Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
గుండెకు వ్యాయామం ఎలా?

వ్యాయామం ఏం చేస్తుంది? వ్యాయామం అధిక కేలరీలను ఖర్చు చేస్తుంది. బరువు తగ్గేటందుకు తోడ్పడుతుంది. రక్తంలో వుండే కొల్లెస్టరాల్, కొవ్వు వంటివి తగ్గించటానికి సహకరిస్తుంది. వ్యాయామం రక్తప్రసరణ పెంచి గుండె సమర్ధవంతంగా పనిచేసేలా చేస్తుంది. మరి గుండెకు అవసరమైన వ్యాయామాలు ఏవి? ప్రతిరోజూ వేగంగా నడవండి. కారు లేదా బస్ ఉపయోగించేముందు కొద్దిగా ఆలోచించండి. లిఫ్టులు లేదా ఎస్కలేటర్లవంటివి వాడే బదులు మెట్లు ఎక్కండి. మీతోపాటు కుటుంబ సభ్యులు కూడా ఆచరించేలా చేయండి. పిల్లలకు సైతం నడక చాలా మంచిది. మనం ఏ వ్యాయామం చేసినా ఆనందించేదిగా వుండాలి. పెద్దవారయ్యే కొద్దీ, సైకిలింగ్, లేదా స్విమ్మింగ్ వంటివి తేలికగా వుంటాయి. మీ ఫిట్ నెస్ స్ధాయికి తగ్గట్లు స్ధానికంగా వుండే వ్యాయామ కేంద్రాలలో చేరండి. నిపుణుల పర్యవేక్షణలో చేసే వ్యాయామాలు మంచి ఫలితాలనిస్తాయి.
కొన్ని జాగ్రత్తలు - గుండె సంబంధిత వ్యాధులు, అధిక రక్తపోటు, లేదా చాలాకాలంనుండి వ్యాయామం చేయనివారు వ్యాయామం మొదలుపెట్టేముందు వైద్యుల సలహా పొందండి. వాతావరణం అతి చల్లగా లేదా వేడిగా వున్నా లేదా భోజనం చేసిన రెండు గంటలలోపు వ్యాయామం చేయకండి. వ్యాయామానికి ముందు వామ్ అప్ తప్పనిసరి. అదే విధంగా వ్యాయామం తర్వాత శరీరాన్ని రిలాక్స్ చేసే సమయాన్ని కూడా పాటించాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications