారు. అయితే రోజులో ఇవి తగుమాత్రంగా ఒకటి లేదా రెండు డ్రింకులుగా మాత్రమే వుండాలి.
అయితే, ఆల్కహాలు అధికం అయితే, గుండె సంబంధిత ఆల్కహాలిక్ కార్డియోమయోపతీ, అధిక రక్తపోటు, గుండె కొట్టుకోవడంలో మార్పు వస్తాయి. ఆల్కహాల్ మరింత అధికమైతే, లివర్ సిర్రోసిస్, కేన్సర్లు, పానిక్రియాటిటిస్, నరాల వ్యాధులు వంటివి కూడా వస్తాయి. గుండె వ్యాధులు రాకూడదంటూ ఆల్కహాల్ తాగరాదు. అదే రకంగా ఆల్కహాల్ అలవాటు లేని వారికి గుండెకు మంచిదంటూ ఆల్కహాల్ అలవాటు చేయరాదు అని కూడా రీసెర్చర్లు వెల్లడించారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications